ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, September 4, 2011

ఆదివారం సరదాగా...

సలహా


ఓ ఫిలాసఫర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ
‘‘మీ భార్య మాట ఎప్పుడూ వినండి నూరుశాతం రెచ్చిపోగల సలహా తను మీకిస్తుంది’’ అన్నాడు.
సభికుల్లోంచి ఒకాయన ‘‘ఆ నూరు శాతం కొంచెం వివరించగలరా’’ అని అడిగాడు.
‘‘తొంభై తొమ్మిది శాతం రెచ్చిపోవడం ఒక శాతం సలహా’’ అన్నాడు ఫిలాసఫర్.


బాంబు

ఓ ఉగ్రవాది లక్ష్మి ఇంట్లో బాంబు పెట్టాడు.చుట్టుపక్కల జనం అది గమనించి ‘‘లక్ష్మీ బాంబు! లక్ష్మీ బాంబు!’’ అంటూ అరిచారు.‘‘అబ్బే! నేను వయసులో వున్నప్పుడు బాంబునే నర్రా! ఇప్పుడదేం కాదు ఒట్టి కాకరపువ్వొత్తునే’’ అంది లక్ష్మి.


తండ్రి

ముంబయ్‌లో ఇద్దరు స్కూలు అమ్మాయిలు మాటాడుకుంటున్నారు.
మొదటి అమ్మాయి: ఏమిటి ఇవాళ అంతా ‘డల్’గా వున్నావ్
రెండో అమ్మాయి: మా అమ్మ మళ్లీ పెళ్లిచేసుకుంటోంది
మొదటి అమ్మాయి: అయితే ఏం? కొత్త బంధమా, కొత్త తండ్రా ఏమిటి నీ భయం
రెండో అమ్మాయి: కొత్తతండ్రి
అతనుప్రముఖసినిమాహీరో నన్నెలాచూస్తాడోనని నా భయం.
రెండో అమ్మాయి: ఇంతకీ ఎవరతను
మొదటి అమ్మాయి: సల్మాన్‌ఖాన్
రెండో అమ్మాయి: అతనా! చాలా మంచివాడు! ఏం కంగారు పడకు
మొదటి అమ్మాయి: నీకెలా తెలుసు
రెండో అమ్మాయి: క్రిందటి నెల అతనే నా తండ్రిగా వుండేవాడుగా.


వంటవాడు

"వంటవాడు కావాలని ఓ హోటల్‌వారు ప్రకటన ఇచ్చారు. ఓ వంటతను ఇలా అప్లికేషన్ పంపాడు. ‘‘అయ్యా! నేనేదయినా వండగలను. నేను బాగా ‘ఉడికించగలను’. ‘వేపుకు తినే’వాటిలో కూడా నాది అందెవేసిన చెయ్యి. నేను ఇంతకుముందు చేసిన హోటల్లో బాగా ఉడికించడం, వేగించడం చేసాను. కావలస్తే వాళ్లని అడగవచ్చు.’’

చిలిపి ఊహలు

* ఈ జనం వట్టి వెర్రివాళ్లు. పెద్ద పెద్ద అంతస్థుల భవనాలపైకి వెళ్లడం ఎందుకు. అక్కడనుంచి నేలమీదకు చూడడానికి డబ్బులిచ్చి మరీ బైనాక్యులర్స్‌లో వాటిల్లో చూడడమెందుకో!


* కార్న్ ఆయిల్ కార్న్ నుంచి, వెజిటబుల్ ఆయిల్ వెజిటబుల్‌నుంచి తీసిందంటే మరి బేబీ ఆయిల్?


* నీటి అడుగున ఏడవడం కుదురుతుందా?


* ‘వాడి రోగం కుదురుస్తా చూడు’ అనడం కూడా ఓ రోగమేగా!


* సినిమాలో’ కనిపించానంటారు, మరి బుల్లితెర ‘మీద’ కనిపించానంటారు గానీ- బుల్లితెర ‘లో’కనబడ్డాననరెందుకని?


* చంద్రుడి మీద మనిషి పాదముద్రలు పడ్డాక కూడా, ‘ఆకాశమే నీ హద్దురా’ అనడం ఎందుకు?


* ‘అవతార్’ అంటే భగవంతుడు దాల్చేది కానీ, మరాఠీ భాషలో ‘అవతార్’ అంటే విచిత్ర వేషధారణ అని అర్థం.


ప్రశ్నలు-జవాబులు

ప్రశ్న: చేప వాసన పోవడానికి ఏంచేయాలి
జవాబు: దాని ముక్కు కోసేయడమే
**
ప్రశ్న: డిప్పలేని తాబేలంటే
జవాబు:నగ్నంగా వుందని కాదు.పాపం! ఇల్లు లేనిదని
**
ప్రశ్న:మారు కనబడని రాకుమారుడిని మంత్రి గారు ఏమన్నారు
జవాబు: 'రాకుడు ' అన్నారు
**
ప్రశ్న:పాపానికీ, సిగ్గుచేటుకీ తేడా ఏమిటి
జవాబు: ఒక దాన్ని తగులుకోవడం పాపం.తొలగి పోవడం సిగ్గుచేటు
**
ప్రశ్న: స్వర్గంలో బట్టలు వేసుకోవలసిన అవసరం వుండదని నీకెలా తెలుసు
జవాబు: ఇక్కడ శరీరాన్ని దహనం చేసాకనే కదా అక్కడికి వెళ్ళేది.శరీరం లేనిదే బట్టలెందుకు
**
ప్రశ్న: మా మామయ్య ఇవాళ కోర్టులో 'హియరింగ్ ' వుందని వెడుతున్నాడు
జవాబు: మీ మామయ్యకు చెముడన్నావు కదా!'హియరింగ్ ' అంటావేమిటి.
**

0 comments: