అమ్మకం
ఓ ఇంగ్లీష్‌వాడు, స్కాటిష్‌వాడు, ఐరిష్‌వాడు ఓరోజు ఇంటింటికీ తిరిగి బైబిల్స్ అమ్మాలనీ ఎవరు ఎక్కువ అమ్ముతారో చూద్దామనీ పందెం వేసుకున్నారు. సాయంత్రం కలుసుకున్నప్పుడు
"నేను రెండు అమ్మాను" అన్నాడు ఇంగ్లీష్‌వాడు
"నేను అయిదు అమ్మాను" అన్నాడు స్కాటిష్‌వాడు
‘‘నే..నే..నే..ను అ..అ..ఆ.. అరవై.. అ..అ.. అమ్మాను’’ అన్నాడు ఐరిష్‌వాడు.
‘‘ఎలా అమ్మావ్’’ అడిగారు మిగతా ఇద్దరూ.
‘‘నే..నే..ను ప్ర..ప్ర..ప్రప్రతి వా..వా..వాళ్ల.. ఇం..ఇం..ఇం.టి... త...త...త... తలుపూ కొ..కొ...కొ...కొట్టి బై.. బై...బై.. బైబిల్ ఒ...ఒ...ఒ... ఒకటి కొ...కొ...కొ... కొంటారా... లే.. లే... లే... లేక న...న..న... నన్ను... చ... చ... చ... చదివి. వి.. వి.. వి...వినిపించ మం... మం... మంటారా... అ... అ... అ... అని... అ... అ... అ... అడిగాను’’ అన్నాడతను.

**
మరణం
మరణం
వెంగళప్పా, వెర్రిపప్పా టీ త్రాగుతూండగా ఫోన్ మ్రోగింది. వెర్రిపప్ప ఫోన్ విని బేర్‌మని ఏడవసాగాడు.
‘ఏమయింది’ అని అడిగాడు వెంగళప్ప. ‘‘మా అమ్మ ఇప్పుడే ఫోన్‌చేసి మా నాన్నగారు చనిపోయారు అని చెప్పింది’’ అన్నాడు వెర్రిపప్ప.
‘ఏమయింది’ అని అడిగాడు వెంగళప్ప. ‘‘మా అమ్మ ఇప్పుడే ఫోన్‌చేసి మా నాన్నగారు చనిపోయారు అని చెప్పింది’’ అన్నాడు వెర్రిపప్ప.
‘‘అయాం సోసారీ’’ అంటూ వెర్రిపప్పను ఊరడించాడు వెంగళప్ప.
అతను ఏడుపు ఆపుకునే టైంకి మళ్లీ ఫోన్ మ్రోగింది. ఫోన్ ఎత్తి వెర్రిపప్ప మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు.
‘‘ఏమయింది’’ అడిగాడు వెంగళప్ప.
‘‘మా ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది. ఆవిడ మామగారు కూడా చనిపోయారట’’ అంటూ బావురుమన్నాడు వెర్రిపప్ప.
**
హింస
హింస
గృహహింసకు పాల్పడ్డాడని బాబూరావ్‌ని పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు.
‘‘మీ ఆవిడను అంతలా ఎలా కొట్టావ్’’ అడిగాడు జడ్జి.
‘‘వ్యాయామం చేసిన నా శరీర బలమే దోహదపడిందనుకుంటున్న
నా పొడుగాటి బలిష్ఠమైన చేతులు, పిక్కబలంగల నా కాళ్లు బాగా
‘‘వ్యాయామం చేసిన నా శరీర బలమే దోహదపడిందనుకుంటున్న
నా పొడుగాటి బలిష్ఠమైన చేతులు, పిక్కబలంగల నా కాళ్లు బాగా
ఉపయోగించగలిగాను’’ అన్నాడు బాబూరావు.
**
కాల్పనికం
పూర్ణచంద్ర పుస్తకాల షాపుకు వెళ్లి ‘‘భార్యను లొంగదీసుకోవడం సులభమే అనే పుస్తకం వుందా’’అని అడిగాడు.
అక్కడున్న సేల్స్‌గర్ల్ ‘‘సారీ అండీ! కాల్పనిక సాహిత్యం దొరికేది ఇక్కడ కాదు. వేరేచోట’’ అంది కూల్‌గా.
**
తేడా
‘‘గర్ల్‌ఫ్రెండ్‌కీ సెల్‌ఫోన్‌కీ గల తేడా ఏమిటి?’’ అడిగాడు రమణ చలపతిరావుని.
‘‘సెల్‌ఫోన్‌ని సైలెంట్‌మోడ్‌లో పెట్టగలం’’ అన్నాడు చలపతిరావు.
**
త్రాగినందుకే
ఓ చలికాలం రాత్రి బార్లో బాగా మందుకొట్టేసిన సూర్యం వెయిటర్‌తో బయట కార్లోనే తన భార్యని వదిలి వచ్చానని చెప్పాడు.
వెయిటర్ పాపం ఆవిడెలా వుందో అని కారుదాకా వెళ్లి చూస్తే కారు వెనుక సీట్లో ఆమె ఎవడితోనూ కౌగిలిలో కనబడింది.
వెయిటర్ వచ్చి సూర్యంతో ‘‘ఓసారి మీ ఆవిడను చూసిరండి’’ అన్నాడు. సూర్యం వెళ్లి, నవ్వుకుంటూ మళ్లీ లోపలికొచ్చాడు.
‘‘ఏంటలా నవ్వుకుంటున్నారు’’ అడిగాడు వెయిటర్
‘‘వాడెవడో తెగ తాగేసి వాడిని నేనే అనుకుంటున్నాడు’’ అన్నాడు సూర్యం.
**
ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న:ఆ జంతువు నడవలేదు, మాట్లాడలేదు, వినలేదు. అది బొమ్మకాదు. అదేమిటో చెప్పుచూద్దాం.
జవాబు: తెల్లకాగితం మీద రాసిన ‘జంతువు’అనే పదం.
జవాబు: తెల్లకాగితం మీద రాసిన ‘జంతువు’అనే పదం.
ప్రశ్న: ఒక నిముషం యొక్క విలువ ఎప్పుడు బాగా తెలుస్తుంది.
జవాబు: టాయ్‌లెట్‌లో ఎవరో వుండి మనం బయటవున్నప్పుడు.
**
ప్రశ్న: ఆఫ్రికాలో పుట్టిన పసిపాప దంతాలు ఏ రంగులో వుంటాయి
జవాబు: పుట్టిన ఏ పసిపాపకూ దంతాలు వుండవు
ప్రశ్న: ఆఫ్రికాలో పుట్టిన పసిపాప దంతాలు ఏ రంగులో వుంటాయి
జవాబు: పుట్టిన ఏ పసిపాపకూ దంతాలు వుండవు
ప్రశ్న: సూరీడు ఉదయమే కానీ ,రాత్రి బయట ఎందుకు కనబడడు
జవాబు: వాళ్ళమ్మ వెళ్లనీయదు కనుక
**
ప్రశ్న: నీళ్లల్లో ఎక్కువసేపు ఉండలేని చేప ఏది
జవాబు: చచ్చిన చేప
ప్రశ్న: నీళ్లల్లో ఎక్కువసేపు ఉండలేని చేప ఏది
జవాబు: చచ్చిన చేప
**
0 comments:
Post a Comment