ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, September 8, 2011

చీకట్ల దీపం.

వచ్చిన చిక్కే అది
ఎంత అస్పష్టమవుదామని వున్నా
డాబాపై ఆరబోసిన
మాగాయ ముక్కలను
కాకి ముక్కున కరుచుకు
ఎగిరిపోయేటంత సులభంగా
పహరా కూడా లేదు కదా
నా తీరే అంతవొలిచేసిన ఉల్లి పొరల్లా
తీసేసిన గింజ పొట్టులా
అంతా పరుచుకున్నదేస్వప్నఖచిత సింహాసనాలేమీ లేవు
అధికారాలూ లేవు
అభిశంసనలూ లేవు
దుర్వినియోగం చేసేందుకు
దుఃఖపడనా
ఒక గాలి తరగ తాకితే చాలు
ఉఫ్ అని ఎగిరిపోయేటందుకునిజమేగా
ఎవరైనా ఎందుకు అనుసరిస్తారు
ఒక తపన కావాలి
ఒక అన్వేషణ కావాలి
తెలుసుకోవాలనే ఒక ఆతృత పంచాలి
కామోసు కామోసు
ఏమీ లేదే నా దగ్గర
గుప్పిట మూసిన రహస్యం ఒకటి పట్టుకుని
చుట్టూ తిప్పించుకుందామంటే
ఎందుకింత బహిరంగం


నాకు నేను రహస్యం ఎలాగూ అయినప్పుడు
నాకు తెలిసినమేరకు
ఎదుటివారికి అర్థం కావాలనే
ఇంత వెసులుబాటునిచ్చి
వెర్రి వెధవనవుతున్నాని తెలుసు
అయితేనేం
మార్మికత కృత్రిమత కదా
పోనీలే
ఈ లోకం ఒక పసిపాప
పరీక్షలు నేను రాస్తాను గానీ
దానికెందుకు పెట్టడం
కాపీ కొడుతూ పట్టుబడే
కాఠిన్యం వద్దు


ఇంక ముగించు
సంపూర్ణంలో
వెల్లకితలా పడిన చివరి శరీరమే
రహస్యం ఎక్కడ
అసలు నిజం తెలిసాక
అంతా విడిన రహస్యమే
ఆ కాడికి ఎందుకింత పజిలింగ్ పజిల్
అడ్డం నిలువు గళ్ళ ఆధారాలతో
ఒక పదబంధ ప్రహేళీక మాత్రమే
కనుక్కో
కనుక్కుని ఆనందించుఇంతకీ రహస్యం కాదు ముందున్నది
ఒక ప్రహేళిక
ఒక క్రీడ
వచ్చిన చిక్కు విప్పిన చిక్కే ఇది
సమాధానం తెలిసేంత వరకూ మాత్రమే
మాగాయి మా కాయం
కాకి పరమాత్మం
పొరలపొరల పొడలపొడల జీవితం
మలిగిన దీపంలో వెలుగు తెలిసాక

వెలగడం లో
అంతా వెసులుబాటే!


2 comments:

Vijayagopal said...

That is a real poem!
I was waiting for something like this!
You are a serious poet!
I want you to continue to be one!

సుధామ said...

Tahnk you gopalam garu for your encouragement.Thanks a lot