ఆలోచన
"న్యూటన్ కంటే నేనే గొప్ప ఆలోచనపరుడిని తెలుసా!" అన్నాడు రక్షిత్.
"ఎలాగో చెప్పు" అడిగాడు విరించి
"న్యూటన్ ఆపిల్ పండు కిందపడగానే పైకి పోకుండా కింద ఎందుకు పడిందా అని ఆలోచించాడు.అదే నేనైతేనా కింద పడిన పండును నోట్లోకి పోనిచ్చి ఇంకో పండు కింద ఎప్పుడు పడుతుందా అనిఆలోచిస్తాను"అన్నాడు రక్షిత్.
***
ఖర్చు
ప్తియాంక,లావణ్య బజారులో వెడుతున్నారు.ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.
"కొంచెం దయ చూపరాదా" అని అడిగాడు
ప్రియాంక అతని జోలెలో అయిదువందల రూపాయిల నోటు వేసింది.
లావణ్య ఆశ్చర్యంగా "అదేమిటే ఎందుకంత వేసావ్ " అని అడీగింది,
" పాపం! మేం కాలేజిలో వుండగా నా కోసం అతను ఇలాంటి నోట్లు చాలా ఖర్చు పెట్టాడు లేవే! " అంది ప్రియాంక.
***
చిరగదు
"మేడం ఈ తానులో జాకెట్ గుడ్డ తీసుకోండి.బాగా మన్నుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ అస్సలు చిరగదు అంటే నమ్మండి. " అన్నాడు సేల్స్ మెన్ పద్మినికి తాను చూపిస్తూ.
"చాలా బాగుంది కానీ వద్దులే " అంది పద్మిని.
"అదేంటి మేడం అలా అంటారు.పెద్ద ఖరీదు కూడా కాదిది "అన్నాడు సేల్స్ మెన్.
" నిజమేనయ్యా ! కానీ నాకు జాకెట్టుకు 80 సెంటీ మీటర్లు చాలు.కానీ నువ్వేమో ఎట్టి పరిస్థితుల్లోను అస్సలు చిరగదంటున్నావు. ఎలా చించి ఇస్తావు.మొత్తం తాను కుట్టించుకోలేను కదా " అంది పద్మిని.
***
కారణం
" పెళ్ళిచూపుల్లో 'అమ్మాయిని ఏదైనా అడగలనివుంటే అడుగుబాబూ!'అని పెద్దలు ఎందుకు
అంటూవుంటారో నాకు అర్థం కాదు" అంది హైమవతి.
"పెళ్ళయ్యాక అబ్బాయిలకు మళ్ళీ ఆ అవకాశం రాక పోవచ్చనే అయ్యుంటుంది." అంది విజయలక్ష్మి కూల్ గా.
***
ఉచిత సేవ
"నేను చాలా పేదవాడిని. మీ ఫీజ్ ఇచ్చుకోలేను.కానీ మా ఆవిడ ఆపరేషన్ చేసినందుకు మీ ఇంటిల్లి పాదికీ జీవితాంతం నా పని ఉచితంగా చేసి పెడతాను" అన్నాడు వీరబాహు.
"ఇంతకీ నువ్వు ఏం చేస్తూ వుంటావు" అడిగాడు డాక్టర్.
"శ్మశానం లో కాటి కాపరినండీ. శవాలు తగలేస్తూ ఉంటాను" అన్నాడు అతగాడు.
***
మందు
జయపాల్ రెడ్డి ప్రతిరోజూ ఈగిల్ బార్ కెళ్ళి మందు కొడుతూ ఉంటాడు. రెండు గ్లాసుల్లో మందు పోసుకుని ఒక గ్లాస్ లోది కొంచెం సిప్ చేసాక ఇంకో గ్లాస్ లోది సిప్ చేస్తూ ఉంటాడు.అది చూసి ఒకరోజు సర్వర్ ' ఎందుకలా చేస్తారు " అని అడిగాడు.
"నేను ఎప్పుడూ నా ఫ్రెండు కృష్ణమా చారి తో కలసి త్రాగేవాడినయ్యా!అతను చనిపోయాడయ్యా. అంచేత అతని జ్ఞాపకంగా అలా చేస్తూ ఉంటాను." అన్నాడు జయపాల్.
కొన్నాళ్ళు పోయాక ఒక గ్లాస్ లో మాత్రమే పోసుకు తాగుతున్న జయపాల్ రెడ్డిని చూసి సర్వర్ "అదేమిటి సార్! మీ మిత్రుడు కృష్ణమాచారిని పూర్తిగా మరచి పోయారేమిటి "అని అడిగాడు.
"లేదయ్యా! నేను మందు మానేసాను:అన్నాడు జయపాల్ రెడ్డి.
***
ప్రశ్నలు-సమాధానాలు
ప్రశ్న: క్లుప్తంగా రాజినామా లేఖ రాయడం ఎలా
జవాబు: డియర్ సార్! మీ అవిడా నేనూ ప్రేమించుకుంటున్నాం అని రాయడమే
***
ప్రశ్న:మీరిప్పటికి ఎన్ని పోస్ట్ మార్టం లు శవాలకు చేశారు డాక్టర్
జవాబు: నేను చేసిన పోస్ట్ మార్టంలన్నీ శవాలకేనయ్యా!
***
ప్రశ్న: అస్థి పంజరం రోడ్డెందుకు దాట లేదు
జవాబు: దానికి 'గట్స్ ' లేవు కనుక
***
ప్రశ్న: పొద్దున్న లేవగానే ' లతా! నిన్నెప్పటికీ గాఢంగా ప్రేమిస్తూ ఉంటాను "అని సారథి అన్నా వాళ్ళవిడకి కోపం ఎందుకు వచ్చింది.
జవాబు: వాళ్ళావిడ పేరు ఉష కనుక.
***
1 comments:
హ..హ..హ..:)
Nice
Post a Comment