ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Showing posts with label అన్నారిలా..... Show all posts
Showing posts with label అన్నారిలా..... Show all posts

Tuesday, January 6, 2015

అలనాటి కవిత్వం -" మేం "


ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం  
1974 లో 
నా
23 వ ఏట యవ్వనపు రోజుల్లో 
నేను ,అప్పుడు డాక్టరీ చేస్తున్న మిత్రుడు నాగినేని భాస్కరరావ్ 
కలసి 
మా కవిత్వాన్ని తొలిసారి ఓ సంకలనం గా 
వెలువరించాం.
ఇద్దరం అప్పుడు యువభారతి సంస్థలో సహ కార్యదర్శులం .
సమ్యక్ దృష్టి గల యువభారతి
చాలామంది అనుకునేట్లు కేవలం సంప్రదాయానికి మాత్రమే  కాక 
ఆధునికతకూ ఆలంబనంగా నిలిచింది.
అందుకే 
మా " మేం '  కవితా సంకలనం 
యువభారతి ప్రచురణగా వెలువడింది. 

అలనాటి కవిత్వం 
పేర 
ఆంధ్రప్రభ దినపత్రిక సాహితీగవాక్షం లో 
5.1.2015 సంచికలో 
ప్రముఖ సాహితీవేత్త  ద్వా.నా.శాస్త్రి 
' మేం ' సంకలనం గురించి రాయడం సంతోషం .
తను రాసిన సంకలన పరిచయం ఇది 







Friday, September 26, 2014

నవ్య నివేదిక ఆవిష్కరణ

నవ్య 
వారపత్రిక
అక్టోబర్ '1,2014 సంచికలో
సలీం కథల పుస్తకం
' అంతర్గానం ' ఆవిష్కరణ సభపై
ప్రచురితమైన 
నివేదిక 






Sunday, September 1, 2013

'చిత్రగ్రంథి ' పై 'నేటినిజం '




'నేటినిజం ' (దినపత్రిక)
'సాహితీకెరటాలు 'లో 
29 ఆగస్టు '2013 సంచికలో
నా కవితా సంకలనం
'చిత్రగ్రంథి ' పై 
శ్రీ పొనుగోటి నరసింహారావు గారి
సమీక్ష 





Thursday, August 1, 2013

'చిత్రగ్రంథి '

విపుల 
మాసపత్రిక 
ఆగస్టు '2013 సంచికలో 

నా 'చిత్రగ్రంథి '
కవితా సంకలనంపై 
వచ్చిన సమీక్ష.


Thursday, June 6, 2013

నా 'కవి కాలమ్ పై'నవ్య '





వర్తమాన జాతీయ,అంతర్జాతీయ వార్తా సంఘటనలపై
వారం వారం కవితారూపకంగా

నేను మూడేళ్ళు ఆంధ్రప్రభ దినపత్రికలో నిర్వహించిన
కాలమ్ 'కవికాలమ్ ' నుండి

ఎంపికచేసిన 50 కవితలతో
'పాలపిట్ట బుక్స్ ' ప్రచురణగా వెలువడిన

నా 'కవికాలమ్ ' సంపుటి పై

ఆంధ్రజ్యోతి వారి 'నవ్య ' వారపత్రిక  తాజాసంచికలో
(12.6.2013)
వచ్చిన
రామ్మోహన్

పుస్తక సమీక్ష



Friday, August 31, 2012

కవికాలమ్-నేటినిజం



నేటినిజం పత్రిక
సాహితీకెరటాలు లో

23 ఆగస్ట్'2012 సంచికలో

నా కవితా సంకలనం
'కవికాలమ్ ' పై

శ్రీ ఎన్వీ.రఘువీర్ ప్రతాప్ చేసిన
సమీక్ష




Tuesday, August 28, 2012

'నది'లో 'కవికాలమ్ '

ప్రముఖ కవి,రచయిత,సాహితీ విమర్శకులు

శ్రీ జె.ఎస్.మూర్తి 'విహారి ' గారు

నది
మాసపత్రిక
సెప్టెంబర్ '2012 సంచికలో
నా కవితా సంకలనం
'కవికాలమ్ ' పై

చేసిన సమీక్ష







Monday, August 20, 2012

ఆంధ్రజ్యోతి లో 'కవికాలమ్ ' పై సమీక్ష





19 ఆగస్ట్'2012
ఆదివారం
ఆంధ్రజ్యోతి దినపత్రిక లో
నా కవితా సంకలనం
'కవికాలమ్ ' పై
సహృదయ సమీక్ష


Sunday, July 15, 2012

'చిత్రగ్రంథి'గురించి..



నేటినిజం (దినపత్రిక)
సాహితీకెరటాలు లో
12 జూలై'2012 సంచికలో
నా కవితా సంకలనం
'చిత్రగ్రంథి ' పై
శ్రీ దాస్యం సేనాధిపతి సమీక్ష

Monday, July 2, 2012

'స్వప్న 'కవికాలమ్


'స్వప్న ' మాసపత్రిక
జూలై'2012 సంచికలో


నా 'కవికాలమ్' సంకలనం పై
'మదన్ ' సమీక్ష 

Sunday, June 17, 2012

'పూతరేకులు

నేటి ఆదివారం (17.6.2012)
'ఆంధ్రభూమి' దినపత్రిక
'అక్షర' పేజీ లో
నా జోక్స్ సంకలనం
'పూతరేకులు ' పై
పరిచయం ఇది.



పూతరేకు వంటకమే ఓ అద్భుతం. దాని సృజన చాలా కష్టం. బియ్యం రుబ్బి, వేడి వేడి కుండపై పలుచని రేకుగా మార్చి, ఆపై దానికి కమ్మని నెయ్యి, చక్కని చక్కెర చేర్చి, చిన్ని చిన్ని మడతలుగా మార్చిన వైనం భలే చిత్రాతిచిత్రం. అంతా అయ్యాక నాలికపై అది మిగిల్చే రుచి మరీ చిత్రం. సుధామ జోకులూ అచ్చంగా అంతే. చిన్న చిన్న జోకులు కలిపి, వాటికి మరింత రుచి జోడించి, మాంచి నవ్య నవ్వాహారంగా మార్చి, మనకు అందించడం వెనకు శ్రమ చాలానే వుంది. ఒక్క జోకులు పాతిక పేజీల పుస్తకం నిండా పరిచేస్తే, అది పూతరేకులు ఎందుకవుతుంది. కాదు కాక కాదు. ఎస్‌ఎమ్‌ఎస్ జోకులు, తెలుగింగ్లీష్ ఇంట్ర‘ట్విస్టింగ్’లు, ఇలా పేజీల నిండా రకరకాలుగా మెనూ పరుచుకుంటుంది. పుస్తకం ముందుంచుకున్నవారి కళ్లకు అరుచి వుండదు. అన్నట్లు మచ్చుకో ముక్క..‘వెంగళప్ప కలర్ టీవీ కొని తెచ్చాడు ఇంటికి. తేగానే నీళ్లలో ముంచి తీసాడు. ఎందుకలా? అని అడిగితే, రంగు వుంటుందో, వెలుస్తుందో చూద్దామని’ బదులిచ్చాడు. ఇది కొరికాక, మిగిలినవన్నీ నోట పెట్టుకోక ఆగుతారా?


Saturday, June 16, 2012

వర్తమాన సమాజానికి కవితాత్మక రికార్డ్




'సన్ ఫ్లవర్ 'వారపత్రిక 
6, జూన్ '12 సంచికలో
నా 'కవికాలమ్ 'కవితా సంకలనం పై 
వచ్చిన సమీక్ష








బహుముఖ ప్రజ్ఞాశాలి,సాహితీరంగంలో పలు ప్రక్రియల్లో విశిష్ట ప్రయోగాలు చేస్తూ పాఠకలోకానికి సుపరిచితులు,..వయస్సులోను,అనుభవంలోనూ పెద్దవారయిన శ్రీ సుధామ గారి 'కవికాలమ్ ' కవితా సంకలనం సుధామ గారి అంతరంగపు ఆంతర్యాలను క్షుణ్ణంగా ప్రదర్శిస్తుంది. మూడు సంవత్సరాలు ఆంధ్రప్రభ లో సమకాలిక సంఘటనల స్పందనలకు వెలువడిన కవితా సంకలనం ఈ పుస్తకం. అప్పుడు ప్రచురితమైన కవితలలోంచి ఎంపిక చేసిన 50 కవితలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఈ కవితలు చదువుతుంటే సమకాలీన సమాజం కళ్ళముందు ప్రత్యక్షమయ్యేలా ,సులభరీతిలో,సముచిత పదాల్లో, భావ సముదాయాల్ని బంధించి.పాఠకుల్ని ..ఆలోచనల్లోకి  చెయ్యుచ్చు కు నడిపించి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళారు. కవితల్లోని.. కాదేదీ కవితకనర్హ మన్నట్లు ..సుధామ గారెంచుకున్న శీర్షికలు సాంద్రతని తెలియచేస్తున్నాయి. ఏభై దీర్ఘ కవితలు..చదువుతుంటే ..చదివినవారికి అప్పుడే "అయిపోయిందా!" అనే భావన కలగడం ఖాయం.

"భూమికోసం,భుక్తికోసం ..పోరాటం ఎక్కడైనా సామాన్యుడి ఆరాటం ఒక్కటేగా!" అని ఒకచోట అంటే,
"మానవ దేహమూ సాటి మనిషికి ధన సదృశకోశమేనా?" అంటూ 'వైద్యానికి నైవేద్యం 'లో నిలదీశారు.

అల్లగే 'ప్రేమే జీవన శ్వాస ' కవితలో ..'ప్రేమ లోకం తోటిది,ప్రేమలేని బ్రతుకు ఓటిది ' అని ప్రేమను ప్రేమించేలా రెండు మాటల్లో చెప్పారు .సుధామ గారు పనిచేసిన ఆకాశవాణి గురించి..."విద్యుక్త ధర్మంలో ఒదిగి,మాటల ముత్యాలు పొదిగి,బ్రతుకు సమరాన్ని కూడా స్వరసమీరంగా మార్చుకుని, ఉదయ తరంగిణుల నుండి ,అపరాత్రుల సంగీత విభావరుల దాకా కంఠం వీప్పి కోట్లాది గుండేల్లో పాగావేసి స్వర పతాకాలు ఎగరవేసిన స్వరజ్యోత్స్నను గురించే సలాం చేస్తున్నాను అంటూనే..
"సమ్ డాగ్ కలియనీరు " లో- దేశ ఆనందానికి మేధావితనం పేరిట చిత్రించిన భారతదేశ నగ్నచిత్రం అని ఆవేదన చెందారు.

మరోచోట ...'భూములు అమ్ముకోవడానికి గానీ నమ్ముకోవడానికి కాదు,చదువులు సరికొత్త సాఫ్ట్ వేర్ బానిసత్వం ' అంటూ నేటి చదువులకు భాష్యం చెప్పారు. ఇలా రాసుకుంటూ పోతే ..ఈ కవితలన్నీ సెటైర్లతో ,నేటి సమకాలీన సమాజం అనే కాన్వాస్ పై సుధామ గారు ..ఆవిష్కరించిన మాడ్రన్ ఆర్ట్ చూడగానే అర్ఠం కాదు ..లోతులకు వెళ్ళగానే భావం బోధపడి 'ఔరా ' అనిపించే అద్భుతమైన కవితా సంకలనం .ఈ కవితలు చదవటం మొదలుపెడితే ఎక్కడా ఆగకుండా నాన్ స్టాప్ లా ..హాయిగా చిన్న పదాల్లో,అనంత భావాల్ని పొందు పరిచారు.

'తెలుసుకోవడానికి భయపడితే ..నీలో నువ్వే బద్దలవుతావ్..విస్ఫోటనం జరిగాక గానీ విశ్వరహస్యం తెలియదు ' చక్కని చురక .శీర్షికల్లో, పదాల్లో ..మారు తారులు ఉదా:- శ్రీమద్ 'మారాయణం ' ,'సమ్ డాగ్ కలియనీరు ',' ఆ'లయ 'మేలా 'వంటి పద విరుపులు ఎన్నో ఈ పుస్తకంలో వున్నాయి.

'రంగు పడుద్ది ' లో.."పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పుడెల్లా విలువల సంగతేమో
గానీ ..వలువల రంగులు మారుతున్నాయి..నేటి నగ్న సత్యాన్ని..భావుకత మీద,భాష మీద,ఆధునికత మీద, జీవితం మీద, దేశం మీద,సమాజం మీద..ఒకటేమిటి ..సుధామ గారు స్పృశించని ..అంశం లేదేమో అనిపించక మానదు ఇది చదివిన వాళ్ళకు.

