రెండు పాములు కలుసుకున్నాయి.అందులో మొదటిది అంది కదా- ‘‘నేను విష సర్పంకానని తలుస్తాను’’ అంది ఆశగా.
రెండోది ‘‘ఎందుకలా’’ అంది.మొదటిది ‘‘నేను నా పెదవి కొరుక్కున్నాలే అంచేత’’ అంది.
ఇక్కడున్నాం ఎందుకు
ఒక పిల్ల ఒంటె, తల్లి ఒంటెని అడిగింది-‘‘మనకు చిన్న కళ్లున్నాయేం’’ అని.
‘‘అదా! ఎడారిలో తిరిగేటప్పుడు ఇసుక రేగినా, ఇబ్బంది లేకుండా’’ అంది తల్లి.
‘‘మన పాదాలు ఎందుకు ఇంత పొడుగు’’ అడిగింది పిల్ల ఒంటె.
‘‘ఇసుక ఎడారుల్లో నడవడానికి వీలుగానూ! ఇసుకలో కూరుకుపోకుండాను’’... అంది తల్లి.
‘‘మన కడుపులో నీళ్లెక్కువటకదా’’ అంది పిల్ల ఒంటె.
‘‘అవును! ఎడారిలో నెల్లాళ్లు తిరిగినా- దాహం వేయకుండా’’ అంది తల్లి.
‘‘మరి ఇన్ని సౌకర్యాలుండి ఎడారీలో వుండక, ఈ ‘జూ’పార్క్‌లో వున్నామేంటి మరి’’ అంది పిల్ల ఒంటె ఆశ్చర్యపోతూ.
బాధ్యత
ఆఫీసర్ బలరాంని పిలిచి- ‘‘చూడు నా రూమ్‌లో బల్లలూ అవీ నెల్లాళ్లుగా దుమ్ముకొట్టుకుని పోయినట్లు ఎలా వున్నాయో చూసావా!వాటి సంగతి పట్టదా’’ అన్నాడు కోపంగా.
బలరాం: ‘‘నన్ను తిడతారేం సార్! నేను చేరి పదిహేనురోజులే అయింది కదా’’ అన్నాడు.
కొందరున్నారు
‘‘మగవాళ్లందరూ ఫూల్స్’’ అంది పద్మ.
‘‘అలా అనకు! వాళ్లల్లో పెళ్లిచేసుకోని వారున్నారు’’ అంది మాధవి.
నిగ్రహం
‘‘నాలుగు రోజులుగా ఏం తినలేదమ్మా’’ అన్నాడు ముష్టివాడు ఆ ఇంటి ఇల్లాలితో.
‘‘నీకున్న నిగ్రహం నాకుంటే ఎంత బావుండేదో’’ అంది లావుపాటి పిన్నిగారు నిట్టూరుస్తూ.
బాట
‘‘ఆ శాస్ర్తీగారు చాలా తెలివైనవారని ఎలా చెప్పగలవు.’’
‘‘రామాయణం చెబుతూ-’’ తలమీద పెట్టుకుని అయోధ్యకు భరతుడు శ్రీరాముడి పాదరక్షల బాట పట్టాడు’’ అని ‘‘బాటా’’ కంపెనీ ప్రచారం చేసారని, ఆ కంపెనీవారి దగ్గర పారితోషికం పుచ్చుకున్నాడట మరి!
తేడా
బాస్: ‘‘ఆఫీస్ ఇల్లుకాజాలదు’ అనడానికి, ఓ ఉదాహరణ చెప్పు’’ అన్నాడు సెక్రటరీ పద్మినితో.
పద్మిని: ‘‘ఆఫీస్‌లో స్నానం చేయచ్చుగానీ, తువ్వాలుతో రూమ్స్‌లో తిరగలేను కదండీ.’’
కృతజ్ఞతలు ‘‘సార్! మా అత్తగారిని చూడాలి. ఓరోజు రేపు మంగళవారం ఊరెళ్లడానికి సెలవిస్తారా’’ అడిగాడు కృష్ణ బాస్‌ని.
‘‘కుదరదు’’ అన్నాడు యజమాని.
‘‘్థ్యంక్యూ సార్! నన్ను- మీరొక్కరే బాగా అర్థంచేసుకుంటారు’’ అన్నాడు కృష్ణ సంతోషంగా.
ప్రశ్నలు- జవాబులు
ప్రశ్న: నాలుగు వైపులూ దక్షిణముఖంగా వుండేలా ఒకతను దీర్ఘచతురస్రాకారపు ఇల్లు నిర్మించాడు. ఆ ఇంట్లోకి ఒక ఎలుగుబంటి వచ్చింది. అదే రంగుదో చెప్పండి చూద్దాం!
సమా: తెలుపు రంగు ఎలుగుబంటి. నాలుగువైపులా దక్షిణ ముఖం ఇల్లు అంటే, అది ‘నార్త్‌పోల్’లో నిర్మించిన ఇల్లు. ఆ ప్రాంతంలో నివసించేవి పోలార్ ఎలుగుబంట్లు. అవి తెలుపురంగులో వుంటాయి.
ప్రశ్న: అతి గారాంచేసిన ఆవు ఏం చేస్తుంది?
సమా: పాడైపోయిన పాలిస్తుంది.
ప్రశ్న: కోడి గుడ్లు ఎందుకు పెడుతుంది?
సమా: పడవేస్తే విరిగిపోతాయని.
ప్రశ్న: రెండుసార్లు పాలున్నదాన్ని ఏమనచ్చు.
సమా: ‘పా’‘పా’యి.
ప్రశ్న:మగవాడిని తయారుచేశాక బ్రహ్మ ఏమన్నాడు?
సమా: ‘ఇంతకన్నా అందమైనది నేను చేయగలను’ అని.
ప్రశ్న: నినె్నవరూ ‘్ఫల్’ని చేయలేరా ఎందుకు?
సమా: నాకు అన్నీ స్వయంగానే చేసుకునే అలవాటు కనుక!
0 comments:
Post a Comment