నా చేయి తగలగానే
నీమనసు మేఘం
మాట చినుకై
కురవాలనుకుoటాను
కానీ
నీకంటగోదావరి నేనీదలేను
ఒడ్డున నిలబడి
తుఫానుచూడగలనే గానీ
ఊరడింపు పడవవేసుకుని
నీలోబుజ్జగింపు ప్రయాణంచేయలేనివాడిని
ఔను! నాకుఊరడించడంచేతకాదు
బతిమాలడంరాదు
నీ దుఃఖానికిభయంతోబిగుసుకుపోవడం
దానికి నేనే హేతువేమోనని
లోలో గిరికీలుకొట్టడం
స్థాణువునై
తెలియనినొప్పిపువ్వుపూసి
విసుగులో,వేదనలో,
చేతకానితనం చీకాకులో
చిట్లి పగలడంతప్ప
నాలోనువ్వేఒదిగిపోయి,
నీ అంతట నువ్వే
బహిర్గతం కావాలనీ.
ఎందుకు అవవనీఅనుకుంటూ
నీ వేదనాతీవ్రతనుతట్టుకోలేనివాడిని
నీకునేను
ఎలాస్వాంతనంకాగలనో
తెలియదు
ఏం చేస్తే,ఏలా మాట్లాడితే,
ఎలా ప్రవర్తిస్తే
నీకుఉపశమనమౌతుందో
అర్థంకాదు
ఏదోమాటాడి
నిజాయితీగానే నిన్నుస్పర్శించినా
ఆక్షణాలు నీకుఅత్యల్పాలు
నాకుమాత్రం
నువ్వెందుకు బహిర్గతం కావడంలేదన్నంత
సుదీర్ఘాలు
నేనేంచెయ్యను?
ఏం చెయ్యననేగా
నీఆరోపణ
నిజమే!
నా మౌనం అర్థం అవుతుందనుకోవడం,
నాలోమాటలుపెగలక పోవడం
నీలోదుఃఖమేఘం కమ్మినప్పుడల్లా
అది తుఫానై, వరదై
నన్నేచుట్టుముడుతుందని
నీకుతెలియకపోవడం
నన్ను నీముందు శప్తఎడారిగా విస్తరిస్తుంది
నీకై నేనున్నానన్నవిశ్వాసం
నీకువ్యక్తం చేయలేని
ఈ శమనవికలత్వాన్ని
సమాదరించి
నువ్వేభరిస్తున్నావు.
అదిచాలుదేవతా
6 comments:
ఓదార్పు అంటే ఇదేదో రాజకీయ ఓదార్పేమో అనుకున్నాసుమాండి!" నీకంట గోదారి నేనీదలేను !" అబ్బ!! చాలా బాగుందండి !!
ధన్యవాదాలు!!
సుధామ గారూ,
మీరిక మిగతా రచనలు కొంతకాలం పక్కన పెట్టి మాలాంటి వారి కొరకైనా కవితలు రాయండి.
చాలా చాలా బావుంది సుధామ గారూ...
I loved this ! :)
really really nice! too much mavayya! :)
Chaalaa baagundandee! Very touching
Post a Comment