అచ్చులో వచ్చిన నా మొదటి రచన ఒక కథయే.'బాల బంధు 'అనే హైదరాబాద్ నుండి వచ్చే ఒక పిల్లల పక్ష పత్రికలో నా 14 వ ఏట డిసెంబర్ 1సంచికలో వచ్చింది.'చెడుసహవాసం" అనే కధ అది .
నా మొదటి కార్టూన్ 1968 లోలత మాస పత్రికలొ వచ్చింది. నేను ఎక్కడా శిక్షణ పొందలేదు.బాపు గారి బొమ్మలే స్పూర్తి.వాటినే చూసి వేసేవాడిని. నా జోకులకు ఆయన బొమ్మలు ఆధారం చేసుకునే వాడిని.
ఆ రోజుల్లో ఆంధ్రప్రభ వార పత్రిక లో 'లోకోక్తి చిత్రిక ' అని ఒక సామెత ఇచ్చి దానికి కార్టూన్ వేయమని పోటీ వుండెది. ఉత్తమo గా ఎన్నికైనదానికి 25 రూపాయిలు, మామూలుగా ఎన్నుకున్న అయిదింటికి చెరి 5 రూపాయిలు పారితొషికం ఉందేది.
నా రెండవ కార్టూన్ అలా ఒక సామెతకు ఎన్నికై తొలిసారి 5 రూపాయల పారితొషికం పొందడం జీవితంలో మరపురాని ఆనందం. ఆ కార్టూన్లు ఇవి . నా మొదటి కార్టూన్
అంధ్రప్రభ వార పత్రికలో బహుమతి పొంది ప్రచురింపబడిన నా రెండవ కార్టూన్
అలా మొదలైన నా కార్టూన్ ప్రస్థానం ఆ రోజుల్లో వచ్చే 'శంకర్స్ వీక్లీ'లో కొన్ని ఇంగ్లీష్ కార్టూన్లతో సహా దాదాపు 800 కార్టూన్లు వేసి వుంటాను.కానీ నాదంటూ ఒక ప్రత్యేక గీత ఏర్పడిందని చెప్పలేను.ఇప్పటికీ అదపాదడపా వేస్తున్నాను గానీ గత పదేళ్ళుగా ఆ రంగంలోతక్కువే.అయినా కార్టూనిస్టులు ఇప్పటికీ నన్ను తమలో ఒకడిగా చూడడం సంతొషం కలిగించే విషయం.
Sunday, March 27, 2011
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
సుధామ గారు - సుదీర్ఘమైన మీ హాస్య, వ్యంగ్య చిత్ర రచనాకేళి వీలైనంత త్వరగా ఆన్లైన్ తెరపైకి ఎక్కించెస్తే మేము ప్రతిరోజు ఉగాది పండుగ చేసుకుంటాము :-)..మీతో సమయం పంచుకుంటున్నందుకు మేము అదృష్టవంతులం.
సుధామగారు, మీ మొదటి కార్టూన్ చూపించినందుకు సంతోషం.
మీ కార్టూన్లు చూసిన గుర్తు ఇప్పుడు వచ్చింది.యువభారతి వారి మహతి
లో తెలుగు కార్టూన్ల గురించి మీ రచన చదివాను. మహతి నా లైబ్రరిలో
వుంది.
సుధామ గారు..కార్టూన్ గీశామా లేదా అన్నదే పాయింట్... ఎవరి లైన్ కాపీ చేసామన్నది కాదు... మేమందరం మీ వెనుక క్యు కట్టిన వాళ్ళమే... మీ నిజాయితీకి అభినందనలు!!
It's nostalgic to see the cartoons; though I am seeing tese for the first time it clicks a chain reaction and brings back so many memories which may not be related to the cartoon but certainly to those times and memories which makes me feel very nice. Thanks sudhama garu.
sudhama garu
why you have discontinued
cartooning?
Sarasi Saraswatula :Sudhama garu is senior to me. He used to clear my doubts in my initial stages and encouraged me from time to time. I am grateful to him.
-----------------------------------
'Sudhama' Allamraju Venkatarao: Ayyabaaboyi ! sarasi gaaruu... Meere ee maata antoonte ,Nenu Frame kattinchi pettukovaali mee vaakyaalu.Mee abhimaanaaniki sathadhaa,sahasradhaa kritajnudini
సుధామ గారు! కార్టూనిస్టులకి, కార్టూన్ ఇష్టులకి, ఒకసారి ఒకరి కార్టూన్ చూస్తే వారు గుర్తుండిపోతారు. అలాగ.. మీరు కార్టూనిస్ట్ గా బాగా గుర్తింపు పొందినవారే! మీరు, నేనూ, మనం అందరం ఒకరమే! ఇలా అంతర్జాలం లో కలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది.
Sudhama garu mee cartoons, blog wonderful.
సుధామ గారూ... మీకు ఇంత ఓపిక ఎక్కడిదండీ... క్రమశిక్షణ కలిగిన ఉద్యోగిగా వుండేవారు... నిరంతరం రాస్తూనే వుంటారు.. ఎక్కడో ఒకచోట సాహిత్యానికి సంబంధించిన ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు. అయితే మీకు ఇప్పుడు వచ్చిన గుర్తింపు చాలా చాలా చాలా తక్కువ.
Post a Comment