ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, June 5, 2011

ఆదివారం సరదాగా కాసేపు....

సరిగా వండాలి

భర్త: ఇవాళ మన భోజనంలో మా అమ్మ కూడా వుంటుందోయ్!
భార్య: నాకేం అభ్యంతరం లేదు. ఎటొచ్చీ సరిగ్గా వండాల్సి వుంటుందని గుర్తుంచుకోండి.

పరీక్షలప్పుడే

తండ్రి: సిగ్గుచేటు ఫలితాలు. నీకెప్పుడూ ఇలా తక్కువ మార్కులేనా వచ్చేది
కొడుకు: అబ్బే! నేను పరీక్షలు రాసినప్పుడు మాత్రమే నాన్న!

ఎక్కాలి

వీర్రాజు శంకరం వాళ్ల అపార్ట్‌మెంట్స్‌కు మొదటిసారి వెళ్లాడు. అక్కడ లిఫ్ట్ కనబడలేదు. ఒకవైపు మెట్లు కనబడ్డాయి. అక్కడే వున్న వాచ్‌మెన్ కుర్రాడితో. ‘‘చూడు బాబూ! ఈ మెట్లు నన్ను మూడో అంతస్థుదాకా చేరుస్తాయా’’ అని అడిగాడు. ‘‘అవి చేర్చవండి! మీరే మెట్లెక్కి వెళ్లాలి’’ అన్నాడా కుర్రాడు.

బానే వుందా!

ప్రియుడు: నేను నా మనసు మార్చుకున్నాను.
ప్రేయసి: మంచి పని చేసావ్! ఇదయినా సరిగ్గా పనిచేసేలా చూసుకో!

చిన్నవి

‘‘మగవాళ్ల పాదాలకన్నా ఆడవాళ్ల పాదాలు చిన్నవిగా ఎందుకుంటాయి’’
‘‘కిచెన్ సింక్‌కు దగ్గరగా నిల్చోవడానికి వీలుంటుందని’’

అంకెలు

హిందీ క్లాసులో సుమిరను టీచరు ‘చార్ జీరో ఏకాసాథ్’ రాయమంటే, పక్క విరించి- ‘0000’ రాయడం చూసి, ‘‘నీది గలత్! 4017 అని రాయాలి’’అని రాసి చూపించిందిట.

క్రియాశీలం

‘‘సముద్రం మధ్యలో నావలో ప్రయాణిస్తున్నావ్. నీ దగ్గర రెండు సిగరెట్లు వున్నాయి. నావలో ఏమీలేవు. నువ్వొక సిగరెట్టు వెలిగించాలి ఎలా’’ అడిగాడు సుందరయ్య రఘుశ్రీని.
‘‘ఏముంది. ఒక సిగరెట్టుని సముద్రంలోకి విసిరేస్తాను. అప్పుడు నావ ‘లైటర్’ అవుతుంది. దానితో సిగరెట్టు వెలిగిస్తా’’ అన్నాడు రఘుశ్రీ.
ఇదే ప్రశ్నని సుందరయ్య క్రికెట్ పిచ్చివున్న సుబ్రమణ్యంని అడిగాడు.
‘‘దాందేముంది. ఓ సిగరెట్‌ని పైకెగరేసి క్యాచ్ పడతాను. క్యాచ్ వల్లనే ‘మ్యాచెస్’గెలవచ్చుకదా! అలా మ్యాచెస్‌తో రెండో సిగరెట్టు వెలిగిస్తాను’’ అన్నాడు సుబ్రమణ్యం.

క్షమాపణ

‘‘మనిషి ఎక్కువగా ఎక్కడ క్షమాపణ కోరుతాడు చెప్పుకో!’’
‘‘తెలీదు.. ఎక్కడ?’’
‘‘‘సారీ చిల్లర లేదు’’ అని ‘ముష్టివాడి దగ్గర’’

తప్పక

‘‘ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఓ కంగారూ ఎగరగలదా’’
‘‘తప్పకుండా’’
‘‘ఎలా?’’
‘‘ఈఫిల్ టవర్ ఎగరలేదు కనుక.’’


* ప్రశ్నలు- సమాధానాలు


ప్రశ్న: గుండ్రటి పిజ్జాను నలుచదరం బాక్స్‌లో ఎందుకు పెడతారు
జవాబు: కార్డ్‌బోర్డ్‌ను గుండ్రం బాక్స్‌గా ముడవడం కుదరదు కనుక

**

ప్రశ్న: చిన్నపిల్లలు ప్రతి రెండు గంటలకూ లేస్తూనే వుంటారు. అలాంటప్పుడు ‘పసి పాపలా నిదురపో’ అంటారెందుకు.
జవాబు: వాళ్లు మెలుకువగా వున్న రెండు నిముషాల్లో బాత్‌రూం పనికానిచ్చి మళ్లీ నిద్రపోతారు కనుక.

**

ప్రశ్న: పద్దెనిమిదేళ్ల అమ్మాయి నీకు వంగి నమస్కారం పెట్టిందనుకో ఆ అమ్మాయిలో నీకేం కనిపిస్తుంది.
జవాబు: వినయం. నువ్వు సవ్యంగా ఆలోచించడం నేర్చుకో ముందు.

* *

ప్రశ్న: శబ్దకాలుష్యం నివారించడానికి మార్గం ఏమిటి
జవాబు: వాహనాల హారన్లను ‘సైలెంట్ మోడ్’లో పెట్టడమే.

* *

ప్రశ్న: విమానం తయారీదార్లకు బుర్ర లేదా ఎందుకు
జవాబు: విమాన ప్రమాదంలో విమానం ముక్కలు ముక్కలయినా ‘బ్లాక్ బాక్స్’కు ఏమీకాదన్నప్పుడు బ్లాక్‌బాక్స్ తయారుచేసే ముడి పదార్థాలతోనే విమానం తయారుచేయచ్చు కదా!

* *

0 comments: