ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, May 12, 2011

నవ్వితే నవ్వండి...

వసూలు

‘‘మామూలు తలనొప్పికి డాక్టర్ శర్మగారు అయిదు వందల రూపాయలు వసూలుచేసేసరికి కడుపుమండి పోయిందనుకో’’.
‘‘ఏం చేశావ్ మరి.’’
‘‘ఆ విషయం ఆయనకే నేరుగా చెప్పేశాను.’’
‘‘ఏమయిందయితే.’’
‘‘కడుపుమంట కని ఓ మాత్ర ఇచ్చి ఇంకో అయిదువందల రూపాయలు వసూలుచేశాడాయన.

వడ్డన


పాపన్న పొరుగూరు వెడుతూ దారిలో పూటకూళ్లమ్మ ఇంటికి భోజనానికి వెళ్లాడు.
ఆమె విస్తరి వేసి రాయి పెట్టేసరికి ఆశ్చర్యపోతూ ‘‘ఏమిటి నేను ఎంత యవ్వనంలో వున్నా రాళ్లు తిని హరాయించుకో గలనా?’’ అన్నాడు.
‘‘గాలికి విస్తరి ఎగిరిపోకుండా రాయి పెట్టాను నాయనా? రాయి వడ్డించలేదు’’ అందావిడ.

స్థలమాహాత్మ్యం

‘‘ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక హాయిగా వుందోయ్. ఇంట్లో కూచోగానే అలా నిద్రవచ్చేస్తోంది సుమా’’ అన్నాడు రవిప్రకాశ్ పద్మనాభరావుతో.
‘‘ఔను ఎందుకు రాదు. మునుపు ఈచోట్లో ఓ గవర్నమెంట్ ఆఫీస్ వుండేది’’ అన్నాడు పద్మనాభరావు.

ఎదురు


నది ఒడ్డున నిలుచున్నతను ఒక స్ర్తి నదిలో పడిపోవడం చూసి రక్షించండి రక్షించండి అని అరిచాడు. బలమైన ఓ జాలరి పరుగున వచ్చాడు.
‘‘మా ఆవిడ మునిగిపోతోంది. రక్షించు. నీకు పదివేల రూపాయలిస్తా’’ అన్నాడతను.
జాలరి నదిలో దూకి ఎంతో కష్టపడి ఆ స్ర్తిని పైకి తెచ్చి అతనిముందు పెట్టి ‘‘ఏవీ నా పదివేల రూపాయలు’’ అని అడిగాడు.
‘‘అయ్యో! ఈవిడ మా ఆవిడ అనుకున్నానయ్యా? కాదు. మా అత్తగారు’’ అన్నాడతను.
జాలరి తన పర్సుతీస్తూ ‘‘నా దురదృష్టం లెండి. ఇంతకీ ఎంతిమ్మంటారు’’ అని అడిగాడు.

ఖర్చు


ఓ లాయరుగారి భార్యకు మోకాలు చిప్ప మార్చాల్సి వచ్చింది. డబ్బున్న లాయర్ డాక్టర్ గురవారెడ్డి చేత ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ బాగా జరిగింది. అయితే తొంభైవేల రూపాయల బిల్లు రావడంతో దేనికెంతయిందో వివరంగా బిల్లివ్వండని లాయర్ లేఖ రాసాడు. డాక్టర్ అలాగే బిల్లు పంపించాడు. అందులో ఇలా రాసి వుంది. చిప్ప ఖరీదు: పదివేలు. సరిగ్గా ఎలా అమర్చాలో తెలిసి అమర్చినందుకు: ఎనభైవేలు.

తెలుసా!


లాటిన్‌లో ‘పాలి’ అంటే ‘చాలా’అనీ, ‘టిక్స్’ అంటే ‘రక్తం పీల్చే కీటకాలు’ అనీ అర్థంట!
నిజమే చెబుతానని ప్రమాణంచేసే రాజకీయనేత అంటే ‘అబద్ధాలకోరు’ అనే.

బడాయి


చైతన్య కొత్తగా ఓ కంపెనీ మొదలెట్టాడు. దానికోసం ఓ ఆఫీస్ బిల్డింగ్ అద్దెకు తీసుకున్నాడు. మంచి ఫర్నిచర్‌తో, అందమైన వస్తుసామగ్రితో అలంకరించాడు. తన టేబుల్ దగ్గర కూచుని వుండగా ఓ వ్యక్తిలోపలికి వస్తూ కనిపించాడు. తను చాలా బిజీగా అనీ, వ్యాపారం బ్రహ్మాండం అనీ అతగాడు అనుకోవాలని చైతన్య ఫోనెత్తి పెద్దపెద్ద అంకెలు చెబుతూ కాంట్రాక్ట్ ఏదో అంగీకరిస్తున్నట్లు మాట్లాడి ఫోన్ పెట్టేసి వచ్చినతని వైపు తిరిగి ‘‘చెప్పండి. నేను మీకు ఏంచేయాలి’’ అని అడిగాడు.
‘‘కొంచెం మీరు ఇటేపు వస్తే ఫోన్ యాక్టివేట్ చేస్తాను. టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చా’’ అన్నాడతను కూల్‌గా.

ప్రశ్నలు- సమాధానాలు


ప్రశ్న: సగటున స్ర్తికి ఎన్ని పుట్టిన రోజులుంటాయి.
జవాబు: ఒక్కటే! మిగతావన్నీ జన్మదిన వార్షికోత్సవాలు.
* * *

ప్రశ్న: ఎనిమిది దివసములు ఒక వ్యక్తి నిదురించక ఎట్లుండును
జవాబు: దివములందుకాక రాత్రులందు నిద్రించునుగాన.
* * *

ప్రశ్న: చెరువులోకి రాయి విసిరితే ఏమవుతుంది.
జవాబు: రాయి తడిసిపోతుంది.
* * *

ప్రశ్న: సగం యాపిల్ పండులాగా ఆమె దగ్గర కనిపించేది ఏది
జవాబు: మిగతా సగం యాపిల్ పండు
* * *


ప్రశ్న: సముద్రం ఎందుకు ఉప్పగా ఉంటుంది
జవాబు: చేపల చెమట కలిసినందువల్ల.
***

ప్రశ్న: ‘్ఫ్లవర్’ తన గర్ల్‌ఫ్రెండ్‌తో అన్నదేమిటి?
జవాబు: ‘్ఫల్’ ఎందుకు ప్రేమలో పడడమని!
***

ప్రశ్న: క్యారెట్ల భాష ఏమిటి
జవాబు: గాజరాతి!
***

ప్రశ్న: ఒంటరి కాకి ఏమంది?
జవాబు: నేను ఏ‘కాకి’నని అంది.
***

ప్రశ్న: వన్ హ్యాండ్ వున్న మనిషి రోడ్డు ఎందుకు దాటాడు
జవాబు: సెకండ్ హ్యాండ్ షాప్‌కి వెళ్లడానికి
***

ప్రశ్న: కాలిపోతున్న క్యూలో తరువాత రమ్మనేదేమిటి
జవాబు: కాలిక్యులేటర్
***

ప్రశ్న: పిపీలికం పక్షి ఎలా అయ్యింది
జవాబు: పీలి పోయి

***
ప్రశ్న: ఓ గోడను ఎనిమిది మంది ఓ గంటలో కట్టేస్తే దాన్ని కట్టడానికి నలుగురికి ఎంత సమయం కావాలి

జవాబు: అస్సలు సమయం అక్కరలేదు. ఆ గోడ కట్టేసే వుంది కదా.

*
***
.

0 comments: