ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, June 2, 2011

నవ్వితే బెటర్...


ప్రయోజనం

మాస్టారు: రబ్బర్ చెట్లవల్ల ఉపయోగం ఏమిటో చెప్పు రవీ
రవి: అవే లేకపోతే మొత్తం ప్రపంచం అంతా ఎయిడ్స్ మయం అయిపోయేది.

చిన్న గిన్నె

‘‘ఒక లీటరు ఆవు పాలు ఇవ్వవోయ్’’ అన్నాడు వెంగళప్ప.
‘‘కానీ నీ గిన్నె చాలా చిన్నదిగా వుంది కదా!’’ అన్నాడు షాపతను.
‘‘అయితే పోనీ మేక పాలు ఇయ్యి’’ అన్నాడు వెంగళప్ప.

దొంగతనం

పోలీసు: అంతమంది చూస్తూండగా నిముషంలో అంత వేగంగా గుర్రాన్ని తీసుకుపోయేవ్. ఎలా దొంగలించావోయ్?
దొంగ: నేను గుర్రాన్ని తీసుకుపోలేదు. అంత వేగంగా గుర్రమే నన్నుతీసుకు పోయింది సార్!

అయితే ఓకే

షాపు యజమాని కంప్యూటర్ కొనడానికి వచ్చిన వెంగళప్పతో
‘‘ఈ కంప్యూటర్ కొనడంవల్ల మీ పనిభారం యాభై శాతం కచ్చితంగా తగ్గిపోతుందంటే నమ్మండి’’ అన్నాడు.
‘‘అయితే ఓకే! రెండు కంప్యూటర్లు కొంటాను’’ అన్నాడు వెంగళప్ప.

నివారణకై

భార్య: డాక్టర్‌గారిచ్చిన ఆ క్యాప్సూల్స్ రెండువైపులా కత్తిరించి మరీ వేసుకుంటున్నారెందుకు?
భర్త: ఓసి పిచ్చిదానా? సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వుండటానికోయ్!

కారణం

‘‘నాకు తెలియక అడుగుతాను. ఈ మహిళలకు మద్యపానం అంటే అంత వైముఖ్యం ఎందుకు? నిషేధించాలని తెగ ఆందోళనలు చేస్తూంటారు.’’
‘‘దానివల్లే కదా! తమ ముందు పిల్లిలా వుండే భర్తలు పులిలా విజృంభించేస్తూ వుంటారు. అది నచ్చదుగా మరి!’’

దొంగలించింది

పేషెంట్ నర్సుతో: ఐ లవ్ యూ! మీరు నా హృదయాన్ని దొంగలించారు.
నర్సు: అబద్ధం! మేం నీ కిడ్నీని కదా దొంగలించింది.

బ్యాటరీ లో

‘‘ఈ మొబైల్ ఫోన్‌వల్ల నేను విపరీతంగా డబ్బు నష్టపోతున్నాననుకో’’ అన్నాడు విశాల్ భరద్వాజ్ స్నేహిత్‌తో.
‘‘ఏం’’ అడిగాడు స్నేహిత్.
‘‘బ్యాటరీ ‘లో’ బ్యాటరీలో అని మాటిమాటికీ చూపిస్తోంది. ఇప్పటికి యాభై ఆరుసార్లు బ్యాటరీ మార్చా తెలుసా’’ అన్నాడు.
(‘లో’ అంటే హిందీలో తీసుకో అని అర్థం కదా!)

యంత్రం

‘‘అబద్ధం ఆడితే ఇట్టే కనిపెట్టేసే యంత్రం చూసావా నువ్వు’’ అడిగాడు చక్రపాణి.
‘‘చూడడం ఏమిటి? అది నా దగ్గరుంది. నేను పెళ్లాడాను తనను’’ అన్నాడు రామం.

ఖచ్చితంగా

అమ్మాయి: ‘‘నన్నే ప్రేమిస్తున్నాననీ నన్ను తప్ప వేరెవరినీ ప్రేమించడం లేదనీ కచ్చితంగా చెప్పగలవా డియర్.’’
అబ్బాయి: కచ్చితంగా చెప్పగలను. నిన్న రాత్రే మొత్తం అమ్మాయిల లిస్ట్ ఒకసారి చెక్ చూసాను కూడాను.

ఉతుకు

ఓ హోటల్‌వాళ్లు బట్టలు ఉతికే మనిషి కావాలని ప్రకటించారు. ఓ రంగడు ఇలా అప్లికేషన్ పంపించాడు.
‘‘డియర్ సార్! నేను బాగా ఉతుకుతాను. నేను మునుపు ఓ హోటల్లో పనిచేసినప్పుడు వాళ్లందరినీ బాగా ఉతికాను. మిమ్మల్ని కూడా బాగా ఉతకగలనని నా నమ్మకం. నాచేతనే ఉతికించుకోండి’’...

2 comments:

Prasad Cheruvu said...

"నవ్వితే బెటర్..."
అవును! చాలా బాధలు మర్చిపోవచ్చు, అందుకు టానిక్ ఇవి!

పుట్టపర్తి అనూరాధ. said...

నవ్వుతుంటే ..ఎంత తృప్తిగా వుంటుందో..నండీ..మా ఇంట్లో మా అబ్బాయి ఇలానే ఎప్పుడూ జోకులేస్తూ.. కడుపుబ్బా..నవ్విస్తూ..వుంటాడు..