యాంత్రికంగా పరుగెత్తే బ్రతుకునది
ఎప్పుడైనా
ప్రవాహంలోఒకమలుపు
రాళ్ళకు ఢీకొని పారిపారి
ఒక చెట్లగుబురుల్లోంచో
మైదాన మధ్యంలోంచో ప్రయాణించడం
ఎంత ఉపశమనం!
దూరదూరపు పాయలు దగ్గరై
నదీప్రయాణంలోశృతికావడం
ఒంటరితనంలో వినిపించిన
ఎంత చక్కని బృందగానం
పాయలూ,కాల్వలూ బంధువులే
నదిలాంటీ సామూహికనీటిబిందువులే
ఎవరైనా కానీ
కలివిడి ఒక ఆనందం
కలబోతలో ఒకసుఖం
ప్రయాణంలోఒక సంతోషం
నీళ్ళను కన్నతల్లి
మేఘంకాదుభూమియే
మేఘుడుజనకుడు
ఒక మెరుపుమెరిసి,ఒక పిడుగులా గర్జింఛి
నేలనుతన వర్షంతోతడిపి
తరించేసేది అతగాడే
గర్భానదాల్చి
పాయలుగా,కాల్వలుగా,
సరస్సులుగా,నదులుగా
సముద్రంగా కన్నది భూమి
అన్నీనీటి బృందమే
పేరు ప్రతిష్టలను బట్టి
సంపన్న నామం
ఇంతకీ
ప్రయాణం గురించికదూ
చెబుతున్నది
పట్టాలరెప్పలమధ్య
కనుగుడ్డులా కదులుతున్న
చెమ్మగిలిన రైలు
చూపు అంటే ప్రయాణమే
ప్రయాణమంటేదృశ్యాలచలనం
మానవీయ భావనల
జలధార కరచాలనం*
0 comments:
Post a Comment