లవ్ కెరియర్
‘‘ఆ కార్పొరేట్ కంపెనీ సి.ఇ.ఓ. కూతురుని ప్రేమించాననీ, ఆమె కూడా నిన్ను ఇష్టపడుతోందనీ అన్నావుగా ఎప్పుడు మరి పెళ్లి’’ అడిగాడు ప్రీతమ్‌ని రక్షిత్.
‘‘వాళ్ల నాన్నలా తను కూడా నన్ను ప్రేమతో ట్రైనింగ్ పిరియడ్ ప్రొబేషన్ పిరియడ్ అంటూ రెండేళ్లుగా పార్కులు, హోటళ్లు, సినిమాలకు మాత్రం నాతో తిరుగుతూ, తిప్పుతూ విషయం మటుకు పొడిగిస్తోందిరా’’ బావురుమన్నాడు ప్రీతమ్.
కలర్స్
భార్య: ఏమండీ! నా జుట్టు తెల్లబడ్డాక కూడా ప్రేమిస్తూనే వుంటారుగా
భర్త: నాకు అన్ని కలర్స్ ఇష్టమేనోయ్! నీ జుట్టుని అది ఏ రంగులో వున్నా నేను తప్పక ఇష్టపడుతూంటాను.
చేతిరాత
‘‘మీ ఆయన తన డైరీ అలా ఎక్కడపడితే అక్కడ పడేసి పోతారంటున్నావ్ నువ్వు చదువుతావని కాకపోయినా, ఎవరైనా చదువుతారనే అనుమానమేనా ఆయనకి లేదా?’’ అడిగింది ఉష ప్రసన్నది.
‘‘ఆయన చేతి రాత చాలా ఛండాలంగా ఉంటుందని ఆయన నమ్మకం. పైగా ఎలాగూ ఆయన డాక్టర్ కదా’’ అంది ప్రసన్న.
ఎలర్జీ
తనకు తెలియని ఏదో ‘ఎలర్జీ’ ఉందంటూ డాక్టర్‌గారిని కలిసాడు మధు డాక్టరుగారు పరీక్షలన్నీ చేసి.
‘‘ఏం లేదోయ్! అన్నివిధాలా ఆరోగ్యంగా వున్నావ్! నీకేం ఎలర్జీ’’ అంటూ భుజంతట్టి రెండొందల రూపాయల బిల్లువేసి ఇచ్చాడు.
చెంగున ఎగిరి మధు ‘‘ఇదిగో... ఇదే... ఇలాంటి బిల్లులు చెల్లించాలంటేనే నాకు ఎలర్జీ’’ అని పరుగెత్తి వెళ్లిపోయాడు.’’
రిపేర్
‘‘నా ఛెవర్లెట్ కారు కొన్నాక రిపేర్‌ని ఇంతవరకూ ఒక్క వంద రూపాయలయినా ఖర్చుచేయలేదు తెలుసా?’’ గర్వంగా అంది సీనియర్ సినిమా తార కొత్త నటితో.
‘‘ఔనౌను! ఈ విషయం కార్లు రిపేర్ చేసే మెకానిక్ నాతో చెప్పి చాలా బాధపడ్డాడు కూడాను’’ అంది కొత్త నటి.
SMS (సరదా మాటల శైలి)
కాలేజీ అంటే
కావలసినంత మంది
లేడీస్‌ను
జీ బార్గా ప్రేమించగల చోటని
అందుకే అబ్బాయిలు రెగ్యులర్‌గా కాలేజీకి వెడతారు.
తెలిసిన సంగతే
గైడ్ పర్యాటకులకు ఎత్తయిన రెండు గుట్టలు చూపిస్తూ.
‘‘తెలంగాణలో ఎత్తయిన గుట్టలివే. ఇంత ఎత్తుగా ఈ గుట్టలు తయారయ్యేందుకు వందల సంవత్సరాలు పట్టింది’’ అన్నాడు.
‘‘అంతేనయా! మన ప్రభుత్వాలు సంగతి తెలిసిందే కదా’’ అని అలవాటుగా నిట్టూర్చాడు ఓ పెద్దాయన.
