ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 30, 2013

ఆడ’ పెత్తనం


‘ ‘ఆడ పెత్తనం’అని మనకో మాటుంది. పురుషాధిక్య వ్యవస్థ సృష్టించిన పదమే అయ్యుంటుందన్నది యధార్థం కానీ నిజానికి పెత్తనం మగవాడు నిర్వహించడానికీ, స్ర్తిలు నిర్వహించడానికీ బోలెడు తేడా వుంటుందన్నది యథార్థం. మగవాడు బుద్ధితో మటుకే ఆలోచిస్తాడు. స్ర్తి హృదయంతో ఎక్కువగా ఆలోచిస్తుందిట. కొన్ని నిర్ణయాలు బుద్ధితో తీసుకోవాలి కానీ హృదయంతో, మెతక మనసుతో తీసుకుంటే సరికాదు అనే దృష్టిలోనే కాదు, ఒక రకమైన మొండితనంతో, గయ్యాళితనంతో కూడా కొందరు స్ర్తిలు నిర్ణయం తీసుకుంటారనీ అందువల్ల సమస్యలు ఇబ్బడిముబ్బడవుతాయనే అర్థంలోనూ ‘ఆడ పెత్తనం’ అన్నమాట వ్యవహారంలోకి వచ్చిందట’’ అన్నాడు సన్యాసి.


‘‘నిజానికి దేశానికి అధినేత రాష్టప్రతి. ఒక సంస్థకు నిజానికి కార్యదర్శి ఎంత ప్రముఖమో దేశానికి ప్రధానమంత్రి అంత ముఖ్యం. కానీ తమాషాగా ‘మన్మోహన్‌సింగ్’ ప్రధానిగా ఓ కీలుబొమ్మ అనీ ప్రధాని పదవిని త్యాగం చేసి పార్టీ అధ్యక్ష స్థానమే వహిస్తున్న సోనియాదే అసలు పెత్తనమనీ అందరూ అనుకుంటున్నమాటే! అదీకాక అసలు ఆవిడే 2007లో మొట్టమొదటిసారి ప్రతిభాపాటిల్‌ను అంటే ఒక స్ర్తిని దేశానికి అధ్యక్షురాలిని చేసింది. అంతకుముందు అబ్దుల్‌కలామ్‌గారు ఆ స్థానానికి ఎంత వనె్నతెచ్చారో తెలిసీ, పోటీ లేకుండా ఎన్నుకునేట్లయితే రెండవదఫా రాష్టప్రతిగా కొనసాగుతానని ఆయన అన్నా ‘‘ఏరికోరి అంతకుముందు ఏ రకంగానూ తెలియని శ్రీమతి ప్రతిభాపాటిల్‌ను సోనియా ప్రెసిడెంట్‌ని చేసారు. అలా అసలైన ఆడ పెత్తనం దేశానికి అప్పుడే సంక్రమించింది’’ అన్నాడు శంకరం.


‘‘నిజమే! నిజానికి ప్రతిభాపాటిల్ ఇందిరాగాంధీ గారింట్లో ఆవిడకు వంటవండి, అంట్లుతోమి బట్టలుతికేవారనీ ఆవిడ వండే ‘పూరన్‌పోరి’ వంటకం అంటే ఇందిరకు చాలా ఇష్టం అనీ ఆ అభిమానంతోనే ప్రతిభాపాటిల్‌కు ఇందిరాగాంధీ అమరావతి, అకోలాల్లో చిట్‌ఫండ్ కంపెనీలు నిర్వహించుకునేందుకు లైసెన్స్ ఇప్పించారనీ చెప్పుకోవడం యథార్థమే! ఎందరో పేద రైతులు ప్రతిభాపాటిల్‌గారి చిట్‌ఫండ్ కంపెనీల్లో మదుపుపెట్టి నష్టపోయారట. అసలు ప్రతిభాపాటిల్ దేశాధ్యక్షురాలిగా వుండగానే డిసెంబర్ 9, 2009లో చిదంబరంగారూ తెలంగాణ ప్రక్రియ ప్రారంభ ప్రకటన చేసారు. ఆడ పెత్తనాల కాలమే అది మరి! సోనియాగారు నిజంగా ‘అత్తలేని కోడలుత్తమురాలు’ అన్న చందాన ఇందిరాగాంధీ సమైక్యానికి ఎంత పట్టుదలగా నిలబడ్డారో అందుకు పూర్తి వ్యతిరేకంగా కేవలం ‘సెంటిమెంట్స్’ గురించి హృదయంతో నిర్ణయించారనీ, అత్తచేయనిది చేసి ఉత్తమురాలివి కమ్మని సోనియాకు ప్రతిభాపాటిల్‌గారి ప్రోత్సాహం కూడా అప్పుడే ఉండిందనీ ఓ అనధికార ఉవాచ’’ అన్నాడు సన్యాసి.


