ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, November 7, 2011

కాసేపు నవ్వండి ...ఊరి మహాత్మ్యం

"ఈ ఊళ్ళొ నివాసం వుండడానికి బాగుంటుందా" అడిగాడు కొత్తగా వచ్చిన మనిషి.
"బావుంటుందండీ..నేను ఇక్కడికి వచ్చిన తొలిరోజుల్లో అసలు నడవలేకపోయేవాడిని...గట్టిగా వున్న ఘన పదార్థాలూ అవీ తినలేకపోయేవాడిని.మరిప్పుడు చూడండి ఎలా వున్నానో" చెప్పాడు ఆ ఊళ్ళో మనిషి.
"అయితే ఈ ఊళ్ళో చాలా మహాత్మ్యం వుందన్న మాట" ఆశ్చర్యపోతూ అన్నాడు కొత్త వ్యక్తి.
"ఏమీలేదు సార్!.. వీడు పుట్టింది ఈ ఊళ్ళోనే"చెప్పాడు ఆఊళ్ళో మనిషి పక్కనే వున్న వ్యక్తి .

***

విదేశీ

"మీ ఆవిడ ఫారిన్ రెటరండా..అబ్బో! ఎలా?"
" మొన్న ఈ మధ్యే మా పెద్దమ్మాయి పురిటికి సాయానికని అమెరికా వెళ్ళివచ్చింది "
"ఆ!.."

***

హిం(టిం)గ్లీష్ (ఈ భాషే వేరు)

తేనీరు: బ్రింగ్ వాటర్

బిల్డర్లు: బిల్లు చూసి దడుచుకునే వారు

వేస్టేజ్: పనికిరాని వయసు


***

ప్రశ్న: అప్సరసలు పాతాళంలో ఎందుకు వుండరు

జవాబు: అప్ అంటే పైన అని అర్థం. స్వర్గం పైనే వుంది కనుక 'అప్ సరసలు ' అక్కడే వుంటారు.


***

లాజిక్

"మీ ఆయన ఆడపిల్లల వెంట పడుతున్నాడట జాగ్రత్త లతా!"
"ఏం పర్వాలేదు.కుక్కలు కార్ల వెంట పరిగెత్తినంత మాత్రాన కారుని నడప లేవుగా!"

***

SMS (సరదా మాటల శైలి )

ఓ సర్దార్జీ ఓ ఆసుపత్రిలో నర్సుని ప్రేమించాడు. ఆమెకు తన ప్రేమను ఎస్సెమెస్ ద్వరా తెలపాలని బాగా ఆలోచించి ఆలోచించి చివరకు ఇలా ఎస్సెమెస్ చేశాడు
"ఐ లవ్ యూ సిస్టర్"

***

3 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

ప్రతి జోకూ సుధామ ధురమే ! ధన్యవాదాలు

subha said...

Ha ha ha... nice jokes.

Anonymous said...

బాగున్నాయి...