దొంగలు
‘‘పండుగనాడు మీ ఇంట్లో దొంగలు వచ్చారన్నావ్. మరి పోలీస్ కంప్లయింట్ ఇవ్వలేదా’’ అడిగాడు కళాకృష్ణ విద్యాలంకార్‌ని.
‘‘అల్లుళ్ల మీద కంప్లయింట్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పు’’ అన్నాడు విద్యాలంకార్.
**
శుభ్రం
‘‘అదేమిటి సార్! తిన్నాక స్పూన్లు మీరు కడిగేస్తున్నారు. మా సర్వర్లు వున్నారు కదండీ’’ అన్నాడు హోటల్ యజమాని దుర్గారాజ్‌తో. ‘‘కడగకుండా అలాగే పెట్టేసుకుంటే జేబులు పాడైపోతాయని’’ అనేసి నాలుక్కరుచుకున్నాడు దుర్గారాజ్.
**
వయసు
పత్రికా విలేఖరి శైలజను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు.
‘‘ఇంత అందంగా వున్నారు. మీ వయసెంత’’అని అడిగాడు. ‘‘పద్దెనిమిదేళ్లు’’అంది హీరోయిన్ శైలజ.
‘‘కాదు. మీరు అబద్ధాలు చెబుతున్నారు’’ అన్నాడు విలేఖరి.
‘‘మరి ఎంత అనుకుంటున్నారు?’’ కోపంగా అడిగింది శైలజ.
‘‘పదిహేను ఏళ్లే!...’’ చురక వేశాడా విలేఖరి.
**
ఆఫీసు
‘‘ఏమిటి అలా సోఫాలో కూర్చుని నిద్రపోతున్నారు. ఆఫీసుకి వెళ్లరా ఏమిటి?’’ స్వామిని తట్టి లేపింది వాళ్లావిడ.
‘‘అయ్యబాబోయ్? ఇది ఆఫీసుకాదా...?’’ కంగారుగా లేచి అన్నాడు స్వామి.
**
మాత్ర
‘‘నిద్ర పట్టడం లేదా? అయితే రాత్రి పడుకోబోయేముందు ఓ రెస్టిల్ మాత్ర వేసుకోండి’’ అన్నాడు డాక్టర్, పద్మనాభరావుతో.
‘‘అబ్బే! మధ్యాహ్నం ఆఫీసులో నిద్రపట్టడం లేదండీ! దానికి మాత్ర ఏం బావుంటుంది’’ అన్నాడు పద్మనాభరావు.
**
అవెందుకు
‘‘ఇక్కడ కత్తెర దొంగలుంటారు జాగ్రత్తగా వుండాలి’’ అన్నాడు బస్టాండు దగ్గర భర్త.
‘‘కత్తెర్లు దొంగిలించి అవేం చేసుకుంటారండీ?’’ అమాయకంగా అడిగింది భార్య.
**
కారణం
‘‘నా ప్రియురాలికి ప్రేమగా ఒక చేతి ఉంగరం కూడా ప్రెజెంట్ చేయలేకపోతున్నారా’’ అన్నాడు రాజారెడ్డి మహేష్‌తో.
‘‘ఏం డబ్బులులేవా’’ అడిగాడు మహేష్.
‘‘కాదు.. ప్రియురాలే లేదు’’ రాజారెడ్డి సమాధానం.
**
నమ్మకం
‘‘మా ఆయనకు నామీద పూర్తిగా నమ్మకం లేదంటే నమ్ము’’ అంది పద్మావతి శారదతో.
‘‘ఏమైంది. ఎందుకలా అనుకుంటున్నావ్.’’
‘‘ఏంలేదు. పొద్దున్న మూర్ఛ వచ్చినట్లు యాక్షన్ చేశాను. దగ్గర్లో ఇనప్పెట్టె తాళం వున్నా ఆయన ఇల్లంతా వెతికి, వంటింట్లోని ఓ పనికిరాని ఇనుపగరిట తెచ్చి నా చేతిలో పెట్టాడు’’ అంది పద్మావతి.
**
స్నానం
డైరెక్టర్ పద్మనాభరావుని తన రూముకి పిలిచాడు.
‘‘చూడు పద్మనాభరావ్! మన ఆఫీసులో బాత్రూంలు మాత్రమేకాక స్నానాల గది కూడా వుంది కదా! సాయంత్రం ఒకసారి ఆఫీసులో స్నానం చేయకూడదూ’’ అన్నాడు.
‘‘ఎందుకు సార్!’’ అన్నాడు పద్మనాభరావు.
‘‘నేనెప్పుడూ నిద్రలేచాక ఒకసారి స్నానం చేస్తా! అది మంచి అలవాటులే!’’ వ్యంగ్యంగా అన్నాడు డైరెక్టరు.
**
రక్తం
‘‘పండక్కి నన్ను పీడించి మరీ స్కూటర్ కొనుక్కున్నాడా మా అల్లుడు. తీరా అది నడుపుతూ వారంక్రితం యాక్సిడెంట్ చేశాడు. బోలెడు రక్తం పోయింది. ఎవరి రక్తం అతనికి సూట్ కాలేదు’’ అన్నాడు కళాకృష్ణ. ‘‘అయ్యో! మరి అప్పుడేం చేశారు?’’ ఆత్రంగా అడిగాడు రామారావు. ‘‘చివరకు ఒక జలగ రక్తం సరిపోయింది’’ కళాకృష్ణ సమాధానం.
**
5 comments:
జోకంటేనే అతిశయోక్తి అనుకుంటే...మీరు పెట్టిన ఆ ఆఖరి జోకు బావుందండీ..జలగరక్తం మాత్రమే సరిపోయింది అన్న జోక్.
Great Blog...So sweet! Jwala
Thank you sudha garu @Thanks a lot jwala garu!
hahahahahahah chala bagunaayandee
Sudhaama gaariki "aadivaaram saradaagaa kaaseapu" nijamgaanea saradaagaa undi.eeroajea modaTisaarigaa mee blogger coosaanu. thnk U -adari venkataramana.
Post a Comment