ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, September 10, 2017

సాహితీదీపికలు



కీ.శే.కోట శ్రీనివాస వ్యాస్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు గానీ కె.పి.వ్యాస్- ఐ.పి.ఎస్ అంటే తెలియని వారు లేరు.రాజధాని రోడ్ల మీద వాహన సంచారాన్ని గీతలు గీసి నిబంధనల్లో నియంత్రించి ట్రాఫిక్ సెన్స్ అంటూ కలిగించింది ఆయనే!నిఖార్సయిన పోలీస్ ఆఫీసర్ గా ఖ్యాతిగాంచి హైదరాబాద్ లాల్ బహద్దూర్ స్టేడియంలో దారుణ హత్యకు గురి అయినది ఆయనే!ఆయన పేర పోలీస్ అకాడమీలో ఏటా స్మారకప్రసంగాలు జరుగుతున్నాయి.ఆయన కాంస్య విగ్రహం విజయవాడలో కూడా వుంది.

వ్యాస్ గారి ధర్మపత్నియే శ్రీమతి అరుణ. పుట్టింటి వారు గంటి వారు.జీవితపు ఆఘాతాన్ని తట్టుకున్న సాధికారక మహిళగా ఆమె సంస్కృతాంధ్ర ఆంగ్లాలలో నిష్ణాతురాలై ఒక రచయిత్రిగా,గొప్ప విదుషీమణిగా రాణిస్తున్నారు. ఇప్పటికే పది పుస్తకాలకు పైగా రచించి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం.సర్వార్థ సంక్షేమ సమితి,విజయభావనమిత్ర ,రాగరాగిణి సంస్థ;ల ద్వారా ఉత్తమరచయిత్రి అవార్డులు పొందిన శ్రీమతి అరుణావ్యాస్ సరికొత్త వ్యాస సంకలనం ' సాహితీ దీపికలు ' నవచేతన బుక్ హౌస్ ప్రచురణగా వెలువడింది.



మీ సుధామ పై గల గౌరవాదరాలతో సాహితీదీపికలు గ్రంధానికి పీఠిక రాయమని శ్రీమతి అరుణ కోరారు. ముద్రితప్రతి శ్రీమతి అరుణావ్యాస్ గారినుండి అందుకున్నాను.ఆ పీఠిక ,ఆవిడ పలుకు సాహితీదీపికలు గ్రంథంనుండి ఇక్కడ మీ కోసం......

0 comments: