ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, September 18, 2011

సరదాది(గా)వారం.....


చూడు కావాలంటే


'నిజమైన బంధువులు కష్ట కాలంలో మన వెనుకే వుంటారు '
'నమ్మకం ఏమిటి '
'మ్యారేజ్ ఆల్బం తీసి చూడు.వెనకాల బంధువులు కనిపిస్తారు '


***

కారణం

'శృంగారంలో ఆనందంగా మీరు వున్నప్పుడు ఎప్పుడైనా మీ ఆయన ముఖం చూసారా?'అడిగింది డాక్టర్, రమని.
'ఆయన ముఖం చాలా కోపంతో కనిపించింది" అంది రమ.
'ఏం? ఆయనకు షార్ట్ టెంపరా?'
'కాదు. కానీ ఆయన నన్ను కిటికీలోంచి చూసారు కదా!'


***

శుభాకాంక్షలు

విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
ఓ! సారీ! ఈ శుభాకాంక్షలు బ్రహ్మచారులకు మాత్రమే
వివాహితులు దయతో పట్టించుకోకండి


***

ఆమె కథ

'నా జీవితపు ఆనంద క్షణాలు నేను ఓ స్త్రీ ఒడిలో గడిపాను. ఆమె నా భార్య కాదు ' అని ఆగాడు సభలో ఉపన్యాసకుడు.అందరూ ఉత్కంఠతో వింటూండగా...
'ఆమె నా తల్లి ' అన్నాడు.
చప్పట్లు మ్రోగాయి.
సభలో ఇది విన్న కళాకృష్ణ ఇంటికి రెండుపెగ్గులు వేసుకు వెళ్ళి వాళ్ళావిడ ముందు..
' నా జీవితపు గొప్ప ఆనంద క్షణాలు నేను ఓ స్త్రీ ఒడిలో గడిపాను. ఆమె నా భార్య కాదు ' అని ఆగి, గుర్తు రాక
'కానీ ఆమె ఎవరో గుర్తు రావడం లేదు.' అన్నాడు
అంతే! తెలివి వచ్చి చూసేసరికి ఆసుపత్రి బెడ్ మీద వేడి నీళ్ళ కాపడం పెట్టించుకుంటున్నాడు.


***

బహువచనం

టీచర్: మౌస్ కు బహువచనం ఏమిటి
విద్యార్థి: మైస్
టీచర్: బేబీ కి బహువచనం
విద్యార్థి: ట్విన్స్


***

నచ్చింది

'చదువుకునే రోజుల్లో నీకు బాగా నచ్చింది ఎప్పుడు?'
'వేసవి సెలవులు ఇచ్చినప్పుడు '


***

అర్హత

వైట్ హౌస్ సందర్శించిన వెంగళప్ప 'నాకు వచ్చేసారి అమెరికా ప్రెసిడెంట్ కావాలని వుంది ' అన్నాడు పక్క మిత్రుడితో
'నీకేమైనా పిచ్చా ' అడిగాడు మిత్రుడు
'పిచ్చి వుండడం తప్పనిసరి అంటావా ' అడిగాడు వెంగళప్ప.


***

తేడా

బెస్ట్ యాక్టర్లను ఇతర యాక్టర్లు ఎన్నుకుంటే దాన్ని 'ఆస్కార్ ' అంటారు. కానీ ప్రజలు బెస్ట్ యాక్టర్లను ఎన్నుకోవడాన్ని మాత్రం 'ఎన్నికలు' అంటారు.

***

ప్రశ్నలు-సమాధానాలు



ప్రశ్న: నీ చేయి పట్టుకోనా ఆంటే ఆ అమ్మాయి ఏమంది
జవాబు: నో థాంక్స్! అదేం నాకు బరువుగా లేదులే



***

ప్రశ్న: నీతో ఇలా డాన్స్ చేయాలంటే నాకెంతో ఇష్టం అంటే ఆ అబ్బాయి ఏమన్నాడు
జవాబు:ఏం? నీ డాన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని నీకేం లేదా?

***
ప్రశ్న: నీవెప్పుడైనా కాలిపోయే ముద్దు రుచి చూసావా
జవాబు: ఆ! నా బాయ్ ఫ్రెండ్ సిగరెట్టు కాలుస్తున్నాడని చూసుకోకుండా ముద్దాడినప్పుడు



***
ప్రశ్న:ఈ చెవినుంచి విని ఆచెవినుంచి మీ మగవాళ్ళు వదిలేస్తారేం?
జవాబు:రెండు చెవులతో విని మీ ఆడవాళ్ళు నోటితో వదిలేస్తూంటారుగా!


***
ప్రశ్న:క్రికెట్ మ్యాచ్ అయిపోయాక స్టేడియం వేడిగా ఎందుకు వుంటుంది
జవాబు: ఫ్యాన్స్ లేకపోవడం వలన


***

 
 

3 comments:

Prasad Cheruvu said...

"సుధామ"ధురం
"సరదాది(గా)వారం....." ఈ రోజూ కబుర్లు చదువనివారు నోరెడు నవ్వులు నష్టపోయినట్లేనండి!

సుజాత వేల్పూరి said...

సుధామగారూ, మీ యాహో ఐడీ హాక్ అయినట్లుంది. మీ మెయిల్ ఐడీ నుంచి నాకో మెయిల్ వచ్చింది. మీరు లండన్లో ఉన్నారనీ, ఎవడో గన్ చూపెట్టి మీ బాగు పాస్ పోర్టు తో సహా కొట్టేశాడనీ, కష్టాల్లో ఉన్నాను, డబ్బు పంపమనీను!

ఒకసారి చూడండి!

సుధామ said...

అవును సుజాత గారూ! నా యాహూ లో కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ లన్నీ,మెసేజ్ లన్నీ పోయాయి కూడాను.నేను క్షేమంగా ఇండియాలోనే వున్నాను.నా మెయిల్ అడ్రస్ నుంచి ఆ తప్పుడు సందేశం ఎలా వెళ్ళిందో! ఎవరు రిసీవ్ చేసుకున్నా దయచేసి డిలీట్ చేయండి..మీ పలకరింపుకు ధన్యవాదాలు.