కారణం వెంగళప్ప: వంట చేయడంలో, అంట్లు తోముకోవడంలో, ఇంటిని శుభ్రంగా వుంచుకోవడంలో అలసిపోయే నేను పెళ్లిచేసుకోవలసి వచ్చింది.
వెర్రిపప్ప: అలా నేనూ అలసిపోవడంవల్లే విడాకులు ఇచ్చేసింది మా ఆవిడ.
కోటా
అమెరికన్ ప్రెసిడెంట్‌తో భారత ప్రధాని ‘‘వచ్చే సంవత్సరం చంద్ర మండలం మీదకి మేం మనుషులను పంపిస్తున్నాం మా దేశం నుండి’’ అన్నారు గర్వంగా.
అమెరికా ప్రెసిడెంట్: ‘‘వావ్! ఎంతమందేమిటి?’’ అని అడిగారుమన్ ప్రధాని: ‘‘7గురు ఓ.బి.సి, 5గురు ఎస్.సి, 8 మంది ఎస్.టి, ముగ్గురు ఫిజికల్లీ ఛాలెంజ్‌డు, ఇద్దరు స్పోర్ట్స్ పర్సన్స్, ముగ్గురు తీవ్రవాద బాధితులు, ముగ్గురు కాశ్మీరీ వలసవారు, ఇద్దరు ఎంపీలు, ఒక అంతరిక్ష యాత్రికుడు’’ అన్నారు కూల్‌గా.
కొట్టరు
పాకిస్తాన్ కోర్ట్‌లో ఒక జడ్జి పిల్లవాడితో ‘‘మీ అమ్మా నాన్నా విడిపోతున్నారు. నువ్వు మీ అమ్మతో వుంటావా’’అని అడిగాడు.
‘‘మా అమ్మ నన్ను కొడుతుంది వద్దు’’ అన్నాడు పిల్లవాడు.
‘‘అయితే మీ నాన్నతో వుంటావన్నమాట’’ అడిగాడు జడ్జి.
‘‘మా నాన్న ఇంకా బాగా కొడతాడు వద్దు’’ అన్నాడు పిల్లవాడు.
‘‘అయితే మరి ఎవరితో వుంటావ్’’ అడిగాడు జడ్జి.
‘‘నేను పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌తో వుంటాను. వాళ్లయితే ఎప్పుడూ ఎవరినీ కొట్టరు’’ అన్నాడు పిల్లవాడు. చూద్దామని
యశోద: కృష్ణా! ఎందుకా ‘బటర్’ను అలా ఎగరేస్తున్నావ్
కృష్ణుడు: బటర్‌ఫ్లై చూద్దామని మమీ!
ఫీజు
వొకకేసు విషయంలో రమణ లాయర్ బాబూరావ్‌ని కలిసాడు.
‘‘మీ ఫీజెంత?’’ అడిగాడు రమణ.
‘‘మూడు ప్రశ్నలకు అయిదువేలు’’ అన్నాడు బాబూరావ్.
‘‘మరీ ఎక్కువ కాదూ?’’ అడిగాడు రమణ.
‘‘ఎక్కువే! ఇంతకీ మీ మూడో ప్రశ్న ఏమిటి’’ అన్నాడు బాబూరావ్.
ఇటు చూడు
లేడి బాస్ దుర్గకు ఉద్యోగి జయపాల్ మీద కోపం వచ్చింది.
దుర్గ కోపంగా: ‘‘ఎప్పుడయినా గుడ్లగూబ మొహం చూసావా’’ అంది.
జయపాల్ తల దించుకుని ‘లేదు మేడమ్’’ అన్నాడు.
‘‘అలా తలదించుకు చూస్తావేం. నా మొహంలోకి చూడు’’ అంది ఆవిడ.
అనుమానం
కృష్ణ, హైమ ప్రేమించుకున్నారు.
హైమతో కృష్ణ ‘‘పెళ్లి చేసుకుందాం అంటే ఆలోచిస్తున్నావేం. నా జీతం చాలదని నీకు అనుమానమా’’ అని అడిగాడు. ‘‘నీ జీతం నాకు సరిపోతుంది. నువ్వెలా బతుకుతావని...’’ అంది హైమ.
జాగ్రత్త
‘‘ఏమిటి చాకుని వేడి నీళ్లలో మరిగిస్తున్నావ్’’ అడిగింది శైలు రాజుని.
‘‘ఆత్మహత్య చేసుకుందామని’’ అన్నాడురాజు.
‘‘పొడుచుకు చావడానికి చాకుని వేడిచెయ్యడం ఎందుకు’’ అడిగింది శైలు.
‘‘ఇనె్ఫక్షన్ ఏదీ కలగకుండాను’’ అన్నాడు రాజు.
ప్రశ్నలు- జవాబులు
ప్ర: ఒక అగ్నిపర్వతం మరో అగ్నిపర్వతంతో ఏమంది
జ: నువ్వు ‘లావా, నేను ‘లావా.’
**
ప్ర: తన లెఫ్ట్ సైడ్ అంతా కోల్పోయిన పేషెంట్ గురించి విన్నావా.
జ: ఇప్పుడతను ఆల్-రైట్ అని తెలుసు
.
**
ప్ర: పేకాట రాయుళ్లంతా బాబా చుట్టూ చేరారట కారనన్
జ: నాలుగు మంచి ‘ముక్కలు’కోసం. **
ప్ర: తాము తీయించుకున్న ఫొటోలతో కొందరు ‘బాపు’గారిని కలిసారట ఎందుకు?
జ: ఆయన ‘ఫ్రేమ్’వర్క్ బావుంటుందని విన్నారట మరి.
**
ప్ర: ఎత్తయిన గోడ గురించి జోక్ తెలుసా.
జ: తెలియకపోవడమే నయం. ఎలాగూ పైన అందుకోలేం కదా!
**
ప్ర: అంచును పెదవులతో తడిచేస్తే ‘కవరు’ ఏమంది?
జ: ఏమన లేదు గట్టిగా మూసుకుంది
0 comments:
Post a Comment