‘‘ఓ ఇతివృత్తంకోసం ఎక్కువ సమయం ఆలోచించవలసిన అవసరం నాకు ఎప్పుడూ ఏర్పడలేదు అనగలిగిన కళాకారుడే గొప్ప సృజనకారుడు. తన చుట్టూ ప్రకృతితో, పరిసరాలతో మమేకమై తన కళకు అటువంటి నిరంతర స్ఫూర్తి పొందగలగడం, ఆ స్ఫూర్తితో కీర్తనార్జించి రాణించగలగడం నిజంగా గొప్ప విషయం. తన ఇంటి గడపనుండే ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి అద్భుత చిత్రకారుడు కాపురాజయ్య’’ అన్నాడు శంకరం సభక్తికంగా.
‘‘ఔను శంకరం! ఆయన వ్యక్తిత్వంలోని గొప్పదనం అది. సౌజన్యం, ఆదరణ, ప్రేమ మూర్త్భీవించిన నిరాడంబరుడు ఆయన. వేషభాషల గురించిన మోజయిన వెంపర్లాట ఆయనకు ఎప్పుడూ లేదు. ఎన్ని ఏళ్ళయినా ఎంత పేరు ప్రతిష్ఠలార్జించినా తన ఊరు సిద్ధిపేటలో సైకిల్ మీదే ప్రయాణం చేసేవాడు. పుష్కరం క్రితం కవి శ్రీ రామగిరి శివకుమారశర్మ సింగిడి పుస్తకావిష్కరణకు సిద్ధిపేటకు గౌరవ అతిథిగా వెళ్ళినపుడు పారుపల్లి వీధిలోని రాజయ్యగారింటికి వెళ్ళి ఆయనను స్వయంగా కలిసి కొన్ని గంటలు గడిపిన జ్ఞాపకం ఇంకా తాజాగా వుంది నాలో. తన చిత్రాలన్నీ చూపించి రెండుమూడు ప్రింట్లు నాకు స్వయంగా ఆయన ఇచ్చారు కూడాను. ఆరోజు సభలోనూ జ్ఞాపికగా రాజయ్యగారి ‘బతకమ్మ’ చిత్రం అందుకున్నాను. ఇప్పటికీ హాల్లో నా గది గోడమీద వున్న సంప్రదాయ చిత్రాల ఫ్రేమ్‌లు రెండూ ఆయనవే. బతకమ్మ ఒకటి, ‘గృహిణి’ మరొకటి’’ అన్నాను నేను.
‘‘రాజయ్యగారిది ప్రధానంగా ట్రెడిషనల్ ఆర్టే! అసలు ఆయన వుండే వీధియే కళాకారుల వీధి. పలు కులాల కూటమి ఆయన బొమ్మల్లో రాజరికాలు, రాణీవాసాలు కాదు సామాన్య జనజీవనం కనబడుతుంది. తెలంగాణ అచ్చమైన తెలుగుతనం, పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టూ ఆయన కుంచెలో కాన్వాస్ మీద ప్రాణంపోసుకుని సజీవంగా సాక్షాత్కరిస్తాయి. 1950ల్లోనే ఇలస్ట్రేటెడ్ వీక్లీ నాటి సంపాదకుడు ఎ.ఎస్.రామన్ రాజయ్య చిత్రాలను ముద్రించడమే కాదు లండన్ పత్రిక ‘స్టూడియో’లో రాజయ్య మీద వ్యాసం వ్రాసారు. రాజయ్యది చిత్రకళలో అచ్చమైన జానపద ఆత్మ. తెలంగాణ గ్రామసీమలకు తన బొమ్మలతో అంతర్జాతీయ విలువను తెచ్చిపెట్టిన అద్భుత చిత్రకారుడాయన’’ అన్నాడు రాంబాబు.
