ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, July 24, 2011

ఆదివారం సరదాగా కాసేపు....


ప్రశ్న


రామం ఇంటర్వ్యూకి వెళ్లాడు.
ఇంటర్వ్యూ చేసే అధికారి ‘‘నిన్ను పది సులభమైన ప్రశ్నలు అడగమంటావా? ఒక కష్టమైన ప్రశ్న వేయమంటావా నిర్ణయించుకు చెప్పు’’ అన్నాడు.
రామం ఆలోచించి ‘‘ఒక కష్టమైన ప్రశే్న అడగండి’’ అన్నాడు.
అధికారి’’ ఓకే! గుడ్‌లక్ మాకు నీ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పావ్! ఇప్పుడు చెప్పు పగలు ముందా? రాత్రి ముందా’’అని అడిగాడు.
రామం కాసేపు ఖంగుతిని ఆ ప్రశ్నకిచ్చే సమాధానంబట్టే తన ఎంపిక వుంటుందని తెలిసి కాసేపు ఆలోచించి ‘‘పగలే ముందు సార్!’’ అని జవాబిచ్చాడు.
‘‘అదెలాగ?’’ అడిగాడు అధికారి.
‘‘సారీ సారీ! మీరు నన్ను మరో క్లిష్టమైన ప్రశ్న వేయనని ముందే మాటిచ్చారు’’ అన్నాడు రామం.
అంతే! సెలక్టయిపోయాడు.

***


ఏముంది

క్లాసులో సుమిర ‘చూయింగ్ గమ్’ నములుతోంది.
టీచర్ అది గమనించి ‘‘ఏయ్ సుమిరా! నీ నోట్లో ఏముంది’’ అని అడిగింది.
‘‘నాలుక టీచర్!’’ అని సుమిర సమాధానం.

***

అనుభూతి

‘‘ప్రతి అయిదుగురిలో నలుగురు డయేరియాతో బాధపడతారు తెలుసా?’’ అంది డాక్టర్ రాజ్యలక్ష్మి విజయలక్ష్మితో. ‘‘అంటే అయిదోవారు దాంతో ఆనందిస్తారా?’’ అడిగింది విజయలక్ష్మి.

***

సరదా

‘‘ఇంత చక్కగా వుంటావ్! మరి పెళ్లెందుకు చేసుకోవు’’ అడిగాడు కళాకృష్ణని సాయి.
‘‘్భలేవాడివే! అమ్మాయిలతో డేటింగ్ చేసే సరదా ఎల్లప్పుడూ తీర్చుకునే అవకాశాన్ని వదులుకోమంటావా ఏమిటి?’’అని కళాకృష్ణ సమాధానం.

***

కనుగొన్నది

భూగోళం తరగతిలో టీచర్ ప్రపంచపటం గోడకు తగిలించి విరించిని లెమ్మని చెప్పి- ‘‘అమెరికా ఎక్కడ వుందో గుర్తించు’’అని అడిగింది.
విరించి పటంలో అమెరికాని గుర్తించి చూపించాడు.
‘‘వెరీ గుడ్! సుమిరా ఇప్పుడు నువ్వు చెప్పు? అమెరికాని కనుగొన్నదెవరు’’ అడిగింది టీచర్.
‘‘విరించి మేడమ్!’’ సుమిర సమాధానం.

***

పొడుగు పదం

‘‘ఇంగ్లీషులో పొడుగాటి పదం ఏమిటి’’ అడిగింది టీచర్.
‘‘స్మైల్స్ (SMILES) ’’ అని జవాబిచ్చింది ప్రతీతి.
‘‘అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగింది టీచర్.
‘‘మొదటి అక్షరానికి చివరి అక్షరానికి మధ్య ఒక మైలు వుంది కదా!’’ (SMILES)

***

తిండి

‘హ్యూమాన్‌టేరియన్స్’ అంటాం కదా! ‘వెజిటేరియన్స్’ వెజిటబుల్స్ తినేట్లయితే మరి ‘హ్యుమాన్‌టేరియన్స్’ తినేదేమిటి?
హ్యూమన్ ‘ఐ’స్ (HUMANITARIANS)

***

మార్గం

‘‘దుఃఖంలో మునిగిపోకుండా
వుండాలంటే ఎలా?’’
‘‘ఏముంది? ఈత కొట్టడమే?’’

***




ప్రశ్నలు- జవాబులు


ప్రశ్న: ఎప్పుడూ నవ్వని ఆ హిందీ పిల్ల పేరేమిటి
జవాబు: ‘హసీ’నా!

***

ప్రశ్న: చక్రం కనిపెట్టడంతో జరిగిందేమిటి
జవాబు: నాగరికత తిరిగింది

***

ప్రశ్న: టి అక్షరంతో మొదలయ్యే వారంలోని రెండు రోజులు చెప్పు
జవాబు: టుడే అండ్ టుమారో

* * *

ప్రశ్న: అయిదు అంకెను ఇరవై అయిదు నుంచి ఎన్నిసార్లు తీసివేత చేయగలం
జవాబు: ఒక్కసారే! ఒకసారి అయిదు తీసాక ఇంక అది 25 కాదు కదా!

* * *

ప్రశ్న: కారులో బద్ధకమైన భాగం ఏమిటి
జవాబు: చక్రాలు. ఎందుకంటే అవెప్పుడూ ‘టైర్‌డ్’!

***

ప్రశ్న: చచ్చిపోయినప్పుడు రాబందు పీక్కు తినని శవం ఏమిటి
జవాబు: రాబందుదే.

***