ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, June 17, 2012

'పూతరేకులు

నేటి ఆదివారం (17.6.2012)
'ఆంధ్రభూమి' దినపత్రిక
'అక్షర' పేజీ లో
నా జోక్స్ సంకలనం
'పూతరేకులు ' పై
పరిచయం ఇది.



పూతరేకు వంటకమే ఓ అద్భుతం. దాని సృజన చాలా కష్టం. బియ్యం రుబ్బి, వేడి వేడి కుండపై పలుచని రేకుగా మార్చి, ఆపై దానికి కమ్మని నెయ్యి, చక్కని చక్కెర చేర్చి, చిన్ని చిన్ని మడతలుగా మార్చిన వైనం భలే చిత్రాతిచిత్రం. అంతా అయ్యాక నాలికపై అది మిగిల్చే రుచి మరీ చిత్రం. సుధామ జోకులూ అచ్చంగా అంతే. చిన్న చిన్న జోకులు కలిపి, వాటికి మరింత రుచి జోడించి, మాంచి నవ్య నవ్వాహారంగా మార్చి, మనకు అందించడం వెనకు శ్రమ చాలానే వుంది. ఒక్క జోకులు పాతిక పేజీల పుస్తకం నిండా పరిచేస్తే, అది పూతరేకులు ఎందుకవుతుంది. కాదు కాక కాదు. ఎస్‌ఎమ్‌ఎస్ జోకులు, తెలుగింగ్లీష్ ఇంట్ర‘ట్విస్టింగ్’లు, ఇలా పేజీల నిండా రకరకాలుగా మెనూ పరుచుకుంటుంది. పుస్తకం ముందుంచుకున్నవారి కళ్లకు అరుచి వుండదు. అన్నట్లు మచ్చుకో ముక్క..‘వెంగళప్ప కలర్ టీవీ కొని తెచ్చాడు ఇంటికి. తేగానే నీళ్లలో ముంచి తీసాడు. ఎందుకలా? అని అడిగితే, రంగు వుంటుందో, వెలుస్తుందో చూద్దామని’ బదులిచ్చాడు. ఇది కొరికాక, మిగిలినవన్నీ నోట పెట్టుకోక ఆగుతారా?


1 comments:

మాగంటి వంశీ మోహన్ said...

సుధామగారు - నేనేం చేయగలను

http://janatenugu.blogspot.com/2012/06/blog-post_21.html

:)