ముందుమాటలో గుడిపాటి గారు అన్నట్లు కవిత్వమంటే కొందరికి మాత్రమే అర్ఠమయ్యే ప్రక్రియ అన్న అపప్రథ నుండి చిన్నచిన్న వాక్యాల్లో అనంతమైన భావాల్ని స్పష్టంగా..సరళంగా, సులభంగా అర్థమయ్యే ఉదాహరణలతో వ్యక్తీకరించడం కవిగా,కాలమిస్ట్ గా,కార్టూనిస్ట్,రేడియో ఉద్యోగి,బహుప్రక్రిఅనుభవశాలి అయిన శ్రీ సుధామ గారి 'కవికాలమ్ ' అందరూ చదవటం,చదివించటం..సముచితం.

-ఎం.వెంకటేశ్వర రావు



Saturday, June 9, 2012

'కదిలించే కలాలు


'నేటినిజం' దినపత్రిక
6 జూన్ '2012 సంచిక
సాహిత్యకెరటాలు పేజీ లో


ప్రముఖ కవి.విమర్శకులు
శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
తన కాలమ్
'కదిలించే కలాలు ' లో
నా గురించి రాసిన
పరిచయ వ్యాసం



Saturday, June 2, 2012

ఆనందమానందమాయెనే...



 హాయ్! అందరికీ నమస్కారం.








ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.


ఒకే ఒక్క ఏడాది వయసు ఇటీవలే దాటిన 
నా 'సుధామధురం 'బ్లాగ్ ను పదివేలకుమందికి పైగా మన దేశంలో వారు చదవగా ,
విదేశాలలో వారి సంఖ్య ఒక్కొక్క దేశంలోనూ ఈ విధంగావుందని సర్వే పట్టిక అన్నమాట!







 United States (US)3,085
 United Arab Emirates (AE)268
Dubai202
Abu Dhabi41
Sharjah24
Ras Al Khaimah1
 Singapore (SG)217
 United Kingdom (GB)193
 Australia (AU)166
 Japan (JP)117
 Taiwan (TW)102
 Germany (DE)79
 Kuwait (KW)70
 Canada (CA)68
 Saudi Arabia (SA)46
 Malaysia (MY)45
 Belgium (BE)45
 Asia/Pacific Region (AP)37
 China (CN)31
 Norway (NO)29
 Mexico (MX)28
 Qatar (QA)26
 Oman (OM)25
 South Africa (ZA)18
 Italy (IT)17
 Europe (EU)17
 Ireland (IE)16
 Hong Kong (HK)13
 New Zealand (NZ)11
 Korea, Republic of (KR)11
 Netherlands (NL)8
 France (FR)8
 Denmark (DK)6
 Bahrain (BH)5
 Thailand (TH)4
 Russian Federation (RU)4
 Finland (FI)3
 Switzerland (CH)3
 Uganda (UG)2
 Philippines (PH)2
 Czech Republic (CZ)2
 Ghana (GH)2
 Egypt (EG)2
 Rwanda (RW)2
 Turkey (TR)2
 Sweden (SE)1
 Mauritius (MU)1
 Lithuania (LT)1
 Brunei Darussalam (BN)1
 Togo (TG)1
 Panama (PA)1
 Bangladesh (BD)1
 Vietnam (VN)1
 Guyana (GY)1
 Israel (IL)1
 Afghanistan (AF)1
 Iraq (IQ)1
 Morocco (MA)1
 Jordan (JO)1
 Bulgaria (BG)1



ఈ అభిమానం ఇబ్బడిముబ్బడిగా పెరగాలని ఆకాంక్షిస్తున్నాను.


నా బ్లాగ్ ను 'ఫాలో' అవమని మీ బ్లాగర్ మిత్రులకు సూచిస్తే సంతోషిస్తాను.



ఎప్పటికప్పుడు బ్లాగ్ లో నా పోస్టింగులు చదువుతూ మీ అమూల్య వ్యాఖలను తప్పక తెలియచేస్తూ వుంటారుగా.


కృతజ్ఞతాభివందనాలతో...

సదామీ..
సుధామ.