ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, May 15, 2011

ఆదివారం సరదాగా కాసేపు

పదాల వాడకo

భర్త: చూశావా! ఈ పేపర్లో రాశారు రోజుకి మగవాడు పదిహేనువేల పదాలు మాట్లాడితే అదే స్ర్తి అయితే ముప్ఫైవేల పదాలు వాడుతూ వుంటుందిట.
భార్య: మగాడికి అర్థం కావడానికి స్ర్తి చెప్పిందే చెప్పాల్సి రావడం బహుశా కారణం అయ్యుంటుంది లెండి.
భర్త: ఏమిటన్నావ్.. మళ్లీ చెప్పు మళ్లీ చెప్పు.

ఈగ
చాలాకాలం క్రితం పెద్ద అటవీ ప్రాంతం మీదుగా వెడుతున్న ఓ హెలికాఫ్టర్‌లో సడన్‌గా ఇంధనం అయిపోయింది. పైలట్ జాగ్రత్తగా దింపాడు కానీ క్రింద సన్నగా మంట వున్న పెద్ద పాత్రలోని నీటిలోకి హెలికాఫ్టర్ పడింది. అక్కడ స్థానిక అడవి మనుషులందరూ చూసారు. ఆ ఆటవిక జాతి పెద్ద మాత్రం ‘‘నేను త్రాగే సూప్‌లో ఈ ఈగ ఎలా పడింది’’ అన్నాడు వంట వాళ్లతో కోపంగా.
అందరిలానే

ఒకతను సెలూన్‌కు వెళ్లాడు. గడ్డం గీయడానికి బార్బర్ సబ్బు నురగ పట్టించగానే- ‘‘చెంపల మీద సన్నటి వెంట్రుకైనా మిగలకుండా నున్నగా గీయాలోయ్’’ అన్నాడు. ‘‘అయితే బుగ్గలు కొంచెం ఉబ్బి ఉండేలా, ఇవి బుగ్గన పెట్టుకోండి’’ అని డ్రాయర్‌లోంచి రెండు చిన్న ప్లాస్టిక్ బంతులు తీసిచ్చాడతను. గడ్డం నున్నగా గీయడం అయిపోగానే వాటిని తీసి ఇస్తూ ‘‘ఒకవేళ వీటిని పొరపాటున నేను మింగేసి వుంటేనో’’ అని అడిగాడు. ‘‘రేపు కాలకృత్యం తీరగానే అందరిలానే పట్టుకొచ్చి  ఇచ్చేవారు  అంతకన్నా ఏముంది భాగ్యం’’ అన్నాడు బార్బర్.

రిపేర్

పదేళ్ల తరువాత తన గ్రామానికి వెళ్లిన సుందరశాయి అన్నీ అలాగే ఏ మార్పూ లేకుండా వుండడం గమనించాడు. తాను ఊరెళ్లేముందు చెప్పుల దుకాణం ఒక దాంట్లో తన జోళ్లు రిపేర్‌కివ్వడం గుర్తొచ్చి ఆ షాప్‌లోకి వెళ్లాడు. అదే యజమాని అతన్ని చూసి ‘‘పదేళ్ల క్రితం నేను మీ షాపులో చెప్పులు రిపేర్‌కిచ్చా గుర్తుందో లేదో’’ అన్నాడు నవ్వుతూ. షాపు యజమాని ‘‘ఒక నిముషం సార్! చెక్ చేసి చెబుతా’’అని లోపలికి వెళ్లివచ్చి ‘‘ఎల్లుండికల్లా బాగుచేసి రెడీగా వుంచుతాం సార్ రండి’’ అన్నాడు.

వేగం


స్కూలు ప్లేగ్రౌండ్‌లో ముగ్గురు పిల్లలు మాటాడుకుంటున్నారు. వాళ్ల నాన్నల గొప్పతనం విషయం వచ్చింది.
‘‘మా నాన్న ఎంతవేగంగా పరిగెడతారంటే లక్ష్యం చూసి ఓ బాణం సంధించి వదిలితే అది ఆ లక్ష్యం చేరేలోగానే అక్కడకు ఆయన చేరుకుంటారు’’ అన్నాడు రక్షిత్.
‘‘మా నాన్న ఓ పోలీసు ఆఫీసర్. తుపాకీ పేల్చారంటే ఆ గుండు వెళ్లే లోగానే అంతదూరం తను వేగంగా పరుగెత్తి చేరుకుంటారు’’ అన్నాడు రోహిత్.
‘‘మీకు మా నాన్న గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు. మా నాన్న గవర్నమెంట్ ఆఫీసు ఉద్యోగి సాయంత్రం 4.30కు పని ముగించుకుని మూడూ నలభై అయిదుకే ఇంట్లో వుంటారు తెలుసా!’’ అన్నాడు పునీత్.

పిలుపు


‘‘కాళ్లు లేని కుక్కని ఏమని పిలుస్తారు.’’
‘‘ఏమని పిలిచినా ఒకటే! అది రాలేదు కదా ఎలాగూ!’’

ప్రశ్నలు- జవాబులు

ప్రశ్న: విదేశానికి ఎగిరివెళ్లిన తొలి భారతీయ వనిత ఎవరు?
జవాబు: సీత... రావణుడితో.

* * *
ప్రశ్న: తన బిడ్డ కనిపించకపోతే ‘కంగారూ’ ఎలా కంగారుపడుతుంది
జవాబు: అయ్యో అయ్యో! ఎవరో నా జేబు కొట్టేసారు.

* * *
ప్రశ్న: ఎప్పుడూ నవ్వని అమ్మాయికి హిందీ క్లాసులో ఏం పేరెట్టారు
జవాబు: ‘హసీ‘నా’

* * *
ప్రశ్న: పరోపకారమే మన పరమధర్మం తెలుసా?
జవాబు: మరి పరులధర్మం ఏమిటిట

* * *
ప్రశ్న: మా పెంపుడు కుక్క మొహం మీద ఊదితే ‘‘్భంయ్యి’మని అరిచింది. అదే కార్లో తీసుకెడుతూంటే- కిటికీలోంచి గాలిని ఎంజాయ్ చేసింది ఎందుకంటావ్?
జవాబు: నీ ‘గాలి’ దానికి పడదన్నమాట!


* * *
ప్రశ్న: డ్వాక్రా గ్రూపులమీద ఏమిటిట నీ అభ్యంతరం?
జవాబు: సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులంటారు. సెల్ఫ్‌హెల్ఫ్ అన్నప్పుడు మళ్లీ గ్రూప్ అనడం ఎలానప్పుతుంది?

0 comments: