ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, April 4, 2015

ఆర్థికం లో కొత్త ' దేవుడు '




నా వారం వారం కాలం 
'' సుధామ ' యోక్తి '
మన తెలంగాణా  దినపత్రిక లో...
4 ఏప్రెల్  '2015 శనివారం 
సంచికలోని రచన 




2 comments:

ఉప్పమ్మా ఉప్పో ! said...

రజాకారులు రెచ్చిపోయిన రోజుల్లో మా నాన్నగారూ బిక్కు బిక్కుమంటూ బైట తిరిగేవాళ్ళమని చెబుతూండేవారు. ఓసారి మా అమ్మా నాన్నా రిక్షాలో వెడుతూంటే దుండగులు కత్తులూ కటార్లూ పైకెత్తారుట. బీవీ మియా ఖతం అయిపోవాల్సిందే!...కానీ ఒక రక్తపు బొట్టు మిగిలి ఉన్న ఓ పాషాణ హృదయయం....'చోడ్ దో...పెహ్చాన్ కే హై'' అనగానే ఇద్దరూ బతికిపోయారట. లేకపోతే నేను, ఈనాటికీ దెయ్యాలను సైతం దేవుళ్ళను చేస్తున్న కుత్సిత రాజకీయ వైనాన్ని తిలకించేవాణ్ణి కాదేమో! తమ వంటి ఉత్తమ కవులు యుగ యుగాలకీ కవులుగానే మిగిలిపోతున్నారూ...అయినా వెలుగు చూపిస్తూనే ఉన్నారూ...ఆ వెలుగులో కొత్త యుగాల మార్గదర్శకులూ అవుతున్నారు. కాకపోతే ఈ వెలుగులో సామాన్యులూ సాహితీ పురుషులూ మాత్రమే పయనించగలరు కాబట్టి వారే తమ బాటలను రక్తపుటేరులుగా మలచి, ఈదుకుంటూ గమ్యానికి చేరి, రాబోయే నవ తరాల కోసం ఆ రక్తపుటేరులను మళ్ళీ వెలుగు బాటగా మలచి తరలిపోతున్నారు. అందులో సామాన్యులు కాలు పెట్టే లోపే...ఆ సామాన్యుల్లోనే దేవుడిగా హారతులందుకుంటున్న ఓ దేవుడు ఉన్నఫళంగా దెయ్యమై పట్టి పీడించేస్తున్నాడు.
దేవుళ్ళూ! మీరు దెయ్యాలుగా మారకుండా ఉండాలీ అంటే... మీకు భాష వస్తే....మీరు బధిరులు కాకపోతే... ఎప్పటికీ సామాన్యుల్లో ఒకరిగా ఉంటున్న కవుల ఘోషను అప్పుడప్పుడూ ఆలకించండి. మీరు దేవుళ్ళుగానే మిగిలిపోతారు. అనునిత్యం సామాన్యులు మీకు హృదయపూర్వకంగా హారతులందిస్తారు.
ఓ మంచి కవిగానూ...ఓ ఉత్తమ ఉపాధ్యాయునిగానూ మాత్రమే కాక, అతిశయూక్తి కాకపోతే...అమ్మ ఆముదం త్రాగించి వెంటనే నోట్లో బెల్లం పెట్టినంత వాత్సల్యభరితంగా ఉంది...చదువుతూంటే.
మా సుధామగారికి ధన్యవాదములతో..
నిత్య సామాన్యుడు
అత్తిలి అనంతు.

సుధామ said...

మీ ప్రతి స్పందనకు చాలా ఆనందించాను అనంతూ!
ధన్యవాదాలు