ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, June 28, 2016

శారదా అశోకవర్థన్ సిరిచుక్క గ్రంథం

 





శ్రీమతి శారదా అశోకవర్థన్


తెలుగు పాఠకులకు,శ్రోతలకు తెలిసిన పేరే ఇది.
కవయిత్రిగా,కథా,నవలా రచయిత్రిగా,నాటక కర్తగా,
వ్యాఖాత్రి గా
బాల సాహిత్యవేత్తగా
పేరొందిన వారామె. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమాచార  శాఖలో 
పనిచేస్తూ,కొన్నేళ్ళు ఆకాశవాణి హైదరాబాద్ 
కుటుంబ సంక్షేమ విభాగంలో పనిచేసారు.
ఆ తరువాత 
జవహర్ బాల భవన్ డైరెక్టర్ గా
విశేష ఖ్యాతి పొందారు.


ఇరవైమూడు నవలలు 
పన్నెండు కవితా గ్రంథాలు 
ఏడు కథా సంపుటులు 
ఏడు నాటకాలు 
పన్నెండు బాల సాహిత్య గ్రంథాలు రాసిన 
శ్రీమతి శారదా అశోక వర్థన్  
ఆంధ్రభూమి లో ' శారదాలోచనం' ,' మరమరాలు ' 
కాలమ్ లు 
ఆంధ్రప్రభ బాలల పత్రిక ' చిన్నారి ' కోసం 
అయిదేళ్ళకు పైగా
మంచిమాట  శీర్షిక నిర్వహించారు.



ముందునుండీ  తాను సికింద్రాబాద్ నివాసియే!

ఇటీవలే శ్రీమతి  శారదా  అశోకవర్థన్

" నా సిరిచుక్క సికింద్రాబాద్ ' అనే గ్రంథాన్ని 
సికిందరాబాద్ చరిత్రతో బాటు 
తన ఆత్మ కథనాత్మక విషయాలతో రంగరించి  
వెలువరించారు. 

 పుస్తకానికి
మీ సుధామ ను 
ఒక ముందుమాట రాయమని కోరగా

" శారదాధామం సికింద్రాబాద్ " పేరిట రాసిన 
మున్నుడి ఇది 












0 comments: