ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, July 3, 2011

నవ్వుల నజరానా.....

సుఖాసనం

ఓ లావుపాటి పద్మ సినిమాకి వెళ్లింది. లోపలికెడుతూ గేట్ కీపర్‌కు రెండు టికెట్లు ఇచ్చింది.
వాడు ఆశ్చర్యంగా ‘‘మీరు ఒక్కరే వున్నారు రెండు టికెట్లెందుకమ్మా!’’ అన్నాడు.
ఆవిడ సిగ్గుపడుతూ ‘‘నేను కొంచెం లావుకదా అందుకు రెండు సీట్లలో సర్దుకు కూచుందామని’’అంది.
గేట్‌కీపర్ ‘‘బావుందమ్మా! మీ ఆలోచన. మీ సీట్ నెంబర్లు 52, 61 మరి’’ అన్నాడు నిర్వికారంగా.




లావు

బాలసుబ్రహ్మణ్యం ఫొటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లి ‘‘్ఫటోతీయించుకుని నెలయింది ఇంకా ఇవ్వవేంటయ్యా’’ అన్నాడు.
ఫొటోగ్రాఫర్ ‘‘మీరు కొంచెం లావుకదండీ! ఇంకా ప్రింట్ అవుతూ వుంది’’ అన్నాట్ట గుంభనంగా.


పరిహారం

‘‘పాపానికి పరిహారం చెల్లించుకోక తప్పదు’’ అన్నాడు డైరెక్టర్ నాగసూరితో
‘‘అయితే నేను ఉద్యోగం చేయడం పాపమంటారా’’ అన్నాడతను.


అదృష్టం

‘‘బోస్నియాలో ప్రతి మగవాడికీ పెళ్లికి ముందు కనీసం ఎనిమిది సంబంధాలు వుంటాయిట’’ అన్నాడు కృష్ణమోహన్ కళాకృష్ణతో
‘‘ఏమిటో! నాలాంటి వాడికి అలాంటి చోట పుట్టే అదృష్టమేనా వుండదు’’అని నిట్టూర్చాడు కళాకృష్ణ.


ప్రేమికుడు

‘గొప్ప ప్రేమికుడు ఎవరంటావ్’ అడిగాడు మూర్తి గోపాలాన్ని.
‘‘తొమ్మిది అంగుళాల నాలుక వుండి చెవుల ద్వారా ఊపిరి తీసుకోగలిగేవాడు నాయనా!’’అన్నాడు గోపాలం
.

శుభ్రత

‘‘రామ్మూర్తి ముక్కు చాలా శుభ్రంగా వుంటుందని నీకెలా తెలుసు’’ అడిగాడు ఇనస్పెక్టర్ పోలీసుని.
‘‘అతని వేలిముద్రలు అక్కడే దొరికాయి కాబట్టి’’ అని సమాధానం.


శుభవార్త

లాయర్ తన క్లయింట్‌తో ‘‘నీకో దుర్వార్త, శుభవార్త వున్నాయి’’ అన్నాడు
‘‘ముందు దుర్వార్త చెప్పండి’’ అన్నాడు క్లయింట్.
‘‘నీ డి.ఎన్.ఎ. పరీక్షల్లో నేరస్థలంలోని రక్తం నీదేనని తెలిసింది’’ అన్నాడు లాయర్.
‘‘ఓరి బాబోయ్! అయితే ఇంతకీ శుభవార్త ఏమిటి’’ అడిగాడు క్లయింట్
‘‘నీ కొలస్ట్రాల్ 130కి తగ్గింది.’’


‘మెన్’టల్

‘‘మెన్’టల్ ఇల్‌నెస్, ‘మెన్’టల్ బ్రేక్‌డౌన్, ‘మెన్’స్ట్రల్‌క్రాంప్స్, ‘మెనో‘పాజ్ ‘గై’నకాలజిస్టు, సమస్య పెరిగితే ‘హిజ్’స్ట్రెక్టమీ ఇలా స్ర్తిల సమస్యలన్నింటికీ ‘మెన్’యే కారణమని స్పష్టంగా తెలియడం లేదూ!’’... ప్రవచిస్తోంది ఫెమినిస్టు ప్రభ.

రాలేదు

అంతరిక్ష నౌక భూమికి తిరిగి వచ్చింది. వెళ్లిన ఇద్దరిలో ఒక్కరే తిరిగి వచ్చారు.
‘‘రెండవ వారికి ఏమయింది’’అని అడిగారు అధికారులు.
‘‘అంతరిక్షంలో ‘చూయింగ్‌గమ్’ మీద అడుగేసి, అతను అతుక్కుపోయాడు’’ అని సమాధానం.

* * *

ప్రశ్నలు- జవాబులు


ప్రశ్న: నీకు ముద్దుపేరు ఎందుకు లేదు
జవాబు: నా పేరే ‘ముద్దు’అని పెట్టారు కాబట్టి.

**

ప్రశ్న: రుచి చెప్పలేనిదెప్పుడు
జవాబు: తన నాలుక తనే కొరుక్కుని ఆ రుచి చెప్పమన్నప్పుడు

**

ప్రశ్న: జీబ్రా ఎలాంటిదంటే చెప్పలేవా ఎందుకు
జవాబు: అది నల్లచారల తెల్ల జీబ్రానా తెల్లచారల నల్ల జీబ్రానా ఎలా చెప్పడం?

**

ప్రశ్న: ఆ డాక్టర్‌గారు ఎవరికీ ఎక్స్‌రే తీయించరట ఎందుకు
జవాబు: ఆయనది ఎక్స్‌రే కన్నుటలే!

**

ప్రశ్న: నీ కార్లో స్పీడోమీటరే నీకు చాలా ఇష్టమా ఎందుకు
జవాబు: నేను నూటముప్ఫై కిలోమీటర్ల వేగంతో రోడ్డుమీద ఎలాగూ డ్రైవ్ చేయలేకపోయినా వెడుతున్నట్టుగా కనీసం అది చూపిస్తోందిలే.

**

ప్రశ్న: భర్తకన్నా గాడిదేనయమా ఎలా?
జవాబు: భర్త గాడిద కావచ్చు కానీ గాడిద భర్తనవ్వాలనుకునేంత గాడిద కాదు కాబట్టి

2 comments:

Prasad Cheruvu said...

ఈ ఆదివారం అందాలూ,అనన్దాలూ!

Prasad Cheruvu said...

ఈ ఆదివారం అందాలూ,అనన్దాలూ!