సిగరెట్టు
‘‘నువ్వు పడవలో వెడుతున్నావ్. నీ దగ్గర రెండు సిగరెట్లున్నాయి. కానీ లైటర్ లేదు. సిగరెట్టు ఎలా వెలిగించుకుంటావ్ బాబూ!’’ అడిగాడు చైతన్య.
‘‘ఏముంది. ఓ సిగరెట్టు నదిలో పారేస్తాను. అప్పుడు పడవ ‘లైటర్’ అవుతుంది. దాంతో వెలిగించుకుంటా!’’ అన్నాడు బాబు.
***
చిలిపి ఊహలు
* ప్రేమ గుడ్డిదైతే కన్నుకొట్టడం ఎందుకు చేస్తారో!
* ఓడిపోవాలని ప్రయత్నించి గెలిచినప్పుడు ఓడినట్టా? గెలిచినట్టా?
* అతని బుద్ధి పదునైనది అంటే ఎక్కువగా వాడడని అర్థం!
* నలువైపులా శత్రువులు చుట్టుముట్టారంటే, ఎటువైపయినా కాల్పులు జరపవచ్చు కదా హాయిగా!
* మెదడు మార్పిడీ చేయించుకుందామన్నా, అది నిన్ను ‘రిజెక్ట్’ చేయకుండా అంగీకరించాలి కదా!
***
క్యారేజ్
వంద అంతస్తుల భవన నిర్మాణంలో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు అరవయ్యో అంతస్తుమీద కూచుని మధ్యాహ్నం భోజనానికి క్యారేజ్‌లు విప్పారు.
తన క్యారేజీలో పిజ్జా బర్గర్‌చూసిన మొదటతను ‘‘్ఛ! ఎప్పుడూ ఇదే! ఈసారి క్యారేజ్‌లో ఇది కనబడితే ఇక్కడ్నుంచి దూకి ఛస్తా’’ అన్నాడు.
రెండోవాడు వట్టి అన్నం, ఉల్లిపాయ చూసి ‘‘్ఛ! ఈమాటు ఇదే అయితే నేను దూకేస్తా’’అన్నాడు.
‘‘మూడోవాడు క్యారేజ్‌లో పులిహార చూసి ‘‘ఈమాటు ఇదే అయితే నేనూ అంతే’’ అన్నాడు.
మర్నాడూ వాళ్ల క్యారేజీల్లో అవే వుండేసరికి దూకి చచ్చిపోయారు’’.
మొదటి ఇద్దరి కూలీల భార్యలు ఏడుస్తున్నా మూడో కూలీ భార్య ఏడవలేదు.
ఎందుకంటే ఇంట్లో వండి క్యారేజ్ సర్దుకునేది అతనేనుట!
****
ఫోన్ కాల్
ఓ భర్త భార్యతో మాట్లాడుదామని ఇంటికి ఫోన్ చేసాడు.
పనిమనిషి ఫోన్ ఎత్తింది.
‘‘మా ఆవిడ ఏది? నేను మాట్లాడాలి పిలు’’ అన్నాడు భర్త.
‘‘ఆవిడ బెడ్‌రూంలో ఎవరో పరాయి పురుషుడితో బిజీగా వుందండీ’’ అంది పనిమనిషి.
భర్త ‘‘నా కప్‌బోర్డ్‌లో తుపాకీ వుంటుంది. వెంటనే వాళ్ళిద్దరినీ కాల్చి పారేయ్’’ అన్నాడు కోపంగా.
ఆయన్ని లైన్‌లో వుండమని చెప్పి పనిమనిషి అలానే చేసి- ‘‘ఇప్పుడు వాళ్ళిద్దరి శవాలనూ ఏం చేయమంటారు’’ అని అడిగింది.
‘‘స్విమ్మింగ్ పూల్‌లో పారేయ్! మిగతా సంగతి నే చూసుకుంటా’’ అన్నాడతను.
‘‘కానీ మనింట్లో అసలు స్విమ్మింగ్ పూల్ లేదు కదా!’’ అంది పనిమనిషి.
‘‘హలో! ఇది 24595789 యేనా’’ అడిగాడు ఆ భర్త.
‘‘రాంగ్ నెంబర్!’’
***
ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తీసుకుంటున్న మనిషి మొదటి అభ్యర్థి లోపలికి రాగానే- ‘‘లోనికి రావడంతోనే నువ్వు గమనించిందేమిటి?’’ అని అడిగాడు.
‘‘మీకు చెవులు లేవుసార్’’ అన్నాడు అభ్యర్థి.
పెద్దమనిషి, ‘గెటౌట్’ అన్నాడు.
రెండో అభ్యర్థి రావడంతోనే, అతనినీ అదే ప్రశ్న వేయగా అతను కూడా - ‘‘అరే మీకు చెవులు లేవు సార్’’ అన్నాడు.
పెద్దమనిషి అతన్నీ ‘‘గెటౌట్’ అన్నాడు.
మూడో అభ్యర్థితో రెండో అభ్యర్థి ముందుగానే ‘ఇంటర్వ్యూలో ఆయన చెవులు గురించి మాత్రం ప్రస్తావించకు’’ అని సలహా ఇవ్వడంతో, మూడో అభ్యర్థి లోపలికి రాగానే- ఇంటర్వ్యూ తీసుకుంటున్న మనిషి’’లోనికి రావడంతోనే నువ్వు గమనించింది ఏమిటి’’ అనే ప్రశ్న వేసాడు.
అభ్యర్థి ‘‘సార్! మీరు కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు కదూ!’’ అన్నాడు.
పెద్దమనిషి సంతోషించి అతన్నేసెలక్ట్ చేసాడు.
‘‘ఎలా కనుక్కున్నావ్’’ అని అడిగాడు.
‘‘మీరు కళ్ళద్దాలు పెట్టుకోవాలంటే మీకు చెవులు వుండాలిగా సార్!’’ అన్నాడు అభ్యర్థి.
***
ప్రశ్నలు- జవాబులు
ప్రశ్న: రాబందులు ఎందుకు మంచివి?
జవాబు: బంధువుల్లా వాటిలో వాటిని అవి పీక్కుతినవు కనుక!
* * *
ప్రశ్న: మీ జెన్ గురువు పేరేమిటి?
జవాబు: ఎం.టి.నెస్.
***
ప్రశ్న: ఆ మోటరిస్టు ప్యాంట్ ఎప్పుడూ జారిపోతూంటుంది ఎందుకు?
జవాబు: టోపీ ఎగిరిపోకుండా ‘బెల్ట్’ అక్కడ పెట్టుకుంటాడు కాబట్టి.
* * *
ప్రశ్న: శర్మగారికి కంప్యూటర్ అంటే పడదని నీకెలా తెలుసు?
జవాబు: మౌస్ ప్యాడ్ మీద ఎలకల మందు పెట్టారుగా!
* * *
ప్రశ్న: ఆత్మహత్య చేసుకుందామనుకున్న అతను ఉరితాడు నడుముకు ఎందుకు బిగించుకుంటున్నాడు.
జవాబు: గొంతుకు అయితే మరీ బిగుతుగా వుందిట!
***
0 comments:
Post a Comment