ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, July 10, 2011

నవ్వుల సం(ద)డే !.....

పిసినారి

‘‘నా మిత్రుడు ఒట్టి పిసినారి. పెళ్లయ్యాక హనీమూన్‌కు ఒక్కడే వెళ్లాడు. పెళ్లాన్నివదిలేసి’’ అన్నాడు రఘురాం.
‘‘నా మిత్రుడు మరీ పిసినారి. హనీమూన్‌కు తీసుకెళ్లమని వాళ్లావిడను నాతో పంపించాడు’’ అన్నాడు కళాకృష్ణ.

***

అనుకోవడం

‘‘నా యజమానులు నాకు బాగా పెడతారు, ప్రేమిస్తారు, నాకోసం ఓ చిన్న ఇల్లు కూడా ఏర్పరచారు. నా గురించి చాలా శ్రద్ధపెడతారు. వాళ్లు నిజంగా దేవుడు’’ అనుకుంటుంది కుక్క.
‘‘నా యజమానులు నాకు బాగా పెడతారు, ప్రేమిస్తారు, నాకోసం ఓ చిన్నచోటు కూడా ఏర్పరచారు. నాపట్ల బాగా శ్రద్ధ వహిస్తారు. బహుశా వాళ్లకు నేనే దేవుడు’’ అనుకుంటుంది పిల్లి.

***

జీతం

ధీరజ్ అప్లికేషన్ ఫారం నింపుతున్నాడు ఓ ఉద్యోగంకోసం. ఫారమ్‌లో ఓ కాలమ్‌లో ఏం రాయాలో ఎంతకీ తెలియలేదు. ‘‘శాలరీ ఎక్స్‌పెక్ట్‌డ్’’ అని వున్నచోట చివరకు ఆలోచించి ‘ఎస్’అని రాసాడు.

***

వేగం

‘‘ఏమిటోయ్ బ్రహ్మం! సడన్‌గా కారు వేగాన్ని అంతలా పెంచావ్’’ అడిగాడు డ్రైవర్‌ని సుమన్.
‘‘బ్రేక్ ఫేలయింది సార్! యాక్సిడెంట్ జరిగేలోగా ఇల్లు చేరుకుందామని’’ అన్నాడు బ్రహ్మం.

***

విరాళం

ఓల్డేజ్ హోమ్‌కు విరాళంగా ఏమిచ్చావ్
ఏజ్ ఓల్డ్ పేరెంట్స్‌ని.

***

ఒకటే

‘‘ఏమిటి సుమిరా! నువ్వు రాసిన కుక్క మీద వ్యాసం అచ్చు మీ అన్నయ్య రాసినట్లే వుంది. కాపీ కొట్టావా’’ అడిగింది టీచర్.
‘‘లేదు టీచర్! మా ఇంట్లో వున్నది ఒకే కుక్క కదా’’ అంది సుమిర.

***

ఖచ్చితంగా

సారధి అకౌంటెంట్ ప్రసాద్‌తో మ్యూజియంకు వెళ్లాడు. ప్రసాద్ సారధికి ఒక పెయింటింగ్ చూపించి’’ ఇది అయిదువందల ఏళ్ల ఇరవై రోజుల క్రితంది’’ అన్నాడు.
‘‘వావ్! ఎలా అంత కరెక్ట్‌గా చెప్పగలిగావ్’’ అడిగాడు సారధి.
‘‘ఇరవై రోజుల క్రితం నేను ఈ మ్యూజియంకు వచ్చినప్పుడు గైడ్ దీన్ని చూపించి అయిదువందల ఏళ్ళ క్రితంది అని చెప్పాడు’’ ప్రసాద్ సమాధానం.

***

చూడలేక

శేషాద్రిగారు వయొలిన్ కచేరీ చేస్తూ, కళ్లుమూసుకుని వాయించడం చూసి గోపాలం- ‘‘అలా కళ్లు మూసుకు వాయిస్తారెందుకు’’ అని అడిగాడు.
‘‘ప్రేక్షక శ్రోతల బాధ చూడలేక’’ అన్నారాయన.

***

ఖర్చు

‘‘పెళ్లి చేసుకోవడంవల్ల ఎంత ఖర్చవుతుంది’’ అజయ్‌ని అడిగాడు మిత్రుడు వినయ్.
‘‘నేనెప్పుడూ లెక్కించలేదు ఎందుకంటే అందుకు ఇంకా చెల్లించుకుంటూనే వున్నాను బోలెడు’’ అన్నాడు అజయ్

***


ప్రశ్నలు- జవాబులు


ప్రశ్న: మితిమీరిన దైవభక్తి అంటే?
జవాబు: మింగే మందు బిళ్ళలను కూడా దేవుడికి నైవేద్యం పెట్టి వేసుకోవడం

**

ప్రశ్న: గడియారంలో బ్యాటరీలు తీసేసావెందుకు?
జవాబు: టైమ్‌ని వృథా చెయవద్దన్నారని.

**

ప్రశ్న: ప్రియురాలి బర్త్‌డేకి రెండు ‘రింగ్’లు ఇచ్చావా? దేనికి
జవాబు: సెల్‌ఫోన్‌కి, ల్యాండ్‌లైన్‌కి కూడాను.

**

ప్రశ్న: ‘రసం’ అడిగితే జ్యూస్ షాప్‌వాడు బిత్తరపోయాడా? అదెలా?
జవాబు: ఇక్కడ ‘్భక్తిరసం’ దొరుకుతుందా అని అడిగాం మరి!

**

ప్రశ్న: గవర్నమెంట్ ఆఫీసుల్లో చేతులు తడపాలిట ఎందుకు
జవాబు: పనులు శుభ్రంగా జరగాలి కదా మరి!

**

ప్రశ్న:స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లయినా ఇంగ్లీష్ వల్లే బతుకుతున్నామా అదేంటి?
జవాబు: ఇంగ్లీషు మందులేగా మరి బతికిస్తున్నవి

*****.

1 comments:

jyothirmayi prabhakar said...

జోకులన్నీ చాలా బాగున్నాయండి..ముఖ్యంగా కారు జోకు, రింగ్ జోకు మళ్లీ మ్యూజియం జోకు బాగా నచ్చాయి