ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, May 1, 2012

ఆహా ! ఏమి 'సౌభాగ్య(మ్)'!




సౌభాగ్య విస్తృతమైన సాహిత్య సృజనకారుడు.


మౌలికంగా కవిత్వంతో మొదలుపెట్టి తన సృజనను అనేకరంగాలకు పరివ్యాప్తిచేశాడు.


బహూశా నాకు తెలిసి ఒక్కసారిగా ఒక రచయిత రాసిన ఇరవై ఏడు పుస్తకాలను ఆవిష్కరించడం అనేది మునుపు ఎన్నడూ జరగలేదు.ఆ పని మొన్న ఆదివారం ఏప్రెల్ 29 న (2012)హైదరాబాద్ నారాయణగూడా తాజ్ మహల్ హోటల్లో జరిగింది.ఆ పుస్తకాలన్నీ సౌభాగ్య రాసినవే.
  

(Sowbhagya' created history by releasing 27 of his books in Hyderabd...it may be a world record....soon we will know)


అందులో ' యాభై దాటిన యవ్వనం ' అనే తన కవితా సంకలనం తో మొదలుపెట్టి, జోక్స్ పుస్తకాలు,ఓషో.జెన్ సాహిత్యం,వ్యక్తిత్వ వికాస గ్రంధాలు,పిల్లలకు పుస్తకాలు అన్నీ వున్నాయి.
హిమకర్ పబ్లికేషన్స్,సరోజారాయ్ కమూనికేషన్స్ ఆధ్వర్యంలో ఈపుస్తకాల ప్రచురణ ఆవిష్కరణ జరిగింది.




సౌభాగ్య మంచి సహృదయ విమర్శకుడు కూడాను. ఆశారాజు. యాకూబ్, కె.వి.రమణ, సుమనశ్రీ,వీరి కవిత్వంపై పుస్తకాలు వెలువరించాడు.


నా'చిత్రగ్రంథి ', 'కవికాలమ్ ' కవితా సంకలనాలు గత ఏడాది నవంబర్ లో ఆవిష్కరించినపుడు నా 'చిత్రగ్రంధి ' గురించి పరిచయం చేస్తూ, తనను సభలో వక్తగా పిలిచింది సుధామ యేనని చెప్పికొని ఎంతో సభారంజకంగా ప్రసంగించాడు.


నిన్న కాగితాలు తిరగవేస్తూ వుంటే ఆ రోజు (28.12.2011)నా ఆవిష్కరణ సభలో మాట్లాడడానికి తను పాయింట్స్ రాసుకుతెచ్చుకున్న కాగితం కనిపించింది.అది నాకు తను ఇచ్చినట్లు గుర్తేలేదు.


సభలో ప్రసంగించడానికి. తను రాసుకున్న ఆ కాగితం తన చేతి రాతలోనే ఇక్కడ పెడుతున్నాను .సౌభాగ్య అక్షరాలు ;ఎంత పొందికగా రాసుకున్నాడో చదవండి.ప్రాస్తావికంగా సభలో తను చెప్పదలుచుకున్న ఉదాహరణాత్మక సమన్వయ అంశాలను ఎలా సూచనగా నోట్ చేసుకున్నాడో నా గురించి రాసిన విషయాల మధ్య గమనించవచ్చు.


సౌభాగ్య చేతి వ్రాత







             నా ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న సౌభాగ్య




సౌభాగ్య ప్రసంగంనుంచి కొంత భాగం
http://youtu.be/EnciiImCt_U


'

2 comments:

సి.ఉమాదేవి said...

రచనాసక్తి,రచనాశక్తి మెండుగాగల సౌభాగ్యగారు పాఠకలోకానికి పంచిన పుస్తకభాగ్యమిది.వారి ప్రసంగవ్యాసాన్ని మీరు అందివ్వడం అభినందనీయం.

సుధామ said...

మీ ప్రతిస్పందనకు ఆనందిస్తున్నాను.ధన్యవాదాలు.