ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, September 27, 2011

కుసింత సరదాగా.....




ఇరుకు


"మద్రాస్ లో హోటల్ రూం లన్నీ ఇరుకురా అందుకని రైల్వే స్టేషన్ లోనే పడుకున్నాను"

"అల్లా ఏమీ వుండదే"

"ఏ లాడ్జికి వెళ్ళినా రూం ఇరుక్కు అన్నారు మరి"

"ఇరుక్కు అంటే వుంది అని అర్థంరా వెధవాయ్"

**

డాన్స్


ఒక వినాయక భక్తుడు నీళ్ళలో మునిగిపోతూ 'వినాయకా కాపాడు కాపాడు 'అని అరిచాడు.

వినాయకుడు డప్పులు వాయిస్తూ,డాన్స్ చేస్తూ ప్రత్యక్షమై గెంత సాగాడు.

'అదేమిటి దేవా' అని అడిగితే.. 'నన్ను నిమజ్జనం చేసేటప్పుడు నాకు చేసే పనే నీకూ చేస్తున్నాను తప్పేముంది 'అన్నాడు.


**

దాక్కో


డుంబు స్కూల్ కు రాలేదని టీచర్ చూడడానికి ఇంటికి వచ్చింది.

వాళ్ళ అమ్మమ్మ అది చూసి 'నువ్వు లోపల దాక్కో ! నేను మీ టిచర్ కు ఏమైనా చెప్పి పంపేస్తాలే ' అంది.

'దాక్కోవలసింది నేను కాదు నువ్వే .నువ్వు చచ్చి పోయావని చెప్పే ఇవాళ సెలవు తీసుకున్నాను ' అన్నాడు డుంబు.



**

ఉద్యోగం


'నేను స్కూల్కు వెళ్ళను పప్పా' అన్నాడు విరించి

'ఎందుకు?'

'నేను ఉద్యోగం చేస్తాను'

'యు.కె.జి. చదివిన నువ్వు యు.ఎస్.లో ఏం ఉద్యోగం చేస్తావురా?'

'ఎల్.కె.జి.అమ్మాయిలకు ట్యూషన్ చెబుతాను '



**

సమతులాహారం


'ఎప్పుడూ సమతులాహారం తీసుకోవాలి కన్నయ్యా' విరించికి చెబుతోంది వాళ్ళ జయ అమ్మమ్మ.

'అందుకేగా ఈ చేతిలో రెండూ పిజ్జాలు,ఆ చేతిలో రెండు బర్గర్లు పట్టుకు తింటున్నాను ' అన్నాడు విరించి.



**

కూలీ


సికిందరాబాద్ స్టేషన్ లో రైల్ దిగుతూనే 'కూలీ కావాలా అమ్మా.కూలీ కావాలా అమ్మా' అని వసుమతిని కూలీలు చుట్టుముట్టేసారు.

'మా ఆయన వెనకాల దిగుతున్నాడు లెండయ్యా ' అంది వసుమతి
కూల్ గా.



**


పేరు

'మన్మోహన్ సింగ్ ఆత్మకథ రాస్తే 'త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్ ' అని పేరు పెడతారా. ఏమిటట అవి ' అడిగాడు ఓ ఛోటా నాయకుడు మరో నాయకుడిని.

'2జి.,3.జి,.సోనియాజి ' అన్నాడు అతగాడు.



**


ప్రశ్నలు-సమాధానాలు


ప్రశ్న:లలిత కళ్లను రాజారెడ్డి ఎందుకు నాకుతూవుంటాడు?

జవాబు:ఆమెవి తేనె కళ్ళు

**


ప్రశ్న:పద్మిని డాక్టర్ గారి దగ్గరకు పొద్దున్నే ఎందుకు వెడుతుంది?

జవాబు:ఆమెది మార్నింగ్ సిక్నెస్ మరి.

**



ప్రశ్న:టీ.వి.మీద కనిపించాలంటే ఏంచేయాలి?

జవాబు:టి.వి.ఎక్కి కూర్చోవడమే.

**

ప్రశ్న:మీ నాన్న బాగా ముసలివాడు అని ఎలా చెప్పగలవు?

జవాబు:ఇప్పుడు నేను చరిత్రగా చదువుకుంటున్న సంగతులు ఆయన కరెంట్ అపైర్స్ గా చదువుకున్నాడట మరి.

**


ప్రశ్న:బిడ్డ ఆడో మగో తెలుసుకోవడం ఎలా?

జవాబు: పుట్టగానే చూడడం ద్వారా.



**



3 comments:

జ్యోతిర్మయి said...

'కూసింత సరదాగా'...బావుంది సుధామ గారూ..
'దాక్కో' చాలా బావుంది.

Narasimha murthy said...

nice ones......... good humor jokes

Anonymous said...

chaala baagunnayandi mee jokes...thanks