ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, April 14, 2011

పూతరేకులు.4

రోబో సినిమా చూసాక నీకు ఏమనిపించిందిరా ప్రీతమ్’’ అడిగాడు స్నేహిత్.
‘‘ఓ అమ్మాయి అబ్బాయినే కాదు. యంత్రాన్ని కూడా చెడగొట్టగలదని’’ అన్నాడు ప్రీతమ్
పేదల భోజనం

ఆహార పదార్థాలు అతి చౌకగా దొరికే ఒక చోటుంది. కానీ అక్కడ కేవలం చాలా పేదవారే తినగలరు. మనం తినడానికి కుదరదు. అక్కడి రేట్లు అవి
.టీ: ఒక్క రూపాయి
సూప్: అయిదు రూపాయల యాభై పైసలు
పప్పు: రెండు రూపాయలు

భోజనం: రెండు రూపాయలు
చపాతి: రూపాయి
చికెన్: 24 రూపాయల 50 పైసలు

దోశ: నాలుగు రూపాయలు
వెజిటబుల్ బిర్యాని: ఎనిమిది రూపాయలు
చేప: 13 రూపాయలు
ఇవి ఇండియన్ పార్లమెంట్ హౌస్ క్యాంటిన్‌లో ధరలు. ఇంత చౌకగా తినే, పాపం ఆ పేదవాళ్ల జీతాలు నెలకు ఒకటిన్నర లక్ష రూపాయలే. ఏవో లక్షలాది రూపాయల ప్రయాణ ఖర్చులు. కోడాలు, రాడియాలు, కల్మాడీలు, రాజాలు ఈ తిండి తినే పాపం శక్తి పుంజుకోగలిగారు
.
మార్పు
‘‘ కాలానుగుణంగా అమ్మాయిల్లో చాలా మార్పు వచ్చింది’’ అన్నాడు సూర్యనారాయణ ప్రభతో.
‘‘ఎలా గుర్తించావ్’’ అడిగింది ప్రభ
. ‘‘మునుపు అమ్మాయిలు తల్లుల్లాగా చక్కగా వంటలు వండేవారు. ఇవాళ తండ్రుల్లా తిని, తాగి తందనాలాడుతున్నారు’’ అన్నాడతను.
మరుపు
సరస్వతీ లేహ్యం కొని వాడావుగా. నీ జ్ఞాపకశక్తి మీద అదేమయినా పనిచేసిందా?’
‘‘ఓ! బాగా పనిచేసింది?’
‘‘అలాగా! ఎలా పనిచేసింది.
’’
‘‘ఏమో అది మాత్రం గుర్తులేదు.
’’ సులభం
్ఫజిక్స్ ఇప్పుడున్న దానికంటే సులభంగా ఎప్పుడు వుండగలదు చెప్పు సుమిరా’’ అడిగింది టీచర్.
‘‘యాపిల్ పండు బదులు మొత్తం చెట్టే న్యూటన్ నెత్తిమీద పడి వుంటే మేడమ్’’ అంది సుమిర ఉక్రోషంగా.

నిజాలు
‘‘తాగినవాడు అన్నీ నిజాలు కక్కేస్తాడట నిజమేనా సార్’’ అడిగాడు రక్షిత్ వాళ్ల సార్‌ని.
‘‘అవున్రా అబ్బాయ్’’ అన్నాడాయన.
"అయితే పరీక్ష పేపర్ రాసేముందు స్టూడెంట్స్ అంతా త్రాగివస్తాం సార్’’ అన్నాడు రక్షిత్.
ఆనందం
ఒక అమ్మాయితో వుండడం ఆనందం
ఇద్దరితో మహానందం
ముగ్గురమ్మాయిలతో పరమానందం
చాలామంది అమ్మాయిలతో వుంటే స్వామీ నిత్యానందమే.
కారణం ‘‘హిమాలయాలకు వెళ్లొచ్చాక రజనీకాంత్ ఒబామాను కలిసాడట ఎందుకంటావ్
. ‘‘సాధారణ వ్యక్తులను కలవడం రజనీకాంత్‌కు ఇష్టంట అందుకని.
’’
ప్రశ్నలు- సమాధానాలు
ప్రశ్న: ఒకతని చేతికి ఆరువేళ్లున్నాయి. జనం అతన్ని ఆంజనేయులు అని పిలిచేవారు ఎందుకో చెప్పుకోండి.
జవాబు: అతని పేరు ఆంజనేయులు కనుక.
* * * ప్రశ్న: హిందీవారు కలర్‌ఫుల్ తమిళునిగా ఎవరిని భావిస్తారు
. జవాబు: రంగమన్నార్ రంగరాజన్.
* * * ప్రశ్న: ఇంత తెలివైన దానివి నీకెందుకింకా పెళ్లికాలేదు
. జవాబు: నాకందరూ ఇలాంటి చవట ప్రశ్నలు వేసేవారే కనబడుతున్నారు మరి.
* * * ప్రశ్న: ఓ ఏనుగుపిల్ల చీమతో ప్రేమలో పడింది. కానీ చీమ తల్లితండ్రులు వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. దానికి వారు చెప్పిన కారణం ఏమిటి?
జవాబు: పిల్లకు దంతాలు బయటికి పొడుచుకుని వున్నాయి.
* * * ప్రశ్న: టిఫిన్‌గా ఎప్పటికీ తినలేనిది ఏమిటి
జవాబు: భోజనం.

0 comments: