అన్వేషణ
అంటే ఏమిటనే ప్రశ్న
అనేకానేకంగా ఆవిర్భవిస్తూ
నిఘంటువుల వెంటా,
పురావస్తుశాలల వెంటా పడింది.
కళ్ళముందు చూస్తూ చూస్తూ ఉండగానే
అదృశ్యమైపోతున్నయికదా ఎన్నెన్నో
ఇది ఒక పదమా,
కాకుంటే పదార్థమా
ఎక్కడని వెతకను.
నా చూపు మందగించిందో
లేక తనే మసకబారి మసకబారి
తరలిపోయి మటుమాయమౌతోందో
ఎవరైనా చూసారా అని
ఆర్త వతంసుడనై అడుగుతూనేవున్నా
అసలు ఎవరికీ పట్టినట్టేలేదు
ప్రత్యేక రాష్ట్రం గురించీ,
ప్రపంచకప్పు విజయంగురించీ
ఆయన ఉద్యమించేదాకా అసలు ఉన్నట్టే పట్టనట్టున్న
అన్నాహజారే ధ్వజమెత్తిన అవినీతి గురించీ
ఒకటే ముచ్చట్లు పెడుతున్నారు గానీ
దీని స్పృహేలేదే
ఖర ప్రవేశించి
గాడిదలమయ్యామనుకుందామంటే
మునుపే వికృతిలో వున్నామాయె
ప్రభవాదిగా ప్రకృతే
అలా మలుచుకుంటున్నామాయె
నిజమే
మునుపింత విషాదం ముప్పిరిగొనలేదు.
ఇంతో కాసింతో ఇంగితం వుండేది
చెట్టు నరకాలంటే చేతులాడేవి కావు
మొక్క నాటడానికి మురిపెం వుండేది
భూమిని నమ్ముకున్న వారేగానీ
ఇలా అమ్ముకునేవారు తక్కువ
పక్కపక్కల విస్తరించుకోవడమేగానీ
ఇలా ఒకరినెత్తిన ఒకరు పైకెక్కి నివసించే
అపార్ట్ మెంట్ కల్చర్ అధిగమించింది కాదు
ఉదయాస్తమయాల సూర్యచంద్రులను
పెరటి వేపచెట్లనూ,అరటినీ,మామిళ్ళనూ ఎరుగని
పిదపకాలం వస్తుందనుకున్నామా
సహజ వనరులైన నీటీనీ,గాలినీ కూడా
అమ్మకం సరుకుగా కొనుక్కు
వాడుకోవలసి వస్తుందనుకున్నామా
టీ.వీ మైదానాల్లో చూడడంతప్ప
సహజంగా ఆడుకోలేని ఎడారి స్థితి
దాపురిస్తుందనుకున్నామా
కోతికొమ్మచ్చులూ లేవు,
ఈతబావులూ లేవు
నగరం ఒక కాంక్రీట్ జనారణ్యం
తెల్లవారిలేస్తే రక్తమోడుతున్న దిన పత్రికలు
నిరంతర దృశ్యశ్రవణ వార్తా హింస
కక్షలు కార్పణ్యాల జీడిపాకం సీరియల్స్
ఎక్కడని వెతకను
ఖచ్చితంగా భయపడి పారిపోయే వుంటుంది
పాపం కల్మషమెరుగని భోళా భాళాది
పువ్వులో కనబడేది,
నవ్వులో కనబడేది
యువజంట లవ్వులో కనబడేది
మావిచివురు కొమ్మమాటు
కోకిలమ్మ మధురస్వరంలో వినబడేది
కొత్త పెళ్ళికూతురు అడుగులో తడబడేది
ఉగాది నాటి కవిసమ్మేళనంలో
కవిగారి అక్షరంలో చొరబడేది
ఏమైపోయిందో
అచ్చమైన వసంతం,పచ్చపైరు వసంతం,
మచ్చలేని వసంతం
ప్రకృతిలో తచ్చాడడం లేదు
హృదయపుష్ప వసంతం కోసం
తనువు తరువును
సంక్షుభిత సమాజ శిశిరంలో
రాల్చుకుంటూనే వున్నాను
వసంతం సంత సరుకు కాదు
కానీ ఇంత వింత కొరతవుతుందనుకోలేదు
ఆలస్యం కాకుండానే
అన్వేషించి తెచ్చుకుందాం రండి
దూరదూరాలకు పోకుండా
దక్కించుకుందాం రండి
కాసింత భరోసా
కాసింత నమ్మకం కలిగించి
కాలధర్మం చెందకుండా
కాలధర్మాన్ని కాపాడుకుందాం రండి.
చైత్రాన్ని చిత్తంలో నిలుపుకుని
మానవీయమై చిగురిద్దాం రండి.
*
అంటే ఏమిటనే ప్రశ్న
అనేకానేకంగా ఆవిర్భవిస్తూ
నిఘంటువుల వెంటా,
పురావస్తుశాలల వెంటా పడింది.
కళ్ళముందు చూస్తూ చూస్తూ ఉండగానే
అదృశ్యమైపోతున్నయికదా ఎన్నెన్నో
ఇది ఒక పదమా,
కాకుంటే పదార్థమా
ఎక్కడని వెతకను.
నా చూపు మందగించిందో
లేక తనే మసకబారి మసకబారి
తరలిపోయి మటుమాయమౌతోందో
ఎవరైనా చూసారా అని
ఆర్త వతంసుడనై అడుగుతూనేవున్నా
అసలు ఎవరికీ పట్టినట్టేలేదు
ప్రత్యేక రాష్ట్రం గురించీ,
ప్రపంచకప్పు విజయంగురించీ
ఆయన ఉద్యమించేదాకా అసలు ఉన్నట్టే పట్టనట్టున్న
అన్నాహజారే ధ్వజమెత్తిన అవినీతి గురించీ
ఒకటే ముచ్చట్లు పెడుతున్నారు గానీ
దీని స్పృహేలేదే
ఖర ప్రవేశించి
గాడిదలమయ్యామనుకుందామంటే
మునుపే వికృతిలో వున్నామాయె
ప్రభవాదిగా ప్రకృతే
అలా మలుచుకుంటున్నామాయె
నిజమే
మునుపింత విషాదం ముప్పిరిగొనలేదు.
ఇంతో కాసింతో ఇంగితం వుండేది
చెట్టు నరకాలంటే చేతులాడేవి కావు
మొక్క నాటడానికి మురిపెం వుండేది
భూమిని నమ్ముకున్న వారేగానీ
ఇలా అమ్ముకునేవారు తక్కువ
పక్కపక్కల విస్తరించుకోవడమేగానీ
ఇలా ఒకరినెత్తిన ఒకరు పైకెక్కి నివసించే
అపార్ట్ మెంట్ కల్చర్ అధిగమించింది కాదు
ఉదయాస్తమయాల సూర్యచంద్రులను
పెరటి వేపచెట్లనూ,అరటినీ,మామిళ్ళనూ ఎరుగని
పిదపకాలం వస్తుందనుకున్నామా
సహజ వనరులైన నీటీనీ,గాలినీ కూడా
అమ్మకం సరుకుగా కొనుక్కు
వాడుకోవలసి వస్తుందనుకున్నామా
టీ.వీ మైదానాల్లో చూడడంతప్ప
సహజంగా ఆడుకోలేని ఎడారి స్థితి
దాపురిస్తుందనుకున్నామా
కోతికొమ్మచ్చులూ లేవు,
ఈతబావులూ లేవు
నగరం ఒక కాంక్రీట్ జనారణ్యం
తెల్లవారిలేస్తే రక్తమోడుతున్న దిన పత్రికలు
నిరంతర దృశ్యశ్రవణ వార్తా హింస
కక్షలు కార్పణ్యాల జీడిపాకం సీరియల్స్
ఎక్కడని వెతకను
ఖచ్చితంగా భయపడి పారిపోయే వుంటుంది
పాపం కల్మషమెరుగని భోళా భాళాది
పువ్వులో కనబడేది,
నవ్వులో కనబడేది
యువజంట లవ్వులో కనబడేది
మావిచివురు కొమ్మమాటు
కోకిలమ్మ మధురస్వరంలో వినబడేది
కొత్త పెళ్ళికూతురు అడుగులో తడబడేది
ఉగాది నాటి కవిసమ్మేళనంలో
కవిగారి అక్షరంలో చొరబడేది
ఏమైపోయిందో
అచ్చమైన వసంతం,పచ్చపైరు వసంతం,
మచ్చలేని వసంతం
ప్రకృతిలో తచ్చాడడం లేదు
హృదయపుష్ప వసంతం కోసం
తనువు తరువును
సంక్షుభిత సమాజ శిశిరంలో
రాల్చుకుంటూనే వున్నాను
వసంతం సంత సరుకు కాదు
కానీ ఇంత వింత కొరతవుతుందనుకోలేదు
ఆలస్యం కాకుండానే
అన్వేషించి తెచ్చుకుందాం రండి
దూరదూరాలకు పోకుండా
దక్కించుకుందాం రండి
కాసింత భరోసా
కాసింత నమ్మకం కలిగించి
కాలధర్మం చెందకుండా
కాలధర్మాన్ని కాపాడుకుందాం రండి.
చైత్రాన్ని చిత్తంలో నిలుపుకుని
మానవీయమై చిగురిద్దాం రండి.
*
7 comments:
అదృశ్యమైపోతున్న వసంతం కాలధర్మం చెందకుండా కాలధర్మాన్ని కాపాడుకుందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి అంటే ప్రభుత్వానికి, ప్రజలకి కూడా సొంత లాభం కొంత మానుకునే నిజాయతీ కావాలి. ప్రతి మనిషిలో ఈ నిజాయితీ రావాలనే ధ్వని,ఆర్తి "అన్వేషణ" ఘోషిస్తోంది. స్పందన దైవాధీనం.
bhagundandi mee kavitha,
Kokilamma mavi chivuru meyatam oka kavisamayam.Aamani lo dani'kuhu' saitam.Varshagamana vela dani rutham vinnanu.Gajanan Taman
Kokilamma mavi chivuru meyatam oka kavisamayam.Aamani lo dani'kuhu' saitam.Varshagamana vela dani rutham vinnanu.Gajanan Taman
Thank you for your response Gajanantaman garu!
వసుధంతా వసంతమే
మనిషికి మనిషి ఆత్మీయత పంచిన నాడు
వసుథైక కుటుంబం గా వర్థిల్లిన నాడు .
----- సుజన-సృజన
రాజారావ్ గారూ! మీ ఆత్మీయతకు కృతజ్ఞుడిని
Post a Comment