ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, April 24, 2011

ఆదివారం ఆంధ్రభూమిలో జోకులు





టీవీ

నిన్న రాత్రి మా ఆవిడకూ నాకూ దెబ్బలాటయింది ఎందుకంటే ‘‘టీవీ మీద ఏం వస్తోంది’’ అని అడిగింది తను
‘‘దుమ్ము’’ అన్నానంతే!




ఒక్కదానే్

కాబోయేఅల్లుడిని పిల్లతండ్రి అడిగాడు.
‘‘బాబూ! ఒక కుటుంబాన్ని పోషించగల స్థోమత నీకుందా?’’
దానికి అబ్బాయి- ‘‘లేదండీ! నేను కేవలం మీ అమ్మాయి పోషణ చూసుకోగలను. మీ సంగతి మీరే చూసుకోవాలి’’ అన్నాడు కచ్చితంగా.

ఫార్ములా

‘‘నీటికి కెమికల్ ఫార్ములా ఏమిటి ప్రియాంకా’’ అడిగింది టీచర్.
‘‘హెచ్-ఐ-జె-కె-ఎల్-ఎమ్
-ఎన్-ఓ’’ అంది ప్రియాంక.
‘‘ఏమిటి నువ్వు చెబుతోంది’’ అంది కెమిస్ట్రీ టీచర్ నివ్వెరపోతూ.
‘‘నిన్న మీరేగా చెప్పింది హెచ్‌టుఓ అని’’ అంది ప్రియాంక.

వివాహకాంక్ష


దేవదాసు, హైమ చర్చిలో పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకుని చర్చి ఫాదర్‌కు చెప్పారు. ఆయన ఆదివారం ప్రార్థనల తరువాత వారి కోరినట్లే నలుగురి ముందూ సింపుల్‌గా పెళ్లిచేస్తారమ్మన్నారు. ఆదివారం రానే వచ్చింది. ఫాదర్ కాంగ్రిగేషన్ ముందు జంటను పిలవాలనుకున్నాడు. కానీ వాళ్ల పేర్లు మర్చిపోయినందువల్ల- పెళ్లాడదామని అనుకున్నవారెవరో కొంచెం నా ముందుకొస్తారా’’ అని పిలిచాడు. వెంటనే తొమ్మిది మంది అమ్మాయిలు, ముగ్గురు విధవలు, నలుగురు భార్యావిహీనులు, ఆరుగురు బ్రహ్మచారులు ఆయన ముందుకొచ్చారు.

ఆచూకీ

పోలీస్ ఆఫీసర్: మీ బ్యాంక్ క్యాషియర్ తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. ఎలా వుంటుందో చెబుతారా?
బ్యాంక్ మేనేజర్: ఆరడుగుల పొడుగు గానూ, ఆరు లక్షల రూపాయల తరుగుగానూ వుంటుంది.

వదిలిపోయారు

‘‘మా తాతగారు పోతూ పోతూ పది మిలియన్ల డాలర్లు వదిలేసి పోయారు’’ అంది అమెరికా అమ్మాయి.
‘‘మా తాతగారు చనిపోతూపోతూ 20 మిలియన్ల డాలర్లు వదిలేసి పోయారు అమెరికాలో సంపాదించిన దానితో సహా’’ అంది ఇండియా అమ్మాయి.
‘‘అదేం విశేషం కాదు మా తాతగారు పోతూపోతూ మొత్తం ప్రపంచానే్న వదిలేసిపోయారు’’ అంది పాకిస్థానీ అమ్మాయి.

పని

‘‘నీకు ఉద్యోగం ఇవ్వలేనయ్యా! నీవుచేయగల పని ఏదీ మా కంపెనీలో లేదు’’ అన్నాడు మేనేజర్.
‘‘మరీ మంచిది సార్! మిమ్మల్ని నేను పని ఏమీ అడగను ఎలాగూ! ఉద్యోగం ఇవ్వండి చాలు’’ అన్నాడు రమణ
.

ఎవరి పని వారిదే

ఒకతను గొయ్యి తవ్వుతున్నాడు. ఇంకొకతను వెంటనే ఆ గోతిని మట్టితో పూడ్చేస్తున్నాడు. అలా గోతులు తవ్వుతూ పూడుస్తూ పోతున్న వారిని చూసి ఆశ్చర్యంగా ‘‘మీరు చేస్తున్న పనేమిటో నాకు తెలియడం లేదు’’ అన్నాడు కృష్ణారావు.
‘‘మొక్కలు నాటవలసిన మాలోని మూడో అతను ఇవాళ సెలవులో వున్నాడండీ అంచేత టైం వేస్ట్ చేయకుండా మా పని మేం చేస్తున్నాం’’ అన్నారు వాళ్లు.

ప్రశ్నలు- సమాధానాలు

ప్రశ్న: స్ర్తియే ప్రపంచ పాలకురాలు అయితే?
జవాబు: యుద్ధాలేవీ ఉండవు. అసూయతో పరస్పరం మాట్లాడుకోని కొన్ని దేశాలుంటాయి అంతే!
* * *
ప్రశ్న: పగిలిన తరువాత అత్యంత ఉపయోగకరమైనదిగా వుండేది ఏది?
జవాబు: గ్రుడ్డు.
* * *
ప్రశ్న: పాకిస్థాన్‌లో పుట్టిన పెద్దవాళ్ళెంతమంది వున్నారు?
జవాబు: ఎవ్వరూ లేరు. అందరూ పిల్లలుగానే పుట్టారు.
* * *
ప్రశ్న: బాదు, బాదు అని జంటగా వినిపించేది ఎక్కడ?
జవాబు: హైదరాబాదు, సికిందరాబాదు
* * *
ప్రశ్న: కళాకృష్ణ ప్రేమలో పడ్డాడని నీకెలా తెలుసు
జవాబు: అతిచౌక మొబైల్ ఫోన్‌కోసం వెదుకుతున్నాడని తెలిసిందిగా
* * *
ప్రశ్న: లెక్చరర్ వినోదిని ఉపన్యాసంవల్ల నువ్వేం నేర్చుకున్నావ్ మీ క్లాస్‌లో
జవాబు: నోరు తెరవకుండా ఆవులించడం

2 comments:

Indian Minerva said...

అసూయతో పరస్పరం మాట్లాడుకోని కొన్ని దేశాలుంటాయి అంతే!

:D

A K Sastry said...

చాలా బాగున్నాయి "జో...కులు".