ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 16, 2011

అందానికి అందం


‘‘మీరూ మేమూ ఈ ప్రపంచానికే అందం’ అన్నారట స్వామీజీ సుందరీమణులతో’’ అన్నాడు సుందరయ్య నవ్వుతూ.


‘‘బాగు బాగు సచ్చిదానంద స్వరూపులు కదా! ‘అందమె ఆనందం’ అని విశ్వసించే వారిలో స్వామీజీలు ఉండడంలో అచ్చెరువేం లేదు. బ్రహ్మానంద సదృశం అయిన ముక్తి కోరుకునేవారు కూడా-స్వర్గస్థులవ్వాలనే కోరుకుంటారు. ఎందుకంటే స్వర్గంలోనే కదా రంభాద్యప్సరసలు ఉండేది! అంచేత ‘అందం’ అనే దాంట్లో నిండా మునిగే గొప్ప సుఖం ఉంది మరి’’ అన్నాడు ప్రసాదు.

‘‘ అందం గొప్పదే. కాదని ఎవరూ అనలేరు. కానీ అందానికి ఇచ్చే నిర్వచనం ఏమిటనేది ముఖ్యం. శారీరక అందమే అందమనుకోవడం చాలా మంది ధోరణి. సినీ నటీమణులు కొందరు తమ ముక్కులకు, మూతులకు ఆ మాటకొస్తే వక్ష స్థలానికి కూడా, అందంకోసం శస్తచ్రికిత్సలు చేసుకున్న కథనాలు మనకున్నాయి. కానీ సహజ సౌందర్యం వేరు. కృత్రిమ సౌందర్యం వేరు. తెచ్చిపెట్టుకున్నది తెచ్చిపెట్టుకున్నదిగానే ఉంటుంది’’ అన్నాడు శంకరం.


‘‘అవకాశం వస్తే మీ శారీరక లక్షణాల్లో దేనిని మార్చుకుందామనుకుంటున్నారు అని జడ్జీలు వేసిన ప్రశ్నకు-‘‘దేనినీ మార్చుకోను. దేవుడు నాకిచ్చిన దానితో నేను సంతృప్తిగా ఉన్నాను’’ అని జవాబిచ్చినందుకే సహజ సౌందర్యం ఆ భావనలో ఉందనేనేమో, అంగోలా దేశపు నల్లకలువ లీలాలోప్స్ 2011 సంవత్సరపు విశ్వసుందరి కిరీటాన్ని సాధించుకుంది. సౌందర్యం శారీరకం కాదని, అంతఃసౌందర్యంతో పరిపూర్ణ సౌందర్యం అనీ ఆ నల్లపిల్ల చాటిచెప్పింది’’ అన్నాడు సుందరయ్య.


‘‘ఔనౌను! ఆరు ఖండాలలోని ఎనభై తొమ్మిది దేశాలకు చెందిన సుందరాంగులు ఈ పోటీల్లో పాల్గొనగా, మొన్న సోమవారం అర్ధరాత్రి బ్రెజిల్ రాజధాని సౌపౌల్‌లో జరిగిన తుది పోటీలలో అంగోలా సుందరి లైలా క్రితం ఏడాది విశ్వసుందరిగా ఎంపికైన మెక్సికోకు చెందిన క్జిమేనా నవర్తేనుంచి కిరీటాన్ని అందుకుంది. మన తెలుగమ్మాయి కూడా ఈ పోటీలలో పాల్గొందిట కాని చివరి వరకు రాలేకపోయింది. ‘అందానికి అందం’ అని మనం ఏమీ అనుకోనక్కర్లేదులే!’’ అన్నాడు ప్రసాదు.

‘‘అసలు అందాల పోటీలను నిరసించేవారూ ఉన్నారు. ఇది సామ్రాజ్యవాద పన్నాగాలలో భాగం అనీ, సౌందర్య సాధనాలను అంటగట్టడానికి దేశవిదేశాల సుందరీ మణుల ఎంపిక నిమిత్తంగా నిర్వహించే ఒక వ్యాపార ఎత్తుగడలో భాగం తప్ప, మరేం కాదనీ అంటారు. అసలు అందాల పోటీలన్న భావన శరీర సంబంధిగా తోస్తోంది తప్ప, అంతఃసౌందర్యాన్ని కొలిచే సాధనాలేవీ?’’ అన్నాడు రాంబాబు కల్పించుకుంటూ.


‘‘అందాల పోటీలు యూరోపియన్ సంస్కృతినుండి మొదలైనవే. 1854లో మొదటిసారి రంగస్థలంపై అమ్మాయిలు వచ్చి తమ అందాలను ప్రదర్శించే పోటీలను, అమెరికాకు చెందిన పి.టి.బార్‌నుమ్ నిర్వహించాడు. అప్పట్లోనే జనం కొందరు నిరసన వెలిబుచ్చారట కూడాను. 1880లో బేతింగ్ బ్యూటీ పోటీలు మొదలై ఇప్పటికీ బీచి ఒడ్డున అందాల ఆరబోత పోటీలు జరుగుతునే ఉన్నాయి.


