‘‘ఆంక్షలు వేరు, ఆకాంక్షలు వేరోయ్! అయినా ఆకాంక్షల మీద ఆంక్షలు విధిస్తే,
‘ఆగ్రహం’ కలగడం సహజం. అసలు నన్నడిగితే- నియంత్రణ ఏదయినా, ‘స్వీయ’పై వుండాలి గానీ,
ఎవరిదో స్వీపింగ్ స్టేట్‌మెంటై, ‘స్టేట్’కు ‘మెంటల్’ ఎక్కించకూడదు’’ అన్నాడు
ప్రసాదు.
‘‘ ‘ఆకాంక్ష’లో అసమంజసం వున్నప్పుడు, అది ‘ఆంక్ష’కు ప్రాతిపదిక కావచ్చు. ‘నా ఇష్టం వచ్చినట్లు నేనుంటా’ అనడం సంఘ నియమాల దృష్ట్యా ఒక్కోసారి కుదరదు. ఏమయినా నువ్వన్నట్లు- స్వీయ నియంత్రణ గొప్పదే! కానీ ‘బ్రేక్ ది రూల్స్’అన్న చందాన, విచ్చలవిడితనం పెరిగిపోతూంటే, సంఘ సంక్షేమానికి ఉద్దేశించిన వ్యవస్థలు మిన్నకుంటాయా?’’ అన్నాడు శంకరం.
‘‘మళ్ళీ దేన్ని గురించి నాయనా చర్చ! ఈ ఇరవైనాలుగ్గంటల ఛానెళ్ళ నిరంతర వార్తాస్రవంతులు కాదు గానీ, అత్యల్ప అంశాలు కూడా చర్విత చర్వణాలుగా చెలరేగుతున్నాయి! ‘‘ఇది చర్చనీయాంశమూ,ఇది కాదు’’ అనే విచక్షణ లేకుండా- ఏదిబడితే అది, ఎప్పుడు బడితే అప్పుడు, ఎవరుబడితే వారి చేత- ‘ఎగలాగుడు-దిగబీకుడు’ చందాన, చర్చల పేర ఊదరగొట్టడం ఎక్కువై పోయింది’’ అన్నాడు రాంబాబు.
‘‘ఏది చర్చనీయాంశమని నిర్ణయించేదెవరు రాంబాబూ! ఇంతకీ విషయం ఏమిటంటున్నావు కదూ? వరంగల్ పోలీసులు- అమ్మాయిలు మొహాలకు స్కార్ఫ్‌లు కట్టుకునీ, ముసుగులు వేసుకునీ, చేతులు ఫుల్ గ్లౌజ్‌లతో కప్పుకునీ స్కూటీల మీద వెడుతున్నా, పాదచారులై సంచరిస్తున్నా ఆపి- జరిమానాలు విధించడం, సోదాలు చేయడం చేస్తున్నారట! ముసుగేసుకున్న పడతి ఎవరో స్కూటర్ మీద వెడుతూ, రోడ్డుమీద వెడుతున్న మహిళ మెడలోని గొలుసు చోరీ చేసిందనీ, ‘అసాంఘిక శక్తులు మహిళల్లోనూ వున్నా’యంటూ, అసలు స్త్రీలుఇలా మొహానికీ, నెత్తికీ ముసుగులు వేసుకుని తిరగరాదని, ఆంక్షలు విధించుతున్నారట! అది దారుణం కదూ!’’ అన్నాడు ప్రసాదు.
‘‘కొన్ని మత సంస్థలు ‘బురఖా’ ధరించమని ‘ఫత్వా’ విధిస్తూంటే, పోలీసుశాఖ వరంగల్‌వారు- ముసుగు వేసుకోకూడదని ‘ఫత్వా’లాంటిది విధిస్తున్నారు. ఏమయినా అంటే- అసాంఘిక శక్తులను గుర్తించి శిక్షించడానికి అంటున్నారు. మహిళల ఆభరణాల వంటివి చోరీ కాకుండా కాపాడడానికే అంటున్నారుట’’ అన్నాడు శంకరం.
‘‘అయితే మళ్ళీస్త్రీలవస్తధ్రారణ మీద చర్చకు తలపడినట్లేనన్నమాట! వాళ్లు ఎలాంటి వస్త్రాలు ధరించాలన్నది వాళ్ళ ఇష్టం. ఒక మత సంబంధితస్త్రీలే
కాకుండా, ఇవాళ అమ్మాయిలు, ముఖ్యంగా విద్యార్థినులు- ప్రయాణిస్తున్నప్పుడు మొహాలూ, చేతులూ కప్పుకుని, ముసుగులతో వెడుతున్నారంటే, ఆకతాయిల నుంచీ, యాసిడ్ దాడుల వంటి వాటినుంచీ ‘స్వీయ రక్షణ’కోసమే! రక్షక వ్యవస్థ అయిన పోలీసుల వైఫల్యమే- అమ్మాయిలు వారి జాగ్రత్తలో వారుండడానికి కారణవౌతోంది గానీ, మరొకటి కాదు కదా! ‘పుండొకచోట మందొకచోట’ అన్నట్లు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, తరుణుల వస్తధ్రారణ గురించి ఆంక్షలు విధించడం, డ్రెస్‌కోడ్‌లు విధించడం, అసమంజసం.’’ అన్నాడు రాంబాబు.
‘‘ 'భారతీయ స్త్రీకిచీరే అందం’ అంటారు గానీ, నిజానికి చీరకన్నా, పంజాబీ డ్రెస్‌ల వంటివే ఇవాళ రక్షణ దృష్ట్యాకూడా అందుబాటులో అందేవిగా వుంటున్నాయట! రెచ్చగొట్టే దుస్తులు ధరించడంవల్ల వారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయనడం అబద్ధం. గిరిజన మహిళలు, దళిత స్త్రీలుఅత్యాచారాలకు గురిఅవుతున్న వాళ్లల్లో వున్నారు. వారేం ఉడుపులు ధరించారని? లంగాలు, ఓణీలు, చీరెలు వీటికన్నా- ఇవాళ ‘లో ఉడుపుల’ ఆవశ్యకత పెరిగింది. శరీరానికి బిగుతుగా వుండి ఇబ్బంది కలిగిస్తాయని- బ్రాలు, ప్యాంటీల వంటివి మన దేశంలో కొందరు స్త్రీలుధరించరట. కొందరికి అవేవో విదేశీ దిగుమతి ‘ఫ్యాషన్’అనే భావనా వుంది’’ అన్నాడు ప్రసాదు.
‘‘బ్రా, ప్యాంటీలు ఈ కాలంస్త్రీల కోసంవచ్చిన ఫ్యాషన్లు అనుకోవడం పూర్తి పొరపాటు. ఎప్పుడో 15వ శతాబ్దంలోనే వాటిని వాడినట్లు- సరికొత్తగా ఆస్ట్రియాలోని ఓ పాతకోట తాలూకు భూగర్భపు గదిలో పరిశోధకులకు ఆధారాలు దొరికాయి. నేటి తరం పురుషులు వాడుతున్న ‘షార్ట్’ల వంటి పొట్టి నిక్కర్లు, నేటితరం స్త్రీలువాడుతున్న బ్రాలు, ప్యాంటీల వంటి లోదుస్తులూ మూడువేలు బయటపడ్డాయిట. ఈస్ట్ టైరోల్ నగరంలోని లెంగ్‌బెర్గ్ కోట 1480 నాటిది. దాని పునర్నిర్మాణంలో భాగంగా ఈ దుస్తులు భూగర్భంలోని గదిలో దాచి పెట్టారని, అక్కడి వాతావరణంలోని పొడిదనం కారణంగా ఇప్పటికీ ఆ ‘లోదుస్తులు’ చెక్కుచెదరలేదనీ, పరిశోధకులు ప్రకటించారు. రేడియో కార్బన్ పరీక్షలు చేసి, ఆ ‘లోదుస్తులు’ 15వ శతాబ్దానికి చెందినవని తేల్చారు. దీనినిబట్టి బ్రా, ప్యాంటీలు ఆ కాలంలోనే వాడేవారని నిర్ధారణ అవుతోంది. ప్యాంట్లు, చొక్కాల్లో ఎయిర్ కండిషనింగ్ ఫాన్లుతో అబ్బాయిల కూలింగ్ డ్రెస్‌లూ, అమ్మాయిల ‘బ్రా’లల్లో ‘జెల్‌ప్యాక్’లతో ఉక్కపోత తప్పించుకునే జపనీస్ ఫ్యాషన్లూ- నేటి సరికొత్త ఆవిష్కరణలయితే కావచ్చుగానీ, అసలు ‘లో ఉడుపుల’ ప్రాధాన్యత,వాడకం- పదిహేనవ శతాబ్దంనుండే వుందనీ, ‘బ్రా’వయస్సు ఆరువందల ఏళ్లనీ తేలింది. తమ శరీరాన్ని ఏ దుస్తులతో ఎలా అలంకరించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అన్నది వారివారి ఇష్టమే. మంచి సలహా అని ఇస్తే ఇవ్వచ్చేమో గానీ, తుది నిర్ణయం వారిదే. ఈ అంశంపై ఎగలాగుడు, దిగబీకుడు చర్చలనవసరం’’ అన్నాడు రాంబాబు లేస్తూ.

0 comments:
Post a Comment