‘‘రాజయ్య అంటేనే రంగులు. రాజయ్య అంటేనే తెలంగాణా బతుకులు అన్నాడో కవి. అది వాస్తవమర్రా! ఆయన సాంప్రదాయికమైన చిత్రాలే వేస్తారన్నది వాస్తవమయినా తరువాత నకాషీ చిత్రకారుల శైలిని కూడా స్వీకరించి టెంపరా రంగులు వాడడం, తైలవర్ణ చిత్రాలు గీయడం కూడా చేసారు. మనదేశంలోనే కాదు లండన్, మెక్సికో, చెకొస్లవేకియా, హంగేరీ, రుమేనియా, బల్గేరియా, ఆస్ట్రేలియా, క్యూబాలలో కూడా ఆయన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. జానపద, గ్రామీణ సంప్రదాయాలను చిత్రకళలో అద్భుతంగా ప్రవేశపెట్టిన చిత్రకారునిగా ఆయన ఖ్యాతి ఎనలేనిది. 1966లో రాజయ్యగారికి సన్మానం జరిగినప్పుడు ఇటీవలే అస్తమించిన తెలంగాణపు మరో ప్రముఖ చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావుగారు రాసిన వ్యాసంలో అన్నట్లు ‘‘పల్లెలోని జీవితానికి అలవాటుపడి ఆ జీవితంలోని రస మాధుర్యాన్ని తనివితీరా గ్రోలి చిత్రాలలో నింపి తెట్టెలుగట్టినాడు’’ రాజయ్య. వారిద్దరూ కూడా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో ఇంచుమించు రెండేళ్ళ తేడాతో డిప్లమో తీసుకున్నవారే. కాపురాజయ్య ఓవైపు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో కార్యనిర్వాహక సభ్యునిగా, మరోవైపు నాటి ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీకి ప్రభుత్వం ఎన్నుకున్న సభ్యునిగా పనిచేసారంటే ఆయన కళాప్రతిభే దానికి కారణం. దుక్కి, బక్కలు, బోనాలు, బోరుూలు, జాతర్లు రంగులరాట్నాలు, తాళ్లు, ఈతలు, కోతులు, కోడిపందేలు, నూతులు, కుంటలు, చెరువులు, చిన్నచిన్న గుళ్ళు, చిల్లరదేవతలు, గోపురాలు, పూరిగుడిసెలు, పెంకుటిళ్లు పగటి వేషగాళ్ళు, భాగవతులు, వీధి నాటకాలు, పురాణ కాలక్షేపాలు, రామాయణ భారత కథలు ఇలా ఒకటేమిటి ఆయన చిత్రాల ఇతివృత్తాలు కోకొల్లలు. అయితే అవి ఏవీ నేల విడిచి సాముచేసేవి కావు. మోడ్రన్ ఆర్ట్ పేర మార్మికతకు, అయోమయానికీ తావిచ్చే వాటి జోలి ఆయన తరహాకానే కాదు. హరికథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, వీధి భాగవతాలు ఆయనను బాగా ఆకట్టుకున్న అంశాలు. స్వయంగా రంగస్థలం మీద నటించినవాడూ. కుంచెతోబాటు కలమూ పట్టినవాడే’’ అన్నాడు శంకరం మళ్లీ ఆయన బహుముఖీనత్వాన్ని తలచుకుంటూ.
‘‘ఆయనకు యాభైకి పైగా అవార్డులు లభించాయి. హైదరాబాద్ జె.ఎన్.టి.యు ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1966లోనే రాష్ట్ర ప్రభుత్వం ‘రజతపత్ర’ సన్మానం చేసింది. ‘చిత్రకళాప్రపూర్ణ’ బిరుదు కూడా వారికి లభించింది. జాతీయ పురస్కారం పొందిన ఆయన వేసిన ‘రిస్కీలైఫ్’అనే చిత్రం రష్యా పార్లమెంట్లో కూడా ప్రదర్శించారు. రాజయ్య ‘బోనాలు’ చిత్రానికి అంతర్జాతీయ ఖ్యాతి వుంది. 1945లోనే లండన్‌లో ఓ మాగజైన్ దానిని ముఖ చిత్రంగా ప్రచురించింది. సిద్ధిపేటలోనే వుండి లలిత కళాసమితి పేరుతో ఒక శిక్షణా సంస్థను ఏర్పాటుచేసి వందలాది యువచిత్రకారులకు శిక్షణ ఇచ్చిన ధన్యగురువు ఆయన. ఎనభై ఏడేళ్ల జీవిత ప్రయాణంలో పదవ ఏటనే కుంచె పట్టి ఆమరణాంతం అవిశ్రాంత అద్భుత కృషి సాగించిన చిత్రకారుడాయన. స్వల్పవ్యవధిలోనే తెలంగాణ కొండపల్లి శేషగిరిరావు, కాపురాజయ్యగారలిద్దరినీ కోల్పోవడం నిజంగా తీరని కళావిషాదం. ఆ అద్భుత చిత్రకారుల బొమ్మలకు ఏనాటికీ మరణం లేదు. కాపు రాజయ్యగారి స్మృతికి ఒక శాశ్వతత్వాన్ని ఏ రకంగానయినా ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది’’ అన్నాడు రాంబాబు అంజలి ఘటిస్తూ.

14 comments:
శ్రీ రాజయ్యగారి గురించి బొమ్మలతో పరిచయం చెసినందుకు ధన్యవాదాలు సుధామ గారు. ఆయన చిత్రాలతో పుస్తకాలేమైనా వెలువడ్డాయా?
బాగా చెప్పారు అయితే నాకొక చిన్న సందేహం. చిత్రకళకు భాష ఉంటుందా?
రాజయ్య గారి చిత్రాలలో ఎక్కడ చూసినా తెలంగాణా కనిపిస్తుంది కాబట్టి "తెలుగుతనానికి కాపు" అనే బదులు "తెలంగాణాకు అద్దం కాపు" అనే శీర్షిక పెడితే బాగుండేది.
కళకు సంకుచితమయిన గోడలు వద్దంటారా? భాష కూడా ఒక గోడే మరి.
జైగో మళ్ళీ తెలబాన్ గోకుడు షురూ చేసినవ్? జిల్లాలకు, వూర్లకూ, ఇండ్లకూ గోడలు వుంటయ్. 'సిద్ధిపేట కాపు' అనుకో.. ఎవలొద్దంటర్? మీకు ఏది సమ్మగా వుంటే గదే! సెత్..
రేడియోలో 'ఈవారం పాట' లాగా 'ఈవారం సంకేతాలు' గేమనా వచ్చిండా? గోసాచారి గమ్మునుండాడు?!... :P :))
/చిత్రాలలో ఎక్కడ చూసినా తెలంగాణా కనిపిస్తుంది /
అది చూసే కళ్ళని బట్టి అట్లుంటుంది, జైగో. పచ్చకామెర్లోళ్ళకి ...అంటారే, గట్లన్న మాట, సమజ్ చేస్కోవాల :))
కొంతమందిని చంద్రుని మీదకు పంపినా, ఆడినుంచి భూమ్మీద తెలంగాన, సమ్మక్క-సారక్క, బతుకమ్మలే చూస్తారు, ఇంకేవీ అగుపించవ్. :)
SNKR,
ఆ మధ్య నాగార్జునసాగర్ దగ్గర గోడగట్టనీకి ప్రయత్నించిన్రు.. అందుకని జైగో అట్టా అనుకోబట్టిండు.. లైట్ తీస్కో..
@SNKR, @satya:
అయ్యా, మీరు టపా మొత్తం చదివితే మీకే అర్ధం అవుతుంది.
జైగో,
మీ గులాబిరంగు కళ్ళజోడు ఓ సారి ఇలా ఇస్తారా? మళ్ళీ ఓ సారి దుర్భిణీ వేసి టపాలో కోడిగుడ్డుపై ఈకల కోసం దేవులాడతం.
SNKR, మీ కళ్ళకు ఈ కింది వాక్యాలు (a few examples) కనిపించలేదా?
"ఆరోజు సభలోనూ జ్ఞాపికగా రాజయ్యగారి ‘బతకమ్మ’ చిత్రం అందుకున్నాను"
"తెలంగాణ గ్రామసీమలకు తన బొమ్మలతో అంతర్జాతీయ విలువను తెచ్చిపెట్టిన అద్భుత చిత్రకారుడాయన"
"రాజయ్య అంటేనే తెలంగాణా బతుకులు అన్నాడో కవి"
"రాజయ్య ‘బోనాలు’ చిత్రానికి అంతర్జాతీయ ఖ్యాతి వుంది"
మీ వ్యాసం చాలా బావుంది సుధామ గారు !
రాజయ్య గారి శైలి, ఆయన వాడే రంగులూ , ఎన్నుకునే వస్తువూ అన్నీ మనసుకూ , కళ్ళకూ చల్లగా తోస్తూనే స్తబ్దత పై కురిసే చైతన్యపు వానలా అనిపిస్తాయి ! వీక్షకులపై ఆయన తన చిత్రాల ద్వారా ' కలర్ థెరపీ' ప్రయోగిస్తున్నట్టనిపించేది నాకెపుడూ !
JaigO 24 August 2012 15:26
అది చూశాను, కాని ఇది చూశాక కాని 'సంకుచితంగా ' ఎలా చూస్తారో అర్థమయ్యింది. తెలంగాణ, ప్రస్తుత ఆంధ్ర(ప్రదేష్)లో అంతర్భాగం అని మా నమ్మిక, వాస్తవం కూడా.
/"తెలంగాణాకు అద్దం కాపు" అనే శీర్షిక పెడితే బాగుండేది./
ఇదీ ఓకే.
/కళకు సంకుచితమయిన గోడలు వద్దంటారా? భాష కూడా ఒక గోడే మరి./
ఇది జైగో ఇద్ది, సంకుచితమని అంతరాత్మ ఘోషిస్తున్నా ఆ పైమాట అనడం! పైగా 'అంటారా?' అని రచయితకు అంటగట్టిన కుళ్ళు బుద్ధి, నాట్ ఓకే. కలసుండిన కాపురాల్లో గోడలు కట్టే కుళ్ళు రాజకీయ మేస్త్రీలు ఏమాత్రం తక్కువలేని కాలం.
@SNKR:
తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగమే, అయితే శీర్షిక "ఆంధ్రప్రదేశ్ కు అడ్డం కాపు" కాదు.
కళకు ప్రాంతం, భాష లేదా దేశం వంటివి ఆపాదించడం తప్పు కాదనేదే నా అభిమతం. అయితే కొందరు ప్రాంతం గోడనీ, భాష కాదనీ చెప్పే వాదన సబబు కాదు.
ఓహోహో గట్లంటవ?
సమజయ్యింది ... గోడ అంటే గుర్రం గిట్లనుకుని పరేషాన్ అయ్యిన్రా? హీ హీ కాదు, బిల్కుల్ కాదు. ;)
Ee jai gottimukkala ki mind undaa asalu. mothata Kalaki Bhashaa bhedaalu untaayaaa ani deergham theestunae raajayya gaarini telangaanaa ku maatramae parimitham cheyyaalani vaaaagaadu.chivarlo mallaa oka chetta maata. Godalu kattatam tappu kaaaakpotae telangaanaa lonae moodu jilla lunnayi. Nee jillaaaki nuvvooo, migathaa rendu jillaalu vaallaki vaalu godalu katttukunate yelaaa vuntundo , adi koodaa sababae antaaavaa jai. Daanni koodaa nuvvu samardhisthae maemauntha neeto tealangaanaa ni vidagotti ichcheyyaataanni sapport chaesthaaamu. Godalu kattatam correct ayitae daanni chaaala gattigaa cheyyatam best

Post a Comment