ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Tuesday, May 24, 2011

నవ్వాలనిపిస్తేనే స్మీ!............

అందుకని......

కాలేజీలో రాంబాబు శారద వెంటపడుతున్నాడు. శారదకు కోపం వచ్చి ఓరోజు నిలదీసింది.
‘‘ఏయ్ మిస్టర్! నీకు అక్కచెల్లెళ్లు లేరా?’’
‘‘అయ్యో లేకేమండీ! ఉన్నారు. వాళ్లకు మీలాంటి మరదలు, మీలాంటి వదిన కావాలట. అందుకని’’ అన్నాడు రాంబాబు కూల్‌గా.

ఆచారం


చర్చిలో పెళ్లి జరుగుతోంది. ‘వధువు తనకు కలగబోతున్న తొలి సంతోషానికి చిహ్నంగా స్వచ్ఛమైన తెల్లని పెండ్లి దుస్తులు ధరించడం ఆచారం’ అని వివరిస్తున్నాడు ఫాదర్.
‘‘అందుకే కాబోలు, వరుడు నల్లని సూటు వేసుకోవడం కూడా పెళ్లిలో ఆచారం’’ అన్నారెవరో వెనకనుండి.

కారణం

‘‘మారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని ఎందుకన్నారంటావ్! పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయంటావా?’’ అడిగాడు రామారావు సాకేత్‌ను.
‘‘ఖచ్చితంగానూ! ఎందుకంటే తర్వాత జీవితం నరకంలోనే అని గ్రహించాలి మరి’’ అన్నాడు సాకేత్

ప్రశ్న


‘‘నా బొచ్చుకుక్కకు మొహం నిండా బొచ్చు పడి దారెలా తెలుస్తుందని నీ వెధవ ప్రశ్న. నేను లేనటయ్యా గొలుసు పట్టుకుని’’

తేడా

‘‘ప్రేమకు పెళ్లికి తేడా ఏమిటో చెప్పగలవా?’’
‘‘జుట్టులోకి వ్రేళ్లు పోనిచ్చి మాట్లాడితే ప్రేమ. జేబుల్లోకి వ్రేళ్లు పోనిచ్చి మాట్లాడితే పెళ్లి.’’

సొంతం

బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ఒకసారి అన్నాడు-
‘‘ప్రతి మగవాడికి ఒక భార్య ఉండడం చాలా అవసరం’’
కాస్సేపాగి వివరించాడు-
‘‘సొంత భార్య సుమా!’’

లాభం

ఓ జర్నలిస్టు కొత్త హీరోయిన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతూ చివరకు ఇది కూడా అడిగాడు.
‘‘సంతాన నిరోధం గురించి మీ అభిప్రాయం?’’
‘‘పెళ్ళికి ముందు దానివల్ల చాలా లాభాలున్నాయి. పెళ్లయిన తరువాత దానివల్ల దేశానికి మాత్రమే లాభం’’ అందా హీరోయిన్.

వద్దు

అద్దేపల్లి, ద్వాదశి చాలాకాలానికి కలిసారు. పోష్ హోటల్లోకి వెళ్లారు.
ద్వాదశికి ఆతిథ్యం ఇద్దామని అద్దేపల్లి అడిగాడు-
‘‘టీ కావాలా?’’
‘‘టీ వద్దు.’’
‘‘పోనీ కాఫీ తాగుతావా!’’
‘‘కాఫీ వద్దు.’’
‘‘ఏదైనా కూల్‌డ్రింక్స్’’
‘‘కూల్ డ్రింక్స్ వద్దు.’’
‘‘అయితే విస్కీ, సోడా తెప్పించనా’’
‘‘సోడా వద్దు.’’

అర్థం

‘‘ఇవాళ నా పుట్టినరోజు. రాత్రి మాత్రం భలే కలవచ్చింది సుమండీ! నాకు మీరు వజ్రాల నెక్లెస్ కొన్నారట. ఇలా కలవస్తే అర్థమేమై ఉంటుంది’’ అంది ఉష గారంగా వాళ్లాయన వెంకట్రావ్‌తో.
‘‘సాయంత్రం నీకే తెలుస్తుందిగా’’ అన్నాడు వెంకట్రావ్.
సాయంత్రం భర్త చక్కని చిన్న ప్యాకెట్‌తో ఇంటికి వచ్చాడు. ఉష ఆదరంగా ఎదురువెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకుని ఆత్రంగా విప్పింది. లోపల చక్కని పుస్తకం వుంది- ‘‘కలలూ- వాటి అర్థాలూ’’.

అలసట

‘‘నువ్వు పనిలో కుదిరేటప్పుడు ఎంతపనయినా చేస్తాను అలసిపోను అని చెప్పావ్! చేరినప్పటి నుంచీ చూస్తున్న పనీలేదు పాటాలేదు. నిద్రపోవడమే కనిపిస్తోందే’’ నౌకరుని అడిగాడు యజమాని.
‘‘అదే దొరా! అలసిపోకుండా ఉండేందుకే నిద్రపోతూంటాను’’ అన్నాడు నౌకరు.

బిస్కెట్లు


‘‘నువ్వు అంత బాగా మన ఓవెన్‌లో బిస్కెట్లు చేయగలవని నాకు తెలియనే తెలియదోయ్! చాలా బాగున్నాయి నువ్వు చేసిన బిస్కెట్లు’’ అన్నాడు బాబూరావ్ భార్య ఝాన్సితో
‘‘పోనె్లండి. నే చేసిన బిస్కెట్లు మీకైనా బావున్నాయి. సూపర్ మాల్స్‌లో బోలెడు డబ్బెట్టి కొనడమెందుకని నేనే చేశానా! మన కుక్క మాత్రం ఒక్కటి కూడా ముట్టుకోలేదు’’ అంది ఝాన్సీ.

3 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

నవ్వకూడదని మూతి బిగించుకొనే వచ్చాను. కానీ పళ్ళు బయట పడిపోయాయి.

KumarN said...

ha ha ha
చర్చిలో పెళ్లి జరుగుతోంది. ‘వధువు తనకు కలగబోతున్న తొలి సంతోషానికి చిహ్నంగా స్వచ్ఛమైన తెల్లని పెండ్లి దుస్తులు ధరించడం ఆచారం’ అని వివరిస్తున్నాడు ఫాదర్.
‘‘అందుకే కాబోలు, వరుడు నల్లని సూటు వేసుకోవడం కూడా పెళ్లిలో ఆచారం’’ అన్నారెవరో వెనకనుండి.

CH.K.V.Prasad said...

మనసారా నవ్వాము తెలుసా !