ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, May 8, 2011

ఆదివారం సరదాగా కాసేపు...



సమ్మోహనం

భర్త: సమ్మోహనం అంటే ఏమిటి
భార్య: ఒక వ్యక్తిని తన ప్రభావంతో వశంచేసుకుని తను కోరినట్లు ఆడించగలగడం
భర్త: అరే! దాన్ని పెళ్లి అంటారుకదుటోయ్.

అందం

రామం, శకుంతల చంద్ర ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లి చిత్రాలు చూస్తున్నారు. శకుంతల రామానికి ఒక ఫ్రేమ్‌లో బొమ్మ చూపిస్తూ ‘‘చంద్ర అమ్మాయిల బొమ్మలు చాలా అందంగా వేస్తాడు. కానీ ఇదొక్కటీ ఏమిటో అంత అందంగా లేదు కదూ!’’ అంది.
‘‘నువ్వు చూస్తున్నది అద్దం’’ అన్నాడు రామం గుంభనంగా.

కారణం

‘‘ఇటీవల వరకట్నం చావులు బాగా తగ్గిపోయాయి చూస్తున్నావా ఎందుకంటావ్! మన ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటావా’’ అడిగింది సంధ్య సత్యవతిని.
‘‘ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణం అయ్యుండచ్చులే! ఎందుకంటే ఇటీవల కిరోసిన్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయిగా’’ అంది సత్యవతి.

ఫుట్‌బాల్
‘‘ఇంతమంది ఫుట్‌బాల్‌ను ఎందుకలా తంతున్నారు మమీ!’’ అడిగింది సుమిర.
‘‘గోల్ చేయడంకోసం.’’
‘‘్ఫట్‌బాల్ ‘గోల్’గానే వుందిగా, ఇంకెంత గోల్ (గుండ్రం) చేస్తారు?’’

తట్టుకోలేను

‘‘నేను చచ్చిపోతాను’’ అంది భార్య.
‘‘నువ్వు చచ్చిపోయిన మరుక్షణం నేనూ ఛస్తాను’’ అన్నాడు భర్త.
‘‘నువ్వెందుకు ఛస్తావ్’’ అంది భార్య.
‘‘అంత ఆనందాన్ని ఒక్కసారిగా నేను తట్టుకోలేను మరి’’ అన్నాడతను.

ప్రమాణం

‘‘సిగరెట్లూ, మందు తాగమని ప్రమాణం చేయండి’’ కాలేజీలో విద్యార్థులతో అన్నాడు ప్రిన్సిపాల్.
‘‘తాగం’’ అన్నారు పిల్లలు.
‘‘అమ్మాయిల వెంటపడం అని ప్రమాణం చేయండి.’’
‘‘వెంటపడం’’
‘‘ఎవరిమీద గొంతెత్తి అరవం’’
‘‘అరవం’’
‘‘దేశంకోసం సైన్యంలో చేరి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం.’’
‘‘తప్పకుండాను! ఇలాంటి బ్రతుకుకన్నా అదే నయంకదా’’ అన్నారు పిల్లలు.

అది తప్పు

‘‘నిన్న రాత్రి నిద్రలో నన్ను మీరు నానా తిట్లూ తిట్టారు తెలుసా’’ అంది సుభద్ర భర్తతో.
‘‘నువ్వు పొరపడ్డావు కచ్చితంగా’’ అన్నాడు భర్త.
‘‘ఏం పొరబడ్డాను.’’
‘‘నేను నిద్రలో వున్నాననుకున్నావు చూడు! అది తప్పు’’ అన్నాడు కూల్‌గా భర్త.

ప్రశ్నలు-జవాబులు

ప్రశ్న: ‘్ఛంజ్ ఈజ్ ఇన్విటబుల్’ అనే మాట ఎందుకొచ్చింది
జవాబు: అప్పటికి నోట్లు లెక్కించే మిషన్ కనిపెట్టలేదు కాబట్టి.
**
ప్రశ్న: స్ర్తి అవడంవల్ల గొప్ప ప్రయోజనం ఏమిటీ
జవాబు: తల మీద మొలిచినన్ని వెంట్రుకలు ముక్కులో రావు.
**
ప్రశ్న: ఇబ్బందులెదురవుతాయని తెలిసే పనులను పిల్లలెందుకు చేస్తారు
జవాబు: అనుమతి పొందడంకన్నా పెద్దల క్షమ పొందడం సులభం అని వాళ్లకు తెలుసుకాబట్టి.
**
ప్రశ్న: ‘నేడు’ అనగానేమి?
జవాబు: నిన్నటి గురించి చింతించే రేపు
**
ప్రశ్న: ‘వయసు’ గురించి స్ర్తి పురుషుల మధ్య వచ్చే పెద్ద సమస్య ఏమిటి
జవాబు: కొందరు స్ర్తిలు ఒప్పుకోలేరు. కొందరు మగాళ్ళు నటిస్తూంటారు.
**
ప్రశ్న: ఒకరు నీకు చెయ్యి వూపడం లేదని ఎలా తెలుసు
జవాబు: వేలెత్తి చూపుతూ వుండడంవల్ల

3 comments:

CH.K.V.Prasad said...

ఇవి పూత రేకులా? అల్లం మురబ్బానా?నా అన్న వాళ్ళందరికీ పంపాను!

హనుమంత రావు said...

సుధామ గారూ నమస్కారము....
మాధుర్యపు "పూత" కాదు
తియ్యందనముతో నిండిన "పూత రేకులు"

మానస.. said...

:) nice andee.. bagunnayi :)