ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Wednesday, October 19, 2011

దీపాంజలి

ముందస్తుగా ముట్టించిన దీపం


నా 16 వ ఏట

కవిత్వం రాయడం ప్రారంభించాక,

దీపావళి పై నేను మొదటగా 1968 లో రాసిన ఈ కవిత

నాటి 'చుక్కాని 'వార పత్రిక(1.11.1968) సంచికలో

ప్రచురింపబడింది.


ఇప్పుడు అది తలుచుకోవడం

ఒక సరదా అంతే!



దీపాంజలి


తమస్సులను కడిగివేయ
రోచిస్సులనందజేయ
జనావళి ముదముబడయ
వచ్చెనిదే దీపావళి


చీకటిలో అలుముకున్న
అవినీతి అంబరాన
దీపకళికలే వెలసెను
చీకట్లను పారద్రోలి


అమావాస్య రాత్రియంత
పున్నమి రేయనిపించగ
పురవీధులనెటుజూచిన
దీపకాంతి అగుపించెను


ఇదిగిదిగో
వచ్చెనిదే దీపావళి
ప్రజావళి
హాసావళి


శత్రుసేన గుండెల్లో
దూసుకున్న గుండుల్లా
మందుగుండ్లు ప్రేలెనిదే
కనువిందొనగూర్చెనిదే


ఇదిగో!
ఇది దీపావళి దీపావళి
ధరణిలోని ప్రజావళి
మహాత్ములకిచ్చునట్టి
కైమోడ్పుల దీపాంజలి


**

1 comments:

రసజ్ఞ said...

అమావాస్య రాత్రియంత
పున్నమి రేయనిపించగ
పురవీధులనెటుజూచిన
దీపకాంతి అగుపించెను బాగుందండీ! మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు(ముందస్తుగా)!