ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 26, 2011

శుభ'ఖర'ఉగాదిని స్వాగతిద్దాం




నేను పుట్టిన సంవత్సరం వచ్చేస్తొంది.అప్పటి 1951'ఖర 'నా వూహలో నైనా లేదు.ఎందుకంటే అప్పుడు పసివాడిని కాబట్టి.అరవై సంవత్సరాల తరువాత రాబోయే 2071'ఖర'అప్పటికి ఖఛ్చితంగా నేను ఉండను.ఎందుకంటే నేను ౧౨౦ సంవత్సరాలు బ్రతుకుతానన్న గ్యారెంటీలేదు కాబట్టి.అందువల్ల నేను చూసేదీ,అనుభూతి చెందేదీ రేపు2011 ఏప్రెల్ 4న వచ్చి ఏడాదిపాటు వుండే 'ఖర ' నామ సంవత్సరమే. ఇంతకీ ఖర అంటే గాడిద అని అర్థం. తెలుగు సంవత్సరాలలో జంతువు పేరున ఉన్న ఒకే ఒక సంవత్సరం' ఖర '.


వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట.దాని విలువ అంతటిది.సంసారమే ఒక గాడిద బరువు.దాన్ని మోసే ప్రతివాళ్ళం ఎంతోకొంత గాడిదలమే.నిజానికి మన దేహమే ఒక వస్త్రం.మలిన వస్త్రాలను ఆత్మ వివేకమనే చాకిరేవు దగ్గర ఉతికి తెచ్చుకోవలసిందీ మనమే.అంచేత ఖర ను చులకనగా చూడనవసరం లేదు.


శ్రీఖర శుభకరమైనదే.గాడిదకున్నంతసహనం, ఆగ్రహం వస్తే దేనినైనా వెనుక కాళ్ళతో తన్నివేయగల తిరుగుబాటు దానినుండి నేర్చుకోవలసినవే.మునుపు మడేలు వాన వస్తోందన్న సంగతి కూడా గాడిద చెవులను చూసి గుర్తించేవాడట.అంచేత వికృతికి వీడుకోలు పలికి 'ఖర 'ను తొడ్కువద్దాం సిద్ధం కండి.

3 comments:

Omprakash Narayana Vaddi said...

సుధామ గారు... ఖర అంటే పదునైన అనే అర్ధమూ ఉందట....

గీతిక బి said...

సుధామ గారూ...

మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నాను. బ్లాగే కాదు... బ్లాగు పేరు కూడా చాలా బాగుంది.

పత్రికల్లో రచనల ద్వారా మీరు పాఠకులకి సుపరిచితమే. ఈ బ్లాగులో వ్రాసే పోస్టుల ద్వారా మీరు అంతర్జాల చదువరులకీ... సుపరిచితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

బ్లాగులు లోగిలిలోకి ఆహ్వానిస్తూ...

గీతిక బి

SHANKAR.S said...

అయితే షష్టి పూర్తి సంవత్సరం లో అడుగుపెడుతున్నరన్నమాట. అభినందనలు