తేడా
‘‘సుతారానికీ, మొరటుకీ తేడా ఏమిటి?’’
‘‘ఓ పక్షి ‘ఈక’తో చెంప నిమరడం సుతారం. ‘పక్షి’నే చెంప మీద రాయడం మొరటు’’.
రంగు
వెంగళప్ప ఎలక్ట్రానిక్స్ షాప్‌కు వెళ్లి- ‘‘మీ దగ్గర ‘కలర్ టీవీ’లు వున్నాయా’’ అని అడిగాడు.
‘‘ఉన్నాయి సార్!’’ అన్నాడు షాప్ వాడు.
‘‘అయితే ఓ బ్రౌన్ కలర్‌ది ఇవ్వండి’’ అన్నాడు వెంగళప్ప.
సినిమా
కళాకృష్ణ, సుందరం సినిమాకు వెళ్లారుగా అయితే అప్పటికే అరగంట సినిమా అయిపోయినా బానే వుందనుకున్నారా? ఎందుకలా?
వాళ్లు వెళ్లిన సినిమా ‘అలా మొదలైంది’ మరి!
నచ్చదు మరి
‘‘భార్యలకు తమ మొగుళ్లు తాగడం అస్సలు నచ్చదు ఎందుకంటావ్’’ అడిగాడు కృష్ణమాచారి పాత్రోని.
‘‘పిల్లిలా వుండే మొగుడు తాగాక పులిలా ప్రవర్తిస్తాడనే’’ అన్నాడు పాత్రో.
ప్రాంతం
‘‘నువ్వెక్కడ పుట్టావ్’’ అడిగాడు బాస్ సర్దార్జీని
‘‘పంజాబ్’’ సర్దార్జీ అన్నాడు గర్వంగా.
‘‘ఏ ప్రాంతం’’
‘‘ఏ ప్రాంతం ఏమిటి? మొత్తం శరీరం అంతా పంజాబ్‌లోనే పుట్టింది’’ అన్నాడు సర్దార్జీ.
కారణం
‘‘డాక్టర్ గారూ! నేనూ, మా ఆయనా ఒకేసారి కొవ్వు తగ్గడానికి మీ దగ్గర మందు తీసుకున్నాం కదా! ఆయన పది పౌండ్లు తగ్గి, నేను అలానే వున్నానేమిటి’’ అడిగింది ఉష అజయ్‌ని.
‘‘నా దగ్గర మందు తీసుకున్న ఆయనకు బుర్ర లేదు కదమ్మా’’ - డాక్టర్ అజయ్ సమాధానం.
బిల్డింగ్
కొత్తగా కట్టిన ఓ మేడని చూపించి, ‘‘అదేంటి’’అని అడిగాడు జెన్నీ-సాయిని.
‘బిల్డింగ్’ అన్నాడు సాయి.
‘‘ఆల్‌రెడీ బిల్ట్’ అయిన దానిని, ‘బిల్డింగ్’ అంటావేమిటి’’ కోప్పడ్డాడు జెన్నీ.
సాధనం
‘‘మన పిల్లల మీద, పెద్దలకు కోపం వుంటే- విషమో, నిద్రమాత్రలో ఇచ్చో, ఉరేసో, కొండమీంచి తోసేసో చంపేయకుండా ఏం చేస్తారు చెప్పు?’’ అంది సుమిర ప్రతీతితో క్లాసులో. ‘‘ఏవుంది’’ ‘చదువు’అంటూ బడిలో పడేస్తారు. మనం అలాగే కదా ఛస్తున్నాం’’ అంది ప్రతీతి.
జీవిత సత్యం
ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహమాడతాం.
వివాహమాడిన వ్యక్తి జీవిత భాగస్వామి కాగా,
ప్రేమించిన వ్యక్తి ఈ మెయిల్ ఐ.డి పాస్‌వర్డ్‌గా పరిణమించడం జరుగుతుంది.
ప్రశ్నలు- జవాబులు
ప్రశ్న: తప్పు చేస్తున్నారని తెలిసీ ఇతరులను మనం అభినందించి శుభాకాంక్షలు ఎప్పుడు చెబుతాం
జవాబు: వారి వివాహ వేళ
**
ప్రశ్న: కలలను వాస్తవాలు చేసుకోలేకపోతే ఏమవుతుంది
జవాబు: వాస్తవం కలగా మిగిలిపోతుంది.
**
ప్రశ్న: స్ర్తిలకు ‘అభ్యున్నతి’ చెందాలని ఉండదా! ఎందుకు?
జవాబు: అదే ఉంటే మగవాళ్లతో ‘సమానత్వం’ ఎందుకు కోరుకుంటారు?
**
ప్రశ్న: మా నాన్నగారు పెద్ద పండితుడని నీకెలా తెలుసు?
జవాబు: నువ్వు ‘శుంఠ’వుకాబట్టి.
**
ప్రశ్న: మొగపిల్లలంతా వట్టి మొండివాళ్లని నువ్వెలా చెప్పగలవు
జవాబు: వాళ్ల నాన్ననే నేను పెళ్లాడాను కాబట్టి.
**
ప్రశ్న: తను నీకు ‘హాయ్’ చెప్పట్లేదని ఎలా అనుకుంటున్నావ్
జవాబు: వేలెత్తి చూపుతున్నాడు కాబట్టి
**
2 comments:
"navukundurugaka"! annaru alage navukunamu kuda....
‘‘సుతారానికీ, మొరటుకీ తేడా ఏమిటి?’’
"తమలపాకుతో నీవొకటిస్తే
తలుపుచెక్కతో నేనొకటిస్తా!"
Post a Comment