‘‘అసలు దేశం పరువుప్రతిష్ఠలు వ్యక్తిగత స్వార్థానికి బలిఅయిన సందర్భం ఏదయినా వుంటే ప్రతిభాపాటిల్‌గారు దేశాధ్యక్షురాలిగా వున్న కాలమేనర్రా! అయిదేళ్ళ రాష్టప్రతి పదవీకాలంలో ఆవిడ దేశానికి ప్రయోజనదాయకంగా చేసిందేమీ లేదు. కానీ ఆ అయిదేళ్ళ కాలంలో కుటుంబ సభ్యులతో ఆవిడ చేసిన ఇరవై రెండు విదేశీ పర్యటనలకుగాను ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మునుంచే అక్షరాలా 40మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి రూపాయల్లోకి మారిస్తే లెక్క ఇంకా ఎంత గాభరా పెడుతుందో చెప్పాలా?
తన సోదరుడు జి.ఎన్.పాటిల్ కాంగ్రెస్ పార్టీలో వుంటూ జలగాంలో విశ్రాంపాటిల్ మీద పదమూడు ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు పట్టపగలే విశ్రాం హత్య జరిగినా సోదరుడి మీదకు నేరం రాకుండా అడ్డుపడిందావిడే నట! జలగాం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి దక్కలేదని 2004-2005లో అతనే ఆ హత్య చేయించాడనీ సి.బి.ఐని కూడా రాజకీయ ప్రాబల్యంతో తప్పుదోవ పట్టించారనీ చెప్పుకుంటారు. అంతెందుకు 2012లో పదవీ విరమణకు ముందు ముప్ఫైఅయిదు మంది నేరస్తులకు ప్రతిభాపాటిల్ క్షమాభిక్ష పెట్టింది. అంత సంఖ్యలో ఏ రాష్టప్రతీ అంతకుముందు అలా శిక్షలు రద్దుచేయలేదు. పసిపిల్లల్ని రేప్ చేసిన కరడుగట్టిన పాపులు కూడా విడుదలయిన వారిలో వున్నారట నాడు’’ అన్నాడు ప్రసాద్ కొంచెం కోపంగా.


‘‘ఆడదాని గురించి అవాకులు చెవాకులు మాట్లాడ్డం అనుకుంటారేమోగానీ నిజంగా రాష్టప్రతి పదవికి ప్రతిభాపాటిల్ తెచ్చినంత మచ్చ మరెవరూ తేలేదుట. సునామీ బాధితులకోసం ఒక కోటీ ఎనభై తొమ్మిది లక్షల నూటైదు రూపాయలు ప్రతిభాపాటిల్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికని వసూలుచేసి ఆ మొత్తం మాత్రం డిపాజిట్ చేయనే లేదుట. అంతెందుకు తన జీతం మూడువందలరెట్లు పెంచుకుని వైస్ ప్రెసిడెంట్ జీతం కూడా పెంచేసిన ఘనతా ఆవిడదే! 260.00 చదరపు గజాల సైనిక వితంతువులకు చెందిన ప్రభుత్వ భూమిని కైవసం చేసుకుని అందులో తనకు ఇల్లు నిర్మించుకున్న ఘనతా ఆవిడదే! అలా నిజంగానే ‘ఆడ పెత్తనం’ అన్నదానికి నిదర్శనంగా తనూ, తన కుటుంబం, తన సుఖమూ తన ఆర్థికాభివృద్ధిని మాత్రమే చూసుకుని నిస్సిగ్గుగా తప్పుడు సలహాలతో వక్రపథం తొక్కిన ప్రతిభ ఆవిడదేననీ అందుకు సోనియాగాంధీకి ఆవిడ విధేయతే హేతువనీ లోకం కోడైకూసింది. ఆవిడ రాష్టప్రతిగా అనామకంగానే పదవీ విరమణానంతరం మిగిలిపోయినా అప్పట్లో ఆవిడ హయాం లో జరిగిన నిర్ణయాలు, అనాలోచిత ఆమోదముద్రలూ నేటికీ దేశాన్ని కుట్టికుడుపుతూనే వున్నాయి’’ అంటూ నుదురు చిట్లించి లేచాడు శంకరం.

4 comments:

హనుమంత రావు said...

తెలియని నిజాలు బాగా తెలియజెప్పారు.. ఒక సమర్థుడైన వ్యక్తిని మరల అధ్యక్షస్థానంలో కూర్చోపెట్టుకోలేకపోయాము. అది మన రాజకీయం.. తన గురించే కాని, తరాలగురించి ఆలోచించని స్వార్థ రాజకీయాలు.. చాలా బాగా వ్రాసారు సుధామగారు.. అభినందనలు, అభివందనాలు.

సుధామ said...

మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు హనుమంతరావు గారూ!

Vanaja Tatineni said...

తెలియని విషయాలు తెలియజేసారు . థాంక్ యూ సర్ !

సుధామ said...

మీ అభినందనలకు కృతజ్ఞతలు వనజ తాతినేని గారూ!