ఎందుకు కాదు లెక్కల్ టీచర్ బోర్డుమీద 31వేసి ఎంత అని అడిగాడు సుమిరను
‘్థర్టీవన్’ అంది సుమిర. 21 అంకెవేసి ఎంత అని అడిగాడు. ‘ట్వంటీవన్’ అంది సుమిర. 11 అంకెవేసి ఎంత అని అడిగాడు. ‘వన్‌టీవన్’ అంది సుమిర. అది ‘లెవన్’అని లెక్కల టీచర్ అంటే- ‘వన్‌టీవన్’ ఎందుకుకాదు అని రెట్టించింది సుమిర. అవును ఎందుకు కా(కూడ)దు?
తేడా ‘గుట్టు’కూ‘రట్టు’కూ మధ్య తేడా ఏమిటి అమ్మా’’ అడిగింది కూతురు తల్లి కామేశ్వరిని. ‘‘నువ్వు నా కూతురివి అన్నది రట్టు. మీ నాన్నగారు ఎవరన్నది గుట్టు’’ అంది ఆ తల్లి.
చిత్తుప్రతి ‘‘బ్రహ్మదేవుడు మగవాడికంటే ముందు ఆడదాన్ని ఎందుకు పుట్టించాడో తెలుసా’’ అడిగింది ప్రియాంక తన బాయ్‌ఫ్రెండ్‌ని. ‘‘తెలుసు? ఫైనల్ కాపీకి ముందు రఫ్‌డ్రాఫ్ట్ అంటే చిత్తుప్రతి ఒకటి సిద్ధం చేసుకోవడం మంచిదని’’ అన్నాడతను. అర్హత ‘‘వాతావరణ శాఖలో ఉద్యోగానికి వెళ్లానా? నేను పొట్టిగా వున్నానని వాళ్లు పనికిరావన్నారు’’ అన్నాడు బాలభాస్కర్ టాల్‌స్టాయ్‌తో. ‘‘పొట్టికీ, వాతావరణ శాఖకూ ఏమిటి సంబంధం’’ ఆశ్చర్యంగా అడిగాడు టాల్‌స్టాయ్. ‘‘వాన పడుతోందన్న విషయం ఆలస్యంగా తెలిసేది పొట్టివాడికి అనిట’’ అన్నాడు బాలభాస్కర్ దిగులుగా. పాలసీ ‘‘జీవిత బీమా’’ అంటే ఏమిటి అని అడిగాడు దేవుడు, చనిపోయి వచ్చిన రమణని. ‘‘బ్రతికున్నంతకాలం పేదగా వుంచి, సంపన్నుడిగా చనిపోయే కాంట్రాక్ట్’’ అన్నాడు రమణ.
సుఖం ‘‘ఎనభై ఏళ్లు వచ్చాయ్ కదా? అందువల్ల ప్రత్యేకమైన ప్రయోజనం ఏమన్నా కనబడిందా’’ అని అడిగారు రమణని ఒకాయన. ‘‘ఇన్సూరెన్స్ ఏజెంట్లు పాలసీ తీసుకోమని నావెంట పడడం తగ్గింది’’ అన్నారు రమణ.
కారణం ‘‘కాలేజీ బ్యూటీ అయిన సుధ ముద్దు పెట్టుకోనిచ్చింది అంటున్నావ్! దానికి సంతోషించక మొహం అలా వ్రేలాడేశావేం’’ అడిగాడు రమణ సాయిని. ‘‘కాలేజీ ఫ్రెండ్స్ అందరిలో అందరికంటే నీ ముద్దే బావుంది అంది మరి’’ అన్నాడు సాయి.
నామధేయం అతడు: మా నాన్న ‘లాఫింగ్’, మా అమ్మ ‘స్మైలింగ్’. ఆమె: నువ్వు ‘కిడ్డింగ్’వా అయితే అతడు: అది మా అన్నయ్య. నేను ‘జోకింగ్.’!
ముష్టి కాఫీకి పది రూపాయలివ్వండి సార్’’ అడిగాడు ముష్టివాడు. ‘‘పది రూపాయలకు రెండు కప్పుల కాఫీ వస్తుంది’’ అన్నాడు వంశీమోహన్. ‘‘అవునండీ! నాతో నా గర్ల్‌ఫ్రెండ్ కూడా వుంది’’ అన్నాడు ముష్టోడు. ‘‘ముష్టివాడికి గర్ల్‌ఫ్రెండా?’’ ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. ‘‘గర్ల్‌ఫ్రెండ్ కారణంగానే ముష్టివాడినండీ’’ అన్నాడతను జవాబుగా.
ప్రశ్నలు- సమాధానాలు ప్ర: మొదట బంగాళదుంప ఎక్కడ పుట్టింది చెప్పు చూద్దాం. స: భూమిలో ** ప్ర: కిందికి వచ్చేదేగానీ, ఎప్పుడూ పైకి వెళ్లనిది ఏది? స:వాన ** ప్ర: ఆకాశానికి ప్రకృతి సిద్ధంగా కట్టబడే ‘రిబ్బన్’లాంటిది ఏమిటి? స: ఇంద్ర ధనుస్సు ** ప్ర: ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు వేటకువెళ్లి, తలో జింకనూ వేటాడారు. తీరా లెక్కపెడితే మూడు జింకలే వున్నాయి! అదెలా? స: వెళ్లింది ముగ్గురే వ్యక్తులు. కొడుకు, తండ్రి, తాత-మరి! ** ప్ర: అరేబియా పాలవాడిని ఏమని పిలవచ్చు? స: మిల్క్‌షేక్. ** ప్ర: విత్తుముందా చెట్టుముందా స: విత్తే. నువ్వు చెట్టుముందా విత్తుముందా అని అడిగితే అది చెట్టు
7 comments:
సుధామ గారూ - బ్లాగ్లోకానికి స్వాగతం....సంతోషం...ఆనందం...బ్లాగ్ రూపు రేఖలు బాగున్నాయి....ఒక్కటే ఒక్కటి - ఆ పైన అలా కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్న 'ఒరులేయవి...." అన్నది వీలుంటే తీసెయ్యండి......జ్యోతిగారి విన్యాసం అయ్యుంటుందని నా ఊహ....ఆవిడ ఏ బ్లాగు చూసినా, అలా ఏదో ఒకదాన్ని పరిగెత్తిస్తూ ఉంటారు.... :)
సుధామ గారు - బ్లాగ్విశ్వ విహంగంలో మీ సుధామధుర ప్రవాహానికి శుభాకాంక్షలు. చాలా బాగున్నాయి.
సుధామగారు, తెలుగు బ్లాగ్లోకానికి సుస్వాగతం..
వంశీగారు ,, ఇదన్యాయం. ఎక్కడ ఈ విన్యాసం కనపడినా నేనే చేసాననడం అస్సలంటే అస్సలు బాలేదు. మీ హర్ట్...:))
Sudhaama gaaru...
annee bagunnaayi... marikonniti kosam kallu vethikaayi...
సుధామ గారూ, బ్లాగ్ లోకానికి స్వాగతం.
అందరికీ శతధా ,సహస్రధా ధన్యవాదాలు.మీ అందరి అభిమానంతో, అండదండలతో ఈ అక్షర ప్రయాణం అంతర్జాలం లో సాగించాలని ఆసిస్తున్నాను.
శ్రీ...
సుధామ గారూ మీ బ్లాగు డిఫరెంట్ గా ఉంది. కొనసాగించండి
Post a Comment