నిజానికి అందాల పోటీలు స్ర్తిలకే కాదు, పురుషులకూ ఉన్నాయి. ఎటొచ్చీ పురుషుల విషయంలో అది శారీరక దారుఢ్య పరీక్షలుగాను, శారీరక బలప్రదర్శనలుగానో ఉన్నాయి. సిక్స్ ప్యాక్‌లు, ఎయిట్ ప్యాక్‌లు అమర్చుకోవడం కాదు, ప్రకృతి సిద్ధంగా సహ�8ిద్ధంగా శరీరం ఎలా రూపురేఖలతో వుందనేదే నిజానికి అందానికి కొలబద్ద!


స్ర్తిలకు అందాల పోటీలు ఏర్పరిచి, ఎంపికైన వారిని ‘బ్యూటీక్వీన్’ అనీ, రన్నర్‌ని ‘ప్రినె్సస౰�్’ అనీ అనేవారు మునుపు. ఇప్పుడు పలు రకాల అందాల పోటీలు జరుగుతున్నాయి. నవ్వులో అందం, జుట్టులో అందం, బికినీలో అందం, ఆఖరికి లావులో అందం పోటీలు కూడా సాగుతున్నాయి. ‘అందం చూడవయా-ఆనందించవయా’ అనే కానె్సప్ట్ బాగా పెరిగిపోతోంది. కానీ ఆడవాళ్ల అందాలు అంటే, కప్పి వుంచవలసిన అందాలను బహిర్గతం చేసే ప్రదర్శనలు అనుకుంటే తప్పు!


మొన్న జరిగింది విశ్వసుందరి పోటీల అరవయ్యవ వార్షికోత్సవం ఇన్నాళ్లుగా, ఇనే్నళ్లుగా యుఎస్‌ఎ, వెనిజులా, బ్రెజిల్, స్వీడన్, కొలంబియా, పుర్టోరికో, ఇండియా, ఫిన్‌లాండ్, జపాన్, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, థాయ్‌లాండ్, అంగోలాకు చెందిన సుందరీమణులే ఎంపిక దాకా ఎదిగి వస్తూ గెలుస్తూ, ప్రధాన రాంకుల్లో కూడా నిలుస్తూ వస్తున్నారు.


న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన జర్నలిస్టు కోనేచుంగ్ వ్యాఖ్యానించినట్టు ‘‘అందాల సుందరీమణులు కేవలం మట్టిబొమ్మలు కాదు. వారి హృదయాంతరాళాల్లో ఏముందో తెలుసుకోవడం కూడా చాలా క్లిష్టం. మహిళలు అన్ని అంశాలు సీరియస్‌గా తీసుకుంటారు’’ అన్నది నిజం’’ అన్నాడు సుందరయ్య.


‘‘బాహ్య సౌందర్యం కన్నా అంతర్గత సౌందర్యం గొప్పదనీ, తన తల్లిదండ్రులనుంచి నేర్చుకున్న సంస్కారాన్ని జీవితాంతం పాటిస్తాననీ ప్రసంచ సుందరిగా ఎంపికైన లీలాలోప్స్ నిర్ద్వంద్వంగా ప్రకటించింది. అందం అంటే-ఒట్టి శరీరపు కొలతలు కాదు. నడతలు కూడాను. మన పురాణాల్లో సత్యభామ సౌందర్యంతో అహంకరించగా, రుక్మిణి తులసీదళంతో పతిని తులతూచి గెలుచుకున్న కథనం ఎరిగినదే కదా!


దేహ సౌందర్యం కాలం వెంట తరగిపోవచ్చు, పడిపోచ్చునేమో గానీ, నిజమైన ఆత్మసౌందర్యం, అంతఃకరణం సౌందర్యం ఉన్నవారు-శారీరకంగా ఎలా ఉన్నా సుందరుల కింద లెక్క! కమర్షియలిజం పెరిగిపోవడానికీ, వస్తు క్రయ విక్రయాలకూ శారీరక సౌందర్యం స్ర్తిలది ఎరగా చూపే నైజం కూడా సరైంది కాదు. దానిని ప్రతిఘటించాల్సిందే. అందాల పోటీలు హద్దు మీరనంత వరకూ, ఆరోగ్యవంతంగా ఉన్నంత వరకూ, స్ర్తిల అణచివేతలో సాధనాలు కానంతవరకూ, తప్పుపట్టక్కర్లేదేమో!’’ అన్నాడు శంకరం లేస్తూ.

***





2 comments:

gata said...

Oke oka sari na kavita Akashavani nundi konni samvatsarala kritam chadive avakasham kalipinchi nannu purtiga vismarincharu.

naravaramanisri said...

prapancheekarana moolamgaa prathidi vaanijyavastuvugaa roopu santharinchukuntundi.ee andaala poteela punyamtho chaalaamandi tama anthasoundaryam kanna bhahya soundaryamtho tamanutaamu pradarshinpajesukuntunnaaru.ee debbatho soundaryasaadhanala perutho bahulha jaathisanstalu vipareethamaina laaabhaalaanu moota gattukuntunnaai.ee vidhamgaa meetho okamaaru charchinche avakaasam kalpinchinanduku meeku danyavaadaalu samarpinchukuntunnaanu .sweekarinchandi manasaaraa.