ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, August 1, 2011

....ఉన్నది జాగ్రత్త.




ఏ నీలి శిలువ చలువైతేనేం
వీధుల నిండాచిత్తకార్తెసంబరాలు

పసివాడి బుగ్గ కొరికేదొకటి
పడుచుపిల్ల పిక్కపట్టేదొకటి
తాతగారి ఉదయపునడకను
రోడ్డే ట్రెడ్మిల్ యంత్రమైనట్లు
జాగింగ్ పరుగులెత్తించేదొకటి

మనుషులను ప్రేమించడంమొదలుపెట్టి
ఈ తరం కసి ప్రేమికుల్లా
కాటువేయడం నేర్చుకుని రెచ్చిపోతున్నాయి
విశ్వాసం సంగతి తెలియదుకానీ
ఖచ్చితంగా రేబీస్ మాత్రంవుంది
జాగిలాల జాలీ స్వైర విహారంలో
పౌరుల విలవిల!
మందులేని భూతదయ

సంతాన నియంత్రణ ఆపరేషన్లుసరే
ఎప్పటి పిల్ల కుక్కోకాదు
ఇప్పటి తల్లి కుక్కే కరుస్తోందికదా
కరిచేవీ,అరిచేవీ అన్నీ కుమ్మక్కై
హిజ్ మాస్టర్ వాయిస్
ప్రాణాంతకమౌతోందికదా!

బుష్ గారుతను
ఇండియాఅని పేరు పెట్టుకుని
ఒకటిసాకాడని తెలిసి
బుష్ మీదే కాదు
కుక్కలమీదే కోపం రావద్దూ!

ఇండియాలోమనిషి కన్నా
అమెరికాలోకుక్క బ్రతుకుగొప్పదని
ప్రతి కుక్కాఅమెరికాతరలివెళ్ళేట్టుంది
మరి
లైసెన్స్ బెల్టులువిస్తారమైతే
వీధి కుక్కలన్నీపెంపుదువైపోగలవా
విశ్వాసాలేకాటువేస్తున్నాయి
నేడుపిచ్చిపిచ్చపిచ్చగాపెరుగుతోంది

ఆ ఇంటిముందు
చాన్నాళ్ళుగా
'కుక్కవున్నది జాగ్రత్త ' అని బోర్డుచూస్తున్నాను
కానీకుక్కఏదీకనిపించలేదు
ఆరాతీయగాతెలిసింది
జాగుసేయక ఓజాగిలానికి
పాలుపోసిసాకి
ఇంటకట్టేసేందుకు
మనస్కరించినఅతగాడు
కన్నతల్లి తండ్రులనుమాత్రం సాకడానికిమనస్కరించక
వృద్ధాశ్రమానికి తరలించేసాడని
విశ్వాసం కాదురేబీస్
అనిఅర్థమయ్యాక
అతగాడిగురించే నేటీకీఆబోర్డు
అతిసహజంగాఉందనినిర్ధారణ అయ్యింది
'కుక్కవున్నదిజాగ్రత్త 'కాదు
జాగ్రత్తవున్నదికుక్క అనిఅవగతమైంది

'డాగ్ 'న లగ్ జావేఅని
ఎంత ప్రార్థించిఏంలాభం?
కుక్కవెంటబడింది..
దయాభూతంఆవరించి
మనిషే కుక్కఅవుతున్నాడు!

'కుక్కల వలె,నక్కల వలె
సందులలోపందులవలె..'
శ్రీశ్రీ అన్నట్లు
శునకప్రస్థానంతోమనదీఒకబ్రతుకేనా!

***

3 comments:

Dr. Puttaparthi Nagapadmini said...

chala bagundi Sudhamagaru..

Indian Minerva said...

naccimdi

Prasad Cheruvu said...

....ఉన్నది జాగ్రత్త.
శునక నఖ,దంత క్షత గాత్రులకు కొదవలేదు.
వీటి నియంత్రణకి యంత్రంగంవున్నా భూత దయో,
నిర్లక్ష్యమో శునక సంతతి ఏ బాట చూసినా రాత్రి
పహరాలు కాస్తూ పాదచారులను పరిగెత్తిస్తూనే వున్నది.