ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Showing posts with label కవితా స్రవంతి. Show all posts
Showing posts with label కవితా స్రవంతి. Show all posts

Tuesday, April 28, 2020

కరో 'నా'... కవితలు





ఆంధ్రప్రభ దినపత్రిక సోమవారం సాహిత్య పేజీ .సాహితీ గవాక్షమ్ :13.4.2020





నమస్తే తెలంగాణ దినపత్రిక సోమవారం సాహితి పేజీ చెలిమె :20.4.2020







నవతెలంగాణ  దినపత్రిక సోమవారం సాహిత్య పేజీ దర్వాజ :20.4.2020 





   ఆంధ్రప్రభ దినపత్రిక సాహిత్యపేజీ సాహితీగవాక్షం సోమవారం 4.5.2020



నేటినిజం దినపత్రిక గురువారం సాహితీకెరటాలు 7.5.2020




Sunday, May 27, 2018

కలివిడి

 వార్త దినపత్రిక ఈ ఆదివారం అనుబంధంలో కవిత 




Sunday, December 21, 2014

తుఫాను

ఆదివారం అనుబంధం 
వార్త 
దినపత్రిక  14.12.2014 సంచికలో 
ఈ వారం కవిత్వం లో 
ప్రచురితమైన నా కవిత 




Saturday, December 6, 2014

బొమ్మర్షి

డిసెంబర్ 15 
బాపు గారి పుట్టినరోజు  సందర్భంగా  
చిత్ర మాసపత్రిక
వెలువరించిన ఈ నెల ప్రత్యేక సంచికలో 
నా కవిత 





Wednesday, March 19, 2014

సముద్రం -దూరదర్శన్‌ లో ప్రసారమైన కవిత

దూరదర్శన్‌ సప్తగిరిలో
రికార్డ్ చేయబడిన నా కవితలలో
నాలుగవది

' సముద్రం ' 
17.3.2014 ఉదయం 9 గంటలకు
సాహిత్య కార్యక్రమంలో ప్రసారమై
19.3.2014 బుధవారం ఉదయం 9.30 కార్యక్రమంలో
తిరిగి ప్రసారమైంది.

నా కెమేరా వీడియో మోడ్ లో రికార్డ్ చేసిన ఆ కవిత
ఇక్కడ యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాను


క్రింద లింక్ క్లిక్ చేసి ఆ కవిత వినగలరు.


http://youtu.be/MhIVQM_ldJg


మీ స్పందన అభిలషిస్తాను
-సుధామ 

Wednesday, March 12, 2014

సమరకపోతం కవిత

దూరదర్శన్‌ సప్తగిరి లో 
ఇవాళ 12.3.2014 సోమవారం 
సాహిత్య కార్యక్రమంలో 
చివరగా
నా కవిత 
' సమర కపోతం ' ప్రసారమయింది.

ఆ కవిత  సరదాగా
కెమెరా వీడీయో మోడ్ లో రికార్డ్ చేశాను.

యూ ట్యూబ్ లో నుంచి ఆ కవిత మీ కోసం ఇక్కడ. 
క్లిక్ చేసి వినండి. 
http://youtu.be/PlKaLbKPzuI


Monday, January 13, 2014

కవీ!



వినవస్తుంది
‘వద్దులే ఏం రాస్తావూ’
విముఖించిన అవరోధ స్వరం.
జలగలా పట్టుకు లాగేస్తున్న సారం.
ఆత్మహత్య చేసుకున్న ఉదయకిరణం సాక్షిగా
అలుముతున్న తిమిరపు అమావాస్య కుట్ర
చీకటి కప్పిన వె
న్నెల  దుప్పటి.

నిద్రపుచ్చే జోలపాటలు - డబ్బు ఘలంఘలలు
కీర్తి మువ్వల రవాలు.
శాలువా కప్పి, జ్ఞాపిక చేతులో పెట్టడం ఆలస్యం-
గర్వించిన హృదయం సృజనకు సూసైడ్ నోట్ రాసినట్లే!
రాస్తున్న అక్షరంచేప నీటి బయటపడి చావుకు
గిలగిల్లాడినట్లే!

కొండ శిఖరం అంచుదాకా ఎక్కాక
అక్కడ దిగబెట్టినది ఏ హెలికాప్టరో వెళ్లిపోతుంది.
ఎక్కినట్లు కనబడుతున్నది నీ కృషి కాక,
అందివచ్చిన అదృష్టం గాలిలోనే మాయమయ్యాక,
ఇంక ఎక్కేందుకు ఏం లేనప్పుడు
దిగి రావాల్సిందే కదా!
అక్కడే ఉండిపోలేవు.
ఎక్కడం ఎక్కేసావు గానీ దిగడం సులభం కాదు
దూకడమో, 
దొర్లడమో...
నిన్ను నువ్వు లోలోపలగా చుట్టేసుకుని.

‘వద్దులే ఏం వస్తావూ’ -
అగుపించ
ని అవరోధవ్రాతం - సమాజ సహజాతం.
నిప్పులు చిమ్ముకుంటూ ఎగరావద్దు
నెత్తురు కక్కుకుంటూ రాలావద్దు
సజావుగా నడు. సాము వద్దు నేలవిడిచి.
వెళ్లిపోవద్దు కలం ముడిచి.
ఈ రస్తాలోనే సమస్త శక్తుల మనస్కంతో అను -
నే రాస్తా!

  • - సుధామ

Wednesday, January 8, 2014

ఆకాశవాణి సర్వ భాషా కవిసమ్మేళనం






ఆకాశవాణి ప్రతిష్టాత్మక సాహిత్యకార్యక్రమాలలో
జాతీయకవిసమ్మేళనం ఒకటి.
ఏటా గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి25రాత్రి
10గంటలకు ఆకాశవాణి కేంద్రాలన్నింటినుండీ
ప్రసారమయ్య ఈ సర్వభాషాకవిసమ్మేళనానికి
ఒక్కొక్కభాషనుండి ప్రాతినిధ్యకవిని ఎంపికచేసి 22భాషల కవితలనూప్రసారంచేయడంజరుగుతుంది.

ఆహూతులసమక్షంలో జరిగే కవిసమ్మేళనంలో
ఎంపికచేసిన అనువాదకవులు ఆయాభాషలకవితల
హిందీకవితానువాదాలను కూడా వెనువెంటనేవినిపిస్తారు.

ఆయా ప్రాంతీయభాషాకేంద్రాలు అన్నికవితలనూ
తమతమప్రాంతీయభాషలలో
తమభాషాకవులతో చేయించిప్రసారంచేస్తాయి.
అంటే 25వతేదీ రాత్రితమిళకేంద్రాలు తమిళంలోనూ,కన్నడకేంద్రాలు
కన్నడంలోనూ,తెలుగుకేంద్రాలుతెలుగులోనూ
ఇలా22భాషాకేంద్రాలూ సర్వభాషాకవితల అనువాదకవితలను
తమతమభాషల్లో ప్రసారం చేస్తాయన్నమాట.

అయితే ఈసారి విశేషం 25 జనవరి రాత్రి ప్రసారమయ్యే
జాతీయ కవిసమ్మేళనం
ముందుగా రేపు జనవరి 9 వ తేదీ
సాయంకాలం 4 గంటలనుండి
హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఆర్.టి.సి.కళ్యాణమంటపం హాల్లోజరుగుతోంది.

ఆహూతులసమక్షంలో ఈసర్వభాషాకవిసమ్మేళనం
ఆయా భాషలకవులు,హిందీ కవితానువాద కవులుతో బాటుగా తెలుగు కవితానువాదకవులతోనూ హైదరాబాద్ లో జరుగుతోంది.
అనగా 22భాషలకవితలూ ,వాటిహిందీ , తెలుగు అనువాదాలతో
మొత్తం 66 మంది కవులూ
వేదికపైనుండి ప్రేక్షకులకు కనిపిస్తూ వినిపిస్తారు.

ఇదొక విశేషకార్యక్రమం.
ఈ కవిసమ్మేళనానికి అందరూఆహ్వానితులే!

1974లో తొలిసారి ఆకాశవాణి జాతీయకవిసమ్మేళనంలో
ఒరియాకవితను తెలుగు చేసి అనువాదకవిగాపాల్గొన్ననేను
1978లోఆకాశవాణిలోచేరాక
1983 లో తెలుగుకు ప్రాతినిధ్యకవిగా ఎంపికఅయ్యి
తెలుగుకవిగా పాల్గొన్నాను.

ఆహూతులసమక్షంలోడిల్లీకవిసమ్మేళనంలోవినిపించిన నాతెలుగుకవిత అన్నిభాషలలోకి అనువాదమై ఆ ఏడాది ప్రసారమైంది.
అకాశవాణిలో అప్పట్లో ట్రాన్‌స్ మిషన్‌ ఎక్సిక్యూటివ్ గా పనిచేస్తూ
దక్షిణాది నుండి ఒక స్టాఫ్ మెంబర్ కవిగాపాల్గొనడం అదేమొదటిసారి.

1991లో నేను కార్యక్రమనిర్వహణాధికారిగా పదోన్నతిచెంది
విజయవాడనుండి 1995లో హైదరాబాద్ తిరిగి వచ్చాక
తెలుగువిభాగం కార్యక్రమ నిర్వహణాదికారిగా
సుమారు దశాబ్దకాలం
జాతీయకవిసమ్మేళనం తెలుగుఅనువాదకార్యక్రమం నిర్వహించాను.

మళ్ళీ ఇన్నాళ్ళకు
ఆకాశవాణిలో పదవీవిరమణానంతరం
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో
రేపు ఆహూతులసమక్షంలో వేదికపైనుండి
బోడో భాషాకవితకు
తెలుగుఅనువాదకవిగా పాల్గొనడం
సంతోషాన్నిస్తోంది.

1983 లో నాతెలుగు కవితను హిందీచేసి వినిపించిన డాక్టర్.కున్వర్ బెచైన్‌ నాతోబాటుగా ఈ కవిసమ్మేళనంలో కన్నడకవితకు హిందీఅనువాదకవిగా పాల్గొంటూఊండడం ఒక విశేషం.

కవిసమ్మేళనం పూర్తివివరాల
ఆహ్వానపత్రంఇక్కడచూడండి.

మీరంతా ఈ కార్యక్రమానికి వచ్చి
జయప్రదం చేయగలరనిఆశిస్తూ.....

సదామీ
సుధామ






Monday, December 30, 2013

పల్లవి కవిత

నూతన సంవత్సరానికి 
స్వాగతంగా
ఆంధ్రభూమి వారపత్రిక 
9 జనవరి '2014 సంచికలో
నా 
కవిత 

Sunday, November 13, 2011

స్వీయ దృష్టం.



బరువు దిగుతున్న స్పృహ
అహమహిమికల ఊదేసిన వేళ
మనసు కాసారంలో నిశ్చలత్వం
తొలగిపోయిన ఒక జడత్వం

అవతలివారిపై అరిచిన ప్రతి సారీ
లోలోపల ఆగ్రహపులి స్వారీ
రక్తకాసారంలో విసిరిన రాయి
అల జడి కావడం ఏమి హాయి

ఇంతకీ ఇష్టపడిన కష్టం
స్వయంకృతమైన నష్టం
అంతరాంతర స్వీయ దృష్టం
పవిత్రత గో పృష్టం

సనాతనమని సరదాపడడమో
అధునికమని ఆత్రపడడమో
కాలవాచి కలకలం ఏదైనా
కాలరాచి పోగలమా

ఒక్కొడొక్కడుగా శతృవు డొక్కశుద్ది వున్నవాడే
తలవంచకపోయినా తలవూచక తప్పదు
ప్రతిభామతి కి ప్రణమిల్లక తప్పదు
సర్దుకుంటే అంతా సద్దుమణుగుతుంది

ఎగిరెగిరిపడి ఏం ప్రయోజనం
నీతో నాతో వుండాల్సింది ఈ జనం
ఎవరిని దూరం చేసుకున్నా నష్టం మనకే
చిందరవందరవుతుంది మనికే

వెనక్కి అనుకోకు వెనువెంటకు మటుకే
విజయలక్ష్మి ఎప్పుడూ ముందే వుండదు
తగ్గడంలో ఎగ్గు తెగడమూ వుంది
సిగ్గు బొగ్గైపోయినా నిగ్గు జ్వలించడమూ వుంది

ఒకసారి నిశ్చలంగా కనులు మూసి
ధ్యానమగ్నం కా
బిగబట్టిన నిగ్రహంలో జిగిబిగి గమనించు
వెలుతురు వెలుపలనుండి కాదు
లోనుండి చిమ్ముకొస్తుంది
కోపం అణచిన క్షణమే కొమ్ముకాస్తుంది
సదమల హృదయమే సౌజన్యపు సొమ్ము దాస్తుంది
సుఖానంద జీవనం తెస్తుంది
తెగిన సంకెలలతో తరలిస్తుంది
బ్రతుకు తరిస్తుంది.

**

Wednesday, October 19, 2011

దీపాంజలి

ముందస్తుగా ముట్టించిన దీపం


నా 16 వ ఏట

కవిత్వం రాయడం ప్రారంభించాక,

దీపావళి పై నేను మొదటగా 1968 లో రాసిన ఈ కవిత

నాటి 'చుక్కాని 'వార పత్రిక(1.11.1968) సంచికలో

ప్రచురింపబడింది.


ఇప్పుడు అది తలుచుకోవడం

ఒక సరదా అంతే!



దీపాంజలి


తమస్సులను కడిగివేయ
రోచిస్సులనందజేయ
జనావళి ముదముబడయ
వచ్చెనిదే దీపావళి


చీకటిలో అలుముకున్న
అవినీతి అంబరాన
దీపకళికలే వెలసెను
చీకట్లను పారద్రోలి


అమావాస్య రాత్రియంత
పున్నమి రేయనిపించగ
పురవీధులనెటుజూచిన
దీపకాంతి అగుపించెను


ఇదిగిదిగో
వచ్చెనిదే దీపావళి
ప్రజావళి
హాసావళి


శత్రుసేన గుండెల్లో
దూసుకున్న గుండుల్లా
మందుగుండ్లు ప్రేలెనిదే
కనువిందొనగూర్చెనిదే


ఇదిగో!
ఇది దీపావళి దీపావళి
ధరణిలోని ప్రజావళి
మహాత్ములకిచ్చునట్టి
కైమోడ్పుల దీపాంజలి


**

Thursday, September 8, 2011

చీకట్ల దీపం.









వచ్చిన చిక్కే అది
ఎంత అస్పష్టమవుదామని వున్నా
డాబాపై ఆరబోసిన
మాగాయ ముక్కలను
కాకి ముక్కున కరుచుకు
ఎగిరిపోయేటంత సులభంగా
పహరా కూడా లేదు కదా
నా తీరే అంత



వొలిచేసిన ఉల్లి పొరల్లా
తీసేసిన గింజ పొట్టులా
అంతా పరుచుకున్నదే



స్వప్నఖచిత సింహాసనాలేమీ లేవు
అధికారాలూ లేవు
అభిశంసనలూ లేవు
దుర్వినియోగం చేసేందుకు
దుఃఖపడనా
ఒక గాలి తరగ తాకితే చాలు
ఉఫ్ అని ఎగిరిపోయేటందుకు



నిజమేగా
ఎవరైనా ఎందుకు అనుసరిస్తారు
ఒక తపన కావాలి
ఒక అన్వేషణ కావాలి
తెలుసుకోవాలనే ఒక ఆతృత పంచాలి
కామోసు కామోసు




ఏమీ లేదే నా దగ్గర
గుప్పిట మూసిన రహస్యం ఒకటి పట్టుకుని
చుట్టూ తిప్పించుకుందామంటే
ఎందుకింత బహిరంగం


నాకు నేను రహస్యం ఎలాగూ అయినప్పుడు
నాకు తెలిసినమేరకు
ఎదుటివారికి అర్థం కావాలనే
ఇంత వెసులుబాటునిచ్చి
వెర్రి వెధవనవుతున్నాని తెలుసు
అయితేనేం
మార్మికత కృత్రిమత కదా




పోనీలే
ఈ లోకం ఒక పసిపాప
పరీక్షలు నేను రాస్తాను గానీ
దానికెందుకు పెట్టడం
కాపీ కొడుతూ పట్టుబడే
కాఠిన్యం వద్దు


ఇంక ముగించు
సంపూర్ణంలో
వెల్లకితలా పడిన చివరి శరీరమే
రహస్యం ఎక్కడ
అసలు నిజం తెలిసాక
అంతా విడిన రహస్యమే
ఆ కాడికి ఎందుకింత పజిలింగ్ పజిల్
అడ్డం నిలువు గళ్ళ ఆధారాలతో
ఒక పదబంధ ప్రహేళీక మాత్రమే
కనుక్కో
కనుక్కుని ఆనందించు



ఇంతకీ రహస్యం కాదు ముందున్నది
ఒక ప్రహేళిక
ఒక క్రీడ
వచ్చిన చిక్కు విప్పిన చిక్కే ఇది
సమాధానం తెలిసేంత వరకూ మాత్రమే
మాగాయి మా కాయం
కాకి పరమాత్మం
పొరలపొరల పొడలపొడల జీవితం
మలిగిన దీపంలో వెలుగు తెలిసాక

వెలగడం లో
అంతా వెసులుబాటే!


Monday, August 15, 2011

ఇంకేమి కావాలె!.






మువ్వన్నెల స్వాతంత్ర్యం
చాతుర్వర్ణ
స్వాహాతంత్రం గా చెంగలిస్తోంది

హిందూదేశం భారతితో
ఇంగ్లీషును ప్రసవిస్తోంది

ఇక్కడ ఏ అమరిక అయినా
అమెరికా మెలికతో
ముడిపడుతోంది

నీతి,ధర్మం,న్యాయం మటుకే కాదు
భాషా,సంస్కృతి,సంప్రదాయం
అన్నీ స్వచ్చందంగా కోల్పోవడానికి
అందరికీ బోలెడు స్వాతంత్ర్యం వుంది

ఇంకేమి కావాలె
ఇంకేమి రావాలె
స్వీయ బంధనమె తొలగాలె
స్వయం బానిసతనమె చావాలె

రాజకీయ శరీరమేకాదు
స్వాతంత్ర్య ఆత్మ వెలగాలె


(ఈ కవిత లోని కొంత భాగం
15.8.2011 ఈనాడు దినపత్రిక
హైదరాబాద్ ఎడిషన్లో ప్రచురితం)

Monday, August 1, 2011

....ఉన్నది జాగ్రత్త.




ఏ నీలి శిలువ చలువైతేనేం
వీధుల నిండాచిత్తకార్తెసంబరాలు

పసివాడి బుగ్గ కొరికేదొకటి
పడుచుపిల్ల పిక్కపట్టేదొకటి
తాతగారి ఉదయపునడకను
రోడ్డే ట్రెడ్మిల్ యంత్రమైనట్లు
జాగింగ్ పరుగులెత్తించేదొకటి

మనుషులను ప్రేమించడంమొదలుపెట్టి
ఈ తరం కసి ప్రేమికుల్లా
కాటువేయడం నేర్చుకుని రెచ్చిపోతున్నాయి
విశ్వాసం సంగతి తెలియదుకానీ
ఖచ్చితంగా రేబీస్ మాత్రంవుంది
జాగిలాల జాలీ స్వైర విహారంలో
పౌరుల విలవిల!
మందులేని భూతదయ

సంతాన నియంత్రణ ఆపరేషన్లుసరే
ఎప్పటి పిల్ల కుక్కోకాదు
ఇప్పటి తల్లి కుక్కే కరుస్తోందికదా
కరిచేవీ,అరిచేవీ అన్నీ కుమ్మక్కై
హిజ్ మాస్టర్ వాయిస్
ప్రాణాంతకమౌతోందికదా!

బుష్ గారుతను
ఇండియాఅని పేరు పెట్టుకుని
ఒకటిసాకాడని తెలిసి
బుష్ మీదే కాదు
కుక్కలమీదే కోపం రావద్దూ!

ఇండియాలోమనిషి కన్నా
అమెరికాలోకుక్క బ్రతుకుగొప్పదని
ప్రతి కుక్కాఅమెరికాతరలివెళ్ళేట్టుంది
మరి
లైసెన్స్ బెల్టులువిస్తారమైతే
వీధి కుక్కలన్నీపెంపుదువైపోగలవా
విశ్వాసాలేకాటువేస్తున్నాయి
నేడుపిచ్చిపిచ్చపిచ్చగాపెరుగుతోంది

ఆ ఇంటిముందు
చాన్నాళ్ళుగా
'కుక్కవున్నది జాగ్రత్త ' అని బోర్డుచూస్తున్నాను
కానీకుక్కఏదీకనిపించలేదు
ఆరాతీయగాతెలిసింది
జాగుసేయక ఓజాగిలానికి
పాలుపోసిసాకి
ఇంటకట్టేసేందుకు
మనస్కరించినఅతగాడు
కన్నతల్లి తండ్రులనుమాత్రం సాకడానికిమనస్కరించక
వృద్ధాశ్రమానికి తరలించేసాడని
విశ్వాసం కాదురేబీస్
అనిఅర్థమయ్యాక
అతగాడిగురించే నేటీకీఆబోర్డు
అతిసహజంగాఉందనినిర్ధారణ అయ్యింది
'కుక్కవున్నదిజాగ్రత్త 'కాదు
జాగ్రత్తవున్నదికుక్క అనిఅవగతమైంది

'డాగ్ 'న లగ్ జావేఅని
ఎంత ప్రార్థించిఏంలాభం?
కుక్కవెంటబడింది..
దయాభూతంఆవరించి
మనిషే కుక్కఅవుతున్నాడు!

'కుక్కల వలె,నక్కల వలె
సందులలోపందులవలె..'
శ్రీశ్రీ అన్నట్లు
శునకప్రస్థానంతోమనదీఒకబ్రతుకేనా!

***

Friday, July 29, 2011

ఓదార్పు.







నా చేయి తగలగానే
నీమనసు మేఘం
మాట చినుకై

కురవాలనుకుoటాను
కానీ

నీకంటగోదావరి నేనీదలేను
ఒడ్డున నిలబడి

తుఫానుచూడగలనే గానీ
ఊరడింపు పడవవేసుకుని
నీలోబుజ్జగింపు ప్రయాణంచేయలేనివాడిని


ఔను! నాకుఊరడించడంచేతకాదు
బతిమాలడంరాదు
నీ దుఃఖానికిభయంతోబిగుసుకుపోవడం
దానికి
నేనే హేతువేమోనని
లోలో గిరికీలుకొట్టడం
స్థాణువునై

తెలియనినొప్పిపువ్వుపూసి
విసుగులో,వేదనలో,

చేతకానితనం చీకాకులో
చిట్లి పగలడంతప్ప
నాలోనువ్వే
ఒదిగిపోయి,
నీ అంతట నువ్వే
బహిర్గతం కావాలనీ.

ఎందుకు అవవనీఅనుకుంటూ
నీ వేదనాతీవ్రతనుతట్టుకోలేనివాడిని


నీకునేను
ఎలాస్వాంతనంకాగలనో
తెలియదు
ఏం చేస్తే,ఏలా మాట్లాడితే,

ఎలా ప్రవర్తిస్తే
నీకుఉపశమనమౌతుందో

అర్థంకాదు
ఏదోమాటాడి

నిజాయితీగానే నిన్నుస్పర్శించినా
ఆక్షణాలు నీకుఅత్యల్పాలు
నాకుమాత్రం

నువ్వెందుకు బహిర్గతం కావడంలేదన్నంత
సుదీర్ఘాలు

నేనేంచెయ్యను?
ఏం చెయ్యననేగా

నీఆరోపణ
నిజమే!

నా మౌనం అర్థం అవుతుందనుకోవడం,
నాలోమాటలుపెగలక పోవడం
నీలోదుఃఖమేఘం కమ్మినప్పుడల్లా
అది తుఫానై, వరదై

నన్నేచుట్టుముడుతుందని
నీకుతెలియకపోవడం
నన్ను నీముందు శప్తఎడారిగా విస్తరిస్తుంది
నీకై నేనున్నానన్నవిశ్వాసం

నీకువ్యక్తం చేయలేని
ఈ శమనవికలత్వాన్ని

సమాదరించి
నువ్వేభరిస్తున్నావు.

