ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, August 15, 2011

ఇంకేమి కావాలె!.






మువ్వన్నెల స్వాతంత్ర్యం
చాతుర్వర్ణ
స్వాహాతంత్రం గా చెంగలిస్తోంది

హిందూదేశం భారతితో
ఇంగ్లీషును ప్రసవిస్తోంది

ఇక్కడ ఏ అమరిక అయినా
అమెరికా మెలికతో
ముడిపడుతోంది

నీతి,ధర్మం,న్యాయం మటుకే కాదు
భాషా,సంస్కృతి,సంప్రదాయం
అన్నీ స్వచ్చందంగా కోల్పోవడానికి
అందరికీ బోలెడు స్వాతంత్ర్యం వుంది

ఇంకేమి కావాలె
ఇంకేమి రావాలె
స్వీయ బంధనమె తొలగాలె
స్వయం బానిసతనమె చావాలె

రాజకీయ శరీరమేకాదు
స్వాతంత్ర్య ఆత్మ వెలగాలె


(ఈ కవిత లోని కొంత భాగం
15.8.2011 ఈనాడు దినపత్రిక
హైదరాబాద్ ఎడిషన్లో ప్రచురితం)

3 comments:

Prasad Cheruvu said...

"ఇంకేమి కావాలె!."
స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!
చక్కని సందేశాలతో జాతిని ప్రబోదితం చేయగల నైతిక,సామాజిక ప్రశాంతత
కవిహృదయాలకు కలగాలి

Sag said...

హిందూదేశం భారతితో
ఇంగ్లీషును ప్రసవిస్తోంది

నీతి,ధర్మం,న్యాయం మటుకే కాదు
భాషా,సంస్కృతి,సంప్రదాయం
అన్నీ స్వచ్చందంగా కోల్పోవడానికి
అందరికీ బోలెడు స్వాతంత్ర్యం వుంది

చాలా చాలా బాగుంది !!

సుధామ said...

కృతజ్ఞతలు సాగర్ గారూ!