ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, February 6, 2012

వెంగళప్ప Jokes


వెంగళప్ప మాటిమాటికీ వంటింట్లోకి వెళ్ళి పంచదార డబ్బా తీసి మళ్ళీ మూతవేసి వస్తున్నాడు.వాళ్ళావిడ ఆయన చేస్తున్న పని చూసి" మీకేమైనా పిచ్చా ఎందుకలా చేస్తున్నారు"అని అడిగింది.'డాక్టర్ గారు షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేయమన్నారు తెలుసా" అన్నాడు వెంగళప్ప

***

వెంగళప్ప చెట్టెక్కడం చూసి దాని మీద ఉన్న కోతి 'ఎందుకు ఈ చెట్టెక్కావు? 'అని అడిగింది.'యాపిల్ పండు తిందామని ' అన్నాడు వెంగళప్ప.'కానీ ఇది మామిడిచెట్టు ' అంది కోతి.'నేను యాపిల్ పండు నాతో తెచ్చుకున్నానుగా!' అన్నాడు వెంగళప్ప.

***


ముగ్గురు సర్దార్జీలు స్కూటర్ మీద వెడుతున్నారు.పోలీసు అది చూసి చేయి అడ్డం గా పెట్టాడు ఆపమన్నట్లుగా.
'ఇప్పటికే ముగ్గురం వున్నాము. నిన్నెలా ఎక్కించుకుంటాము కుదరదు " అని ఆపకుండా వెళ్ళిపోయారు వాళ్ళు.


***


ఇంటర్వ్యూలో వెంగళప్పను ఆఫీసర్ అడిగాదు"సైక్లోన్ అంటే ఏమిటి? ' అని.
'సైకిల్ కొనడానికి సంబంధించిన లోన్ ' అన్నాడు వెంగళప్ప తడుముకోకుండా.

***


వెంగళప్ప ను టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు.'నేను జీవితంలో పెళ్ళి చేసుకోకూడదన్నదే నా ఆశయం. అంతేకాదు నా పిల్లలకు కూడా ఆ ఆశయాన్నే నేను బోధించదలుచుకున్నాను కూడా! " అన్నాడు వెంగళప్ప.

***


ఇస్రో వాళ్ళు వెంగళప్పను చందమామ మీద కు పంపడానికి ఎంపిక చేసి రాకెట్ ఎక్కించారు.కానీ సగం దూరం వెళ్ళకుండానే రాకెట్ లోంచి అతను దూకేశాడు.'ఎందుకలా చేశావు' అంటే ఇవాళ అమావాస్య. చంద్రుడు వుండడు.నన్ను వాళ్ళు మోసం చేయాలనుకున్నారు.నేనది గ్రహించేశానుగా! ' అన్నాడు వెంగళప్ప

***


'నీకు 'మైక్రో సాఫ్ట్ ఆఫీస్' తెలుసా?' ఇంటర్వ్యూలో అడిగారు వెంగళప్పను.
'తెలీదు.కానీ మీరు అడ్రస్ ఇవ్వండి.ఈజీగా కనుక్కుంటాను " అన్నాడు వెంగళప్ప.


***


" ఓ కాంపౌండ్ సెంటెన్స్ చెప్పు "  అని ఇంటర్వ్యూలో అడిగితే వెంగళప్ప 'నోటీసులు అంటించరాదు " అని చెప్పాడు.'అదేమిటి? ' అని అడిగితే 'కాంపౌండ్ మీద అలాంటివేగా వుండేవి ' అన్నాడుట.

***


' క్యాలెండర్ 2012 ఇవ్వవోయ్ 'అని ఒకాయన షాప్ లోని వెంగళప్పను అడిగితే 'సారీ! మీరు ఆలస్యంగా వచ్చారు వెయ్యి మాత్రమే ఉన్నాయి.'అన్నాడట వెంగళప్ప

***

వెంగళప్ప కలర్ టీవీ కొన్నాడు.ఇంటికి తేగానే దానిని నీళ్ళల్లో ముంచాడు.'అదేంపనోయ్'అంటే 'కలర్ వుంటుందో పోతుందో చూద్దామని " అని సమాధానం ' ఇచ్చాడు.

***

వెంగళప్ప ఏ.టి.ఎం కు వెళ్ళాడు.వెనక నుంచున్న మనిషి ' మీ పిన్ నెంబర్ నాకు తెలిసిపోయిందిగా.అది నాలుగు స్టార్స్ ' అన్నాదు.వెంగళప్ప నవ్వి ' పిచ్చివాడా తప్పు అది 1258 ' అన్నాడు.

***


వెంగళప్ప కడుపుతో వున్న తన భార్యకు ఎస్.ఎం.ఎస్. ఇచ్చాడు.కాసేపటికి 'డెలివర్డ్ ' అని కనబడేసరికి ఆనందంతో గెంతులేశాడు.
***

5 comments:

Deadeye said...
This comment has been removed by the author.
Preetam said...

nice one's. had a good laugh. loved the microsoft office joke.

సుధామ said...

Thank you Preetam!

సుధామ said...
This comment has been removed by the author.
srinivas said...

what a jokes superbbbbbbb........