సమస్య
‘‘నేను నా పాస్‌వర్డ్ ఎప్పుడు టైప్ చేసినా అక్షరాల బదులు నక్షత్రాలు కనిపిస్తున్నాయి’’ అని కొత్తగా కంప్యూటర్ నేర్చిన ఒకావిడ టెక్నీషియన్‌కు ఫిర్యాదు చేసింది.
‘‘అది అంతేనమ్మా! మీ పాస్‌వర్డ్- మీ వెనకాల వుండి ఎవరు చూసినా తెలియకుండా, రహస్యంగా వుండేందుకే, అలా నక్షత్రాలు వస్తాయి’’ అన్నాడు టెక్నిషియన్.
‘నా వెనకాల ఎవరూ లేనప్పుడు కూడా అలా నక్షత్రాలే వస్తున్నాయండీ’’ అందావిడ.
రైట్ క్లిక్
టెక్నీషియన్: ‘డెస్క్‌టాప్’మీద ‘రైట్‌క్లిక్’ అన్నా! చేసారా?
కస్టమర్: ఊఁ!...
టెక్నీషియన్: ‘పాప్‌అప్ మెనూ’ అని కనబడిందా?
కస్టమర్: లేదే!
టెక్నీషియన్: మళ్లీ రైట్‌క్లిక్! ఇప్పుడు ‘పాప్ అప్‌మెనూ’ వచ్చిందా?
కస్టమర్: రాలేదండీ!
టెక్నీషియన్: ఓకే సార్! మీరింతవరకూ అసలు ఏంచేసారో చెబుతారా?
కస్టమర్: ‘రైట్’క్లిక్ అన్నారుగా మీరు! అలాగే డెస్క్‌టాప్ మీద పెన్నుతో ‘క్లిక్’ అని రాసాను.
నచ్చేది
ప్రేయసి: నాలో నీకు ఏది నచ్చింది మోహన్! నా తెలివి తేటలా, లేక నా సౌందర్యమా
ప్రియుడు: నువ్విలా ‘జోక్’గా మాట్లాడటం నాకు భలే నచ్చుతుంది!
లెక్క చేయడు
ప్రేయసి: నువ్వెప్పుడూ పనీ పనీ అంటూ వుంటావ్! నన్నసలు లెక్కించడమే లేదు!
ప్రియుడు: ప్రేమించేవాడు ఎవ్వరినీ లెక్కచేయడు డియర్! అది తెలుసుకో!
ఎలా?
టెక్నీషియన్: ఓకే! స్క్రీన్ ఎడమ చేతివైపు క్రింద ‘ఓకే’ బటన్ కనబడుతోంది కదా!
కస్టమర్: వావ్! భలే! అంతదూరంనుంచి నా స్క్రీన్ మీరు ఎలా చూడగలుగుతున్నారు సార్!
గొప్పలు
తమ కుక్కల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు మిత్రులు. అందులో మొదటివాడన్నాడు- ‘నా కుక్కకు పొద్దునే్న రెండు రూపాయలిస్తా! అది వెళ్లి ఆంధ్రభూమి కొని తెస్తుంది. నేను చదివే పేపరు అదేనని దానికి తెలుసు.’’
రెండోవాడన్నాడు- ‘నేను నా కుక్కకు పది రూపాయలిస్తా! అది వీక్లీ పట్టుకొచ్చి, కరెక్ట్‌గా చిల్లర కూడా తెస్తుంది తెలుసా!’’...
మూడో వాడన్నాడు కదా-’’ మీ కుక్కలు కొనడానికి వచ్చే ‘షాపు’ నడిపేది, నా కుక్కే తెలుసా!’’
విండోస్
కస్టమర్: నేను ఈమెయిల్ పంపాలి. కానీ స్క్రీన్ మీద ఏవిటేవిటో చాలా వున్నాయి. నా ఈమెయిల్ వుందో లేదో తెలీడం లేదు.
టెక్నీషియన్: అలాగా! అయితే విండోస్ అన్నీ మూసేసి నాకు ఓసారి చెప్పండి.
(కాసేపయ్యాక) టెక్నీషియన్: ఇప్పుడు స్క్రీన్‌మీద ఏం కనిపిస్తోంది.
కస్టమర్: ఏం లేదయ్యా! అంతా చీకటిగా వుంది.
టెక్నీషియన్: మీరు కంప్యూటర్ ఎందుకు టర్నాఫ్ చేసారు?
కస్టమర్: లేదయ్యా బాబూ! ‘విండోస్’ అన్నీ మూసేయమన్నావు కదా! అన్ని కిటికీలు మూసేసరికి, గదంతా చీకటిగా వుంది మరి!
ప్రశ్నలు- జవాబులు
ప్రశ్న: మా కంపెనీలో ఎందుకు చేరాలనుకుంటున్నావ్
జవాబు: మీరు జీతాలు బాగానే ఇస్తున్నారు. అంచేత మీ కంపెనీ ‘దివాలా’ తీసేదాకా నాకు ఢోకా ఏం వుండదని! ***
ప్రశ్న: ఇంకాసేపట్లో నిన్ను ఉరితీయడం ఖాయం. నీ చివరి కోరిక ఏమిటో చెప్పు ఖాయంగా తీరుస్తా!
జవాబు: నా బదులు మీరు ఉరేసుకోండి.
***
ప్రశ్న: ఏంటి మీ అబ్బాయి నాలుగేడులకేపెళ్ళాడి వచ్చాడా? నాకు 28 సంవత్సరాలొస్తే గానీ పెళ్లాడలేదు తెలుసా.
జవాబు: నాలుగేడులు (4X7) 28 యే కదా!
***
ప్రశ్న: తాలిబన్లు తమ శత్రువును ఎందుకంత ద్వేషిస్తారు?
జవాబు: అబ్బే అదేం లేదు! శత్రువుతో ఆడుకోవడం వాళ్లకు చాలా ఇష్టం. ముఖ్యంగా శత్రువు తలతో!
***
ప్రశ్న: విమర్శకులు చెప్పిన పుస్తకంలోనే చదివేందుకు నువ్వు తల దూరుస్తావా? ఎందుకలా!
జవాబు: వాళ్లు ‘రంధ్రానే్వషణ’ కావించి ఇస్తారు కాబట్టి.

2 comments:
బాగున్నాయ్
Very good sudhama, Nice blog!
I am Kotra Mallikarjuna sharma, recently stepped into internet.
Keep in touch,
Sharma
www.kaushikasa.blogspot.com
Post a Comment