ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, September 2, 2017

సమాజహిత చింతనా భావజాలం... కశప

Home

Saturday, September 02, 2017 06:47

అక్షర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.


*
కథ, కవిత అనుసంధానం చేసే ఒక ప్రక్రియకు డా.బి.వి.ఎన్. స్వామి శ్రీకారం చుట్టారు. తానొక కథ అల్లుకుని, ఆ కథాసారానికి అనువైన మకుట సహితమైన ఒక శతక పద్యాన్ని జంటించారు. మరో విశేషం - ఆ పద్యంలోని మూడవ పాదంలోని ఒక పదమే ఆ చిన్న కథకు శీర్షికగా నిలపడం, ఆ పదం కథలో ఎక్కడో అక్కడ ఔచితీమందంగా ప్రయోగించడం.
కథనూ శతక పద్యాన్నీ అనుసంధానం చేసే సంవిధానం కనుక ఈ ప్రక్రియకు ‘కశప’ అని పేరు పెట్టారు. మల్లికార్జున పండితారాధ్యుని ‘శివతత్వసారం’తో మొదలుపెట్టి, పలు ప్రాచీన, ఆధునిక శతక పద్యాలను ఇందూరు పద్యభారతి తెలంగాణ శతకం వరకు నూట పదిహేడు పద్యాలను ఈ నూట పదిహేడు కథలకూ భిత్తికగా నిలిపారు.
డా.బి.వి.ఎన్.స్వామి కథకులే. ఆయన రాసిన నూట పదిహేడూ చిన్న కథలే. బుంగి, తను ప్రధానమైన రెండు పాత్రలుగా, సంభాషణాత్మకంగా సాగే ఈ కథలు వర్తమాన సమాజానికి, మనుషులకు, సదరు తీరుతెన్నులకూ అద్దం పడుతూనే ఒక ‘హితచింతన’తో చెప్పిన కథలు. ఆ కథలకన్నింటికీ చివర్లో అనువైన ఏదో ఒక శతక పద్యాన్ని మునుపు పిల్లలకు కథ చెప్పాక చివర్లో నీతి వివరించినట్లు గుదిగుచ్చారు. ఈ ప్రయోగాన్ని ‘పరిశీలన’ చేసిన డాక్టర్ మచ్చ హరిదాసు గారన్నట్లుగా సంఘటన ప్రధానంగా సాగే ఈ కథల్లో ‘బుంగి’ బహుముఖాలుగా చిత్రితమయ్యాడు. ఈ కథల్లో తెలంగాణ భాష, యాసతో ఆకట్టుకునే కథలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన శతక కవుల పద్యాల ఎంపిక ఈ కథలకు సమన్వయం చేయడంలో స్వామిగారు చూపిన కలివిడితనం ‘తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతూనే ఉంటాయి’ అన్న ఆరుద్ర నుడిని గుర్తుచేసేదిగా ఉంది. అంతెందుకు పోతన నారాయణ శతకంలోని ఓ పద్యంకు చెప్పిన ‘్ధృతి’ కథ పుస్తకానికి ‘పరిశీలన’ సంతరించిన హరిదాసు గురించే. ఇలా స్వామి ఈ కథల్లో చెప్పిన అంశాలు ఎప్పటి కాలానికో, మనుషులకో చెందినవి కావు. వర్తమానాల వర్తమానాలే! రైతు ఆత్మహత్య హేతువైన చెర్లాటలను కూడా వాస్తవ కథలుగా చెప్పిన సందర్భంగా ఉంది.
ఈ కథల్లోంచి ఏరుకోదగిన నిష్ఠుర సత్యాలు, నిజ నిర్ధారణలు, మానవ స్వభావ వైఖరులు అనేకం. మచ్చుకి కొన్ని.
‘కుల సంఘంలో మొదటి నుండీ తెర వెనుక బాగోతం నడిపిన వాడు ప్రతి నాయకుడుగా తలెత్తాడు. ఏకముఖంగా సాగాల్సిన ఆధ్యాత్మిక బాట రెండుగా చీలడం ద్వైతం.’ (గుడి)
‘పెళ్లికి ముందు స్వేచ్ఛ అధికం. దానికి ప్రేమని పేరు పెట్టుకున్నరు. పెళ్లి తరువాత పరిమితులు అధికం. దాన్ని భరించలేక జీవితానికి పగుళ్లు పడుతున్నవి. సమన్వయంతో పగుళ్లను మూసివేయవచ్చు. కాని అది జరగడం లేదు.’ (కూరిమి)

‘ఏ పత్రిక చూసినా హత్య, ఆత్మహత్య, ప్రమాద చావులు, అత్యాచార హత్యలు, చోరీ హత్యలు, పరువు హత్యలు, పగ హత్యలు ఇలా ఊహించడానికే వీలుకాని కలికాలపు