Friday, September 22, 2017
సంసారానందం (జోక్స్ )
పాడుకాలం
భార్య: నేనే కాలాన్ని అయ్యుంటే అంతా నాకోసం ఆసక్తిగా
ఎదురుచూస్తారు కదండీ!
భర్త : నిన్ను చూసి అంతా భయపడతారు
భార్య:అదేంటీ?
భర్త: చూడు 'పాడుకాలం దాపరిస్తోంది' అని.
*****
పోస్టర్
'నేను యజమానిని .జాగ్రత్త మీరు హద్దుల్లో వుండండి '
అని రాసి వున్న ఓ పోస్టర్ ను
ఆఫీసర్ గారు పట్టుకొచ్చి తన చాంబర్ లో పెట్టారు
మధ్యాహ్నం బయట ఎవరితోనో లంచ్ కెళ్ళి వచ్చేసరికి అది
చుట్టబెట్టి టేబుల్ మీద వుంది.
లోపలికొచ్చిన ప్యూన్
"మీరుబయటి కెళ్ళినప్పుడు ఇంటినుంచి అమ్మగారు
ఫోన్ చేసారండీచాలా కోపంగా వున్నారు. మీరు ఇంటినుంచి
ఆఫీస్ కు పట్టుకెళ్ళిన పోస్టర్ సాయంకాలం ఇంటికి తిరిగి
తీసుకురాకపోతే జాగ్రత్త అని చెప్పమన్నారు." అన్నాడు
*****
ఏక రక్తం
భార్య: మీతో కాకుండా ఏ రాక్షసుడితో పెళ్ళయినా హాయిగా
వుండేదాన్ని
భర్త: కానీ ఏకరక్త సంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు చెల్లవు కదుటోయ్ !
*****
హతవిధీ!
"ఏమిటోయ్ నిన్న అంత దిగాలుగా కనిపించావ్ " అడిగాడు
విద్యాలంకార్ కళాకృష్ణను
" మా ఆవిడ చీర కొనుక్కుంటా 5000 ఇమ్మని హఠం చేస్తే
ఇవ్వాల్సి వచ్చింది "
"మరి ఇవ్వాళేమిటి ఇంత సంతోషంగా వున్నావు "
" మా ఆవిడ ఆ చీరకట్టుకుని మీ ఆవిడనే కలుసుకుంటానని
వెళ్ళిందిగా!"
*****
జాగ్రత్త
ఆఫీస్ కు బయలుదేరాడు భర్త
కాసేపటికి భార్య ఫోన్ చేసింది
" ఎక్కడున్నారు ?"
భర్త:" దారిలో యాక్సిడేంట్ అయ్యింది. ఆస్పత్రికి
వెడుతున్నాను"
భార్య:" ఆ టిఫెన్ డబ్బా మూత ఊడిపోలేదు కదా! పప్పంతా
అనవసరంగా ఒలొకిపోతుంది జాగ్రత్త :
*****
Labels:
పూతరేకులు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment