Sunday, April 3, 2011
పూతరేకులు
‘‘నేను బ్రతికే అవకాశం వుందా డాక్టర్‌గారూ’’ అడిగాడు సన్యాసి డాక్టర్ని. ‘‘ఈ జబ్బు వచ్చినవాళ్లలో పదిమందికి ఒకరు తప్పక బ్రతుకుతారయ్యా! ఇప్పటికి నేను ఈ జబ్బుకి వైద్యం చేస్తున్నవాళ్లల్లో నువ్వు పదోవాడివి. మిగతా తొమ్మిదిమందీ చచ్చిపోయారు’’ అన్నాడు డాక్టర్.
ఫలితం ఇంటికి రంగులు వేయడానికి సిద్ధపడిన సుబ్రహ్మణ్యం ఒక ఫుల్కోటూ, దానిమీద ఇంకో ఆఫ్ కోటూ వేసుకుని రంగువేస్తున్నాడు. అది చూసి పక్కింటి నరేందర్ రంగులు వేసేప్పుడు ఏ పాత దుస్తులో వేసుకోవాల్సిందిపోయి, ఈ కోట్ మీద కోటు ఏమిటి అని అడిగాడు. సుబ్రహ్మణ్యం- ‘‘రంగు డబ్బామీద సూచన ప్రకారం చేస్తున్నా అన్నాడు డబ్బామీద - ‘మంచి ఫలితాలకోసం రెండు కోట్స్ వేయండి’’ అని వుంది.
బెల్టు ‘‘న్యూటన్ తలమీద ఆపిల్ పండు పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మా నాన్నగారి వ్యాపారం సాగుతూ మేం బ్రతికిపోయాం’’ అన్నాడు డుంబు బుడుగుతో. ‘అదేంట్రా?’’ అడిగాడు బుడుగు. ‘‘మా నాన్నది బెల్ట్‌ల వ్యాపారం కదా! మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటిని ఎవరుకొంటారు చెప్పు’’ అన్నాడు డుంబు.
మార్పు ‘‘మన కాలేజీ అన్ని శాఖల్లోనూ విద్యార్థుల పట్ల ఆసక్తి తగ్గిపోతోంది. కాలేజీ ఏమవుతుందో తెలీడంలేదు’’ అన్నాడు ఓ లెక్చరర్. ‘‘వెరీగుడ్’’ అయితే త్వరలోనే విశ్వవిద్యాలయంగా మార్చేద్దాం.’’ అన్నాడు ప్రిన్సిపాల్.
అందుబాటు డాక్టర్ శర్మగారు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ మందుల షాపువాడికిచ్చి ‘‘ఇందులో రాసిన మందు రెండు సీసాలు ఇవ్వండి’’ అన్నాడు విద్యాలంకార్. ‘‘డాక్టర్‌గారు ఒక సీసాయే రాసినట్లున్నారే’’ అనాయకంగా అడిగాడు షాపతను. ‘‘ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారయ్యా డాక్టర్‌గారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి...’’
తొందరగా డాక్టర్ శర్మగారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు పద్మనాభరావ్. ‘‘మీరూ నేనూ గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి మిత్రుడిని అవమానించలేను. అలాగని ఉచితంగా సేవలు చేయించుకోనూ లేను. కాబట్టి మీకు ఎంతోకొంత అందేలా నా వీలునామాలో మార్పులుచేస్తా’’ అన్నాడు పద్మనాభరావ్. ‘‘తప్పకుండాను. ఓసారి ఆ ప్రిస్క్రిప్షన్ ఇలా ఇవ్వండి. నేనూ కొంచెం మార్పులుచేస్తా. డబ్బు వెంటనే అవసరం కదా’’అన్నాడు డాక్టర్ శర్మ.
పైపైకి ‘‘క్రికెట్ మ్యాచ్‌లో సచిన్ కొట్టిన బంతి ఆకాశంలో అంతలా పైకి వెళ్లిందని ఎలా తెలిసింది’’ అడిగాడు రాము ఆషిష్ని. ‘‘ఆ బంతితోపాటు విమానంలోని ఎయిర్‌హోస్టెస్ ఒకావిడ దిగివచ్చింది దాన్ని పట్టుకుని తెలుసా’’ అన్నాడు ఆషిష్. కారణం ‘‘శ్రీరాముడిది ఒకేమాట, ఒకే బాణం అని ఎందుకన్నారు డాడీ!’’ అడిగింది సుమిర. ‘‘బహుశా మిగతా మాటలు సీత, మిగతా బాణాలు లక్ష్మణుడూ ప్రయోగిస్తూండడం వల్లే అయ్యుంటుంది’’ అన్నాడు డాడీ కూల్‌గా.
ప్రశ్నలు-జవాబులు
ప్రశ్న: ‘‘నీ ఒక చేతిలో ఆరు యాపిల్స్, మరో చేతిలో ఆరు బత్తాయిలు వున్నాయనుకో! నీ దగ్గర ఏమున్నట్లు?’’
జవాబు: పెద్దపెద్ద అరచేతులు రెండున్నట్లు. **
ప్రశ్న: శుభ్రంగా తుడవడంవల్ల తడి అయ్యేది ఏమిటి?
జవాబు: తువ్వాలు * *
ప్రశ్న: మోటార్ సైకిల్- ఒక కాలుమీద స్టాండ్ ఎందుకు వేసినట్లు?
జవాబు: అది టూ టైర్డ్ అయ్యిందని. * * *
ప్రశ్న: ‘పొరుగు వారిని ప్రేమించుము’ అన్నది పాటించడం ఎప్పుడు కుదురుతుంది?
జవాబు: వాళ్లాయనో, వాళ్లావిడో ఇంట్లో లేరని నిర్ధారణ అయ్యాక. * * *
ప్రశ్న: భార్యను పోగొట్టుకోవడం ఎంతో బాధకరంట కదా?
జవాబు: నా విషయంలో అది జరిగే అవకాశం లేదు. నాకు బాధపడే అదృష్టంలేదు. * * *
ప్రశ్న. ‘‘రావోయి చందమామా’’ అని తార పాడితే చంద్రుడు వెళ్లలేదు. ఎంచేత?
జవాబు: వాలి తంతాడు కనుక.
Labels:
పూతరేకులు
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Join in networked blogs through face book and get more visitors sudhama garu.
http://www.apcmysr.blogspot.com/
Post a Comment