తెలివి
‘నో పార్కింగ్’ అని వున్నచోట తన కారు పార్క్‌చేసి షాపింగ్ పూర్తిచేసుకుని బయటకొచ్చేసరికి కారు దగ్గర మీసాల పోలీస్ కానిస్టేబుల్ కనిపించేసరికి గతుక్కుమని ఆటోలో ఇంటికొచ్చేసి.
‘‘హలో! పోలీస్‌స్టేషన్ ఫలానా నెంబర్‌గల నా కారు గంటక్రితం చోరీకి గురి అయింది. నగరంలో లా అండ్ ఆర్డర్ ఏం లేదా’’ అని ఫోన్ చేసింది కొత్తగా ఎం.ఎల్.ఎ అయిన సినీ నటి.
పదిహేను నిమిషాల్లో అదే మీసాల పోలీస్ కానిస్టేబుల్ ఆవిడ ఇంటి ముందు కారు నిలబెట్టి సలాం కొట్టి వెళ్లాడు.
వయసు
ప్రముఖ సినీ నటి తన స్నేహితురాలితో
‘‘రెండేళ్లుగా అందరూ నా వయస్సు ఇరవై ఏళ్లనే అనుకుంటున్నారు. నేనూ నా అసలు వయసు ఎవ్వరికీ చెప్పలేదు’’ అంది.
‘‘కానీ ఏదో ఒకరోజు ఎవరికయినా తప్పకుండా చెప్పాల్సి వస్తుంది’’ అంది స్నేహితురాలు.
‘‘ముప్ఫై ఏళ్లుగా దాచిపెట్టిన సంగతి మరికొన్ని సంవత్సరాలు దాచలేనా ఏమిటి అదేం కష్టం?’’ అంది సినీ నటి.
* * *
4 comments:
ఒరులేయవి యొనరించిన నరవర
తన మనమున కప్రియమగు ఒరులకు
తానవి చేయకునికి పరాయణము
పరమధర్మముల కెల్లన్.
ఈ ప్రకారం జీవిత గమనాన్ని నడుపుకోగలగటం జీవితానికి సార్ధకత మరియు దానివలన
మనకు ఎనలేని తృప్తి అని నమ్ముతూ జీవితాన్ని నడుపుకోవటంలో ఆనందం ఉన్నది
సంతోషం
ఒరులేయవి యొనరించిన నరవర
తన మనమున కప్రియమగు ఒరులకు
తానవి చేయకునికి పరాయణము
పరమధర్మముల కెల్లన్.
ఈ ప్రకారం జీవిత గమనాన్ని నడుపుకోగలగటం జీవితానికి సార్ధకత మరియు దానివలన
మనకు ఎనలేని తృప్తి అని నమ్ముతూ జీవితాన్ని నడుపుకోవటంలో ఆనందం ఉన్నది
సంతోషం
ఎలర్జీ
తనకు తెలియని ఏదో ‘ఎలర్జీ’ ఉందంటూ డాక్టర్‌గారిని కలిసాడు మధు డాక్టరుగారు పరీక్షలన్నీ చేసి.
‘‘ఏం లేదోయ్! అన్నివిధాలా ఆరోగ్యంగా వున్నావ్! నీకేం ఎలర్జీ’’ అంటూ భుజంతట్టి రెండొందల రూపాయల బిల్లువేసి ఇచ్చాడు.
చెంగున ఎగిరి మధు ‘‘ఇదిగో... ఇదే... ఇలాంటి బిల్లులు చెల్లించాలంటేనే నాకు ఎలర్జీ’’ అని పరుగెత్తి వెళ్లిపోయాడు.’’
నా అనుభవం: మోకాళ్ళ నేప్పులని వైద్య నిపునుడిని కలిస్తే కాళ్ళు అటుఇటు తిప్పి వయస్సు కారణం అని చెప్పి రెండు రకాల మాత్రలు రాసీ 250 పుచ్చుకున్నాడన్దీ!
hahhhhaa avemravu garu u really made my day.....hayaaigaa undi praanam.......love ...j
Post a Comment