అదిచాలుదేవతా

చేతులుకురిసినచేతన




కురిసేచేతులుంటే
మొలిచే భూమి వుంటుంది
మొలిచేభూమిలోంచి
మొక్కపరీమళిస్తుంది


ఆకాశానిదేముంది
అదివట్టి వేదిక
సముద్రంఆవిరవందే
మేఘంఆసీనం కాలేదిక


మేఘానిదేముంది
అది హృదయానికిస్పందనాకృతి
హృదయంసముద్రం కావడానికి
కరుణ కరిగి కదలాలి


కరుణదేముంది
అదిలాలిత్యపుభావన
ఓదార్పుదిక్కులనుంచి
ఎడారి ఓడ మోసుకొచ్చేజంటల సాధన


జంటలదేముంది
విశ్వాసపుకలయిక
నిలచి నిలుపుకోగలిగితే
వ్యష్టినుంచిసమష్టి వైపుచేతన


చేతనంటేఏమిటింతకూ
నీ,నా అనేమన చేతనయే
భూమిని సాగుచేసేందుకు
కలిసి కురిసేమన కృషియే
చేతులు కురవడమంటే అంతే!


మొక్కవోనిదీక్షతో
మనసు పరీమళించాలి
మనసుమనసు కలిపి
మనంపరిశ్రమించాలి


కురిసేచేతులుంటే
మొలిచేభూమి వుంటుంది
మొలిచేభూమిలోంచే
మానవత్వంపండుతుంది




జలప్రయాణం.







యాంత్రికంగా పరుగెత్తే బ్రతుకునది
ఎప్పుడైనా
ప్రవాహంలోఒకమలుపు
రాళ్ళకు ఢీకొని పారిపారి
ఒక చెట్లగుబురుల్లోంచో
మైదాన మధ్యంలోంచో ప్రయాణించడం
ఎంత ఉపశమనం!


దూరదూరపు పాయలు దగ్గరై
నదీప్రయాణంలోశృతికావడం
ఒంటరితనంలో వినిపించిన
ఎంత చక్కని బృందగానం


పాయలూ,కాల్వలూ బంధువులే
నదిలాంటీ సామూహికనీటిబిందువులే
ఎవరైనా కానీ
కలివిడి ఒక ఆనందం
కలబోతలో ఒకసుఖం
ప్రయాణంలోఒక సంతోషం


నీళ్ళను కన్నతల్లి
మేఘంకాదుభూమియే
మేఘుడుజనకుడు
ఒక మెరుపుమెరిసి,ఒక పిడుగులా గర్జింఛి
నేలనుతన వర్షంతోతడిపి
తరించేసేది అతగాడే


గర్భానదాల్చి
పాయలుగా,కాల్వలుగా,

సరస్సులుగా,నదులుగా
సముద్రంగా కన్నది భూమి
అన్నీనీటి బృందమే
పేరు ప్రతిష్టలను బట్టి

సంపన్న నామం

ఇంతకీ
ప్రయాణం గురించికదూ

చెబుతున్నది
పట్టాలరెప్పలమధ్య
కనుగుడ్డులా కదులుతున్న

చెమ్మగిలిన రైలు

చూపు అంటే ప్రయాణమే
ప్రయాణమంటేదృశ్యాలచలనం
మానవీయ భావనల
జలధార కరచాలనం
*


Saturday, July 23, 2011

బూజుకర్ర





ఒక బూజుకర్ర కావాలి
అప్పుడు రాజుని దులిపిన అగ్నిధారా సదృశ
కవికంఠ గత అగ్నివీణ మ్రోగాలి
ఈ బూజును పీచు మిఠాయిగా నమ్మిస్తున్న
అవివేకాన్ని దులపడానికైనా
నాకు చైతన్య హస్తం కావాలి

మొండి గోడలే కాదు మొండి చేతులూ చూసి చూసి
ఈ తొండి ఆటకు విసుగెత్తిపోయాను
ఒకరు మీద ఒకరు ఎందరొచ్చినా
గదులు శుభ్రం చేసినవారెవరూ లేరు
ఎవరికివారు తమ కుర్చీ తమ బల్లా చూసుకున్నారేగానీ
గదిని వాసయోగ్యంగా మొత్తంగా మలచనే లేదు

పనిమనిషి రాలేదు ఎవరూ
తట్టెడు అంట్లు అలానేవున్నాయి
గదులూడ్చి ఎన్నాళ్ళయిందో
అద్దం నిండా మరకలే
తమాషా ఏమిటంటే ఇల్లు నాదే కానీ
ఇల్లాలూ మాట వినదు
సొంత ఇల్లే అద్దె కొంపలా మారింది

అతిథులు వస్తున్నారు పోతున్నారు
గేహంలో దేహంతో విశ్రమిస్తున్నారు
సందేహాలు మాత్రం అలానే వున్నాయి
భోంచేసినవాడు వాసాలు లెక్కిస్తున్నాడుగానీ
పట్టిన బూజు దులిపేందుకుకెవడూసమకట్టడంలేదు

ఔనౌను అన్నట్లు
ఇల్లువూడ్చే యంత్రం ఒకటుంది
అది నడిచే యంత్రాంగమూ పేరుకు వుంది
విద్యుత్తు లేనప్పుడూ
నడిపించగల విద్వత్తు లేనప్పుడూ
పరిశుభ్రత ఎలా సాధ్యం
గొట్టాలలోని గాలి వూదేదో
లోలోపలికి దుమ్మును పీల్చేదో
ద్విధాప్రయుక్తమైన దశలో
అసలు యంత్రాన్ని పనిచేయించి
దానికైనా చేతితోనే బూజులు పట్టిన
మూలమూలల్లోకి సారింపజేయాలి కదా!

అసలు బూజు ఎక్కడుంది
అంతా నీ భ్రమ అంటాడొకడు
గది నేల చూడు ఎంత అద్దంలా మెరుస్తోందో అంటాడొకడు
గోడకు వ్రేలాడుతున్న వర్ణచిత్రాలు చూడమంటాడొకడు
అంతా బానే వుంది అంటే
నా గదిలోనే నాకు శ్వాస ఎందుకు ఆడడం లేదు
దుమ్మూ, బూజులూ వల్ల కాకపోతే
నాకీ దమ్మురోగం ఎందుకొచ్చినట్లు
దమ్మున్నవాడిని కాబట్టే
బూజు దులపాలంటున్నాను

యంత్రం వున్నా పవర్ కట్ అయినప్పుడు
వాక్యూం క్లీనర్లు కాదు
చేత చీపురుకట్టే నయం నేలవూడ్ఛేందుకు
పొడుగాటి బూజుకర్రేనయం
గది పైపై మూలలన్నీ కూడా శుభ్రపరిచేందుకు

ఒక్కొక్క వాక్యమూ
ఒక్క ఈనె లాగా
నా నిటారుతనమే ఒక గడకర్రలాగా
ఎవరికోసమో ఎదురుచూడడం కాదు
నా గదిని నేనే శుభ్రపరుచుకుంటా
తప్పదు
అంతరాల తరతరాల బూజు దులపడానికి
నేనే బూజుకర్రనవుతా
నా గదికేకాదు
వ్యవస్థాగతపర్యావరణ పరిశుభ్రతకే
పనిముట్టుగా మారుతా.
**


(నిన్న 22.7.2011 దాశరథి గారి 85 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో కేంద్ర సాహిత్య అకాదెమీ,లావణ్యా ఆర్ట్స్ సహకారంతో నిర్వహించిన కవిసమ్మేళనంలో వినిపించిన కవిత)

Saturday, April 23, 2011

అన్వేషణ





అన్వేషణ

అంటే ఏమిటనే ప్రశ్న
అనేకానేకంగా ఆవిర్భవిస్తూ
నిఘంటువుల వెంటా,
పురావస్తుశాలల వెంటా పడింది.
కళ్ళముందు చూస్తూ చూస్తూ ఉండగానే
అదృశ్యమైపోతున్నయికదా ఎన్నెన్నో

ఇది ఒక పదమా,
కాకుంటే పదార్థమా
ఎక్కడని వెతకను.
నా చూపు మందగించిందో
లేక తనే మసకబారి మసకబారి
తరలిపోయి మటుమాయమౌతోందో
ఎవరైనా చూసారా అని
ఆర్త వతంసుడనై అడుగుతూనేవున్నా
అసలు ఎవరికీ పట్టినట్టేలేదు

ప్రత్యేక రాష్ట్రం గురించీ,
ప్రపంచకప్పు విజయంగురించీ
ఆయన ఉద్యమించేదాకా అసలు ఉన్నట్టే పట్టనట్టున్న
అన్నాహజారే ధ్వజమెత్తిన అవినీతి గురించీ
ఒకటే ముచ్చట్లు పెడుతున్నారు గానీ
దీని స్పృహేలేదే

ఖర ప్రవేశించి
గాడిదలమయ్యామనుకుందామంటే
మునుపే వికృతిలో వున్నామాయె
ప్రభవాదిగా ప్రకృతే
అలా మలుచుకుంటున్నామాయె
నిజమే
మునుపింత విషాదం ముప్పిరిగొనలేదు.
ఇంతో కాసింతో ఇంగితం వుండేది
చెట్టు నరకాలంటే చేతులాడేవి కావు
మొక్క నాటడానికి మురిపెం వుండేది
భూమిని నమ్ముకున్న వారేగానీ
ఇలా అమ్ముకునేవారు తక్కువ
పక్కపక్కల విస్తరించుకోవడమేగానీ
ఇలా ఒకరినెత్తిన ఒకరు పైకెక్కి నివసించే
అపార్ట్ మెంట్ కల్చర్ అధిగమించింది కాదు

ఉదయాస్తమయాల సూర్యచంద్రులను
పెరటి వేపచెట్లనూ,అరటినీ,మామిళ్ళనూ ఎరుగని
పిదపకాలం వస్తుందనుకున్నామా
సహజ వనరులైన నీటీనీ,గాలినీ కూడా
అమ్మకం సరుకుగా కొనుక్కు
వాడుకోవలసి వస్తుందనుకున్నామా

టీ.వీ మైదానాల్లో చూడడంతప్ప
సహజంగా ఆడుకోలేని ఎడారి స్థితి
దాపురిస్తుందనుకున్నామా
కోతికొమ్మచ్చులూ లేవు,
ఈతబావులూ లేవు
నగరం ఒక కాంక్రీట్ జనారణ్యం
తెల్లవారిలేస్తే రక్తమోడుతున్న దిన పత్రికలు
నిరంతర దృశ్యశ్రవణ వార్తా హింస
కక్షలు కార్పణ్యాల జీడిపాకం సీరియల్స్

ఎక్కడని వెతకను
ఖచ్చితంగా భయపడి పారిపోయే వుంటుంది
పాపం కల్మషమెరుగని భోళా భాళాది

పువ్వులో కనబడేది,
నవ్వులో కనబడేది
యువజంట లవ్వులో కనబడేది
మావిచివురు కొమ్మమాటు
కోకిలమ్మ మధురస్వరంలో వినబడేది
కొత్త పెళ్ళికూతురు అడుగులో తడబడేది
ఉగాది నాటి కవిసమ్మేళనంలో
కవిగారి అక్షరంలో చొరబడేది
ఏమైపోయిందో
అచ్చమైన వసంతం,పచ్చపైరు వసంతం,
మచ్చలేని వసంతం
ప్రకృతిలో తచ్చాడడం లేదు

హృదయపుష్ప వసంతం కోసం
తనువు తరువును
సంక్షుభిత సమాజ శిశిరంలో
రాల్చుకుంటూనే వున్నాను
వసంతం సంత సరుకు కాదు
కానీ ఇంత వింత కొరతవుతుందనుకోలేదు
ఆలస్యం కాకుండానే
అన్వేషించి తెచ్చుకుందాం రండి
దూరదూరాలకు పోకుండా
దక్కించుకుందాం రండి
కాసింత భరోసా
కాసింత నమ్మకం కలిగించి
కాలధర్మం చెందకుండా
కాలధర్మాన్ని కాపాడుకుందాం రండి.
చైత్రాన్ని చిత్తంలో నిలుపుకుని
మానవీయమై చిగురిద్దాం రండి.
*

Saturday, April 2, 2011

శుభ 'ఖర ' ఉగాది

సమస్యల భారం పెరిగినందుకేనేమో
సంవత్సరాది ఇలా వస్తోంది

కాలం చాకిరేవువద్ద
ఉతుక్కోవలసిన మాలిన్యాలెన్నో ఉన్నాయి
రాకపోకల ఆసరాకేనేమో
రాసభమై క్షాళిత సభకు రారమ్మంటోంది

వసుదేవుడంతటివాడు
ప్రణమిల్లిన సహనశీలికదా
చాకిరీకి ప్రత్యామ్నాయమై
పనిచేసే సంస్కృతిని ప్రబోధించేది కదా

ఓండ్రింపులు పెరిగిన
నేతల అడ్డ విశేషణాలకాలవాలమై
నిజమే!
పనికిరాని కాగితాల నివేదిక ముక్కలను
ఆత్రంగా దౌడపట్టి
ఎడంకాలి తాపుతో
తిరస్కారోద్యమాన్ని రూపెత్తించగలది కూడాను

ఓర్పుకీ హద్దుంటుంది
సహనానికీ సమయముంటుంది

ఇంటిని కాపలా కాయాల్సిన విశ్వాసాలు
వీగిపోతున్నప్పుడు
దెబ్బలుతినైనా రక్షణార్థమై
ఎలుగెత్తిన వంచన తెలియని కంచరకదా

కాని పనులని తెలిసినా
కాలం ఖర్మానికి వదిలేయలేని ఖర
ఆహ్వానించదగిన శ్రీకర శుభకర

ఉట్టి అడ్డగాడిదికి
సంక్షిప్తం కాదు ఉ.గా.ది
ఉత్సవాల గారవగౌరవ దిక్కుగా
ఉరకలెత్తించగల భారవహి

చెరవడిన నవావతార శిశువును
జలధి దాటించే వేళ
సహకరించేందుకే పాహి పాహి

శ్రీ ఖర ఉగాదీ!
విజయశీకరాలు వర్షించు
మనహ్ శుభ్ర వస్త్రాన్వితయి
జనావళి హర్షించు
అవనతమై నమస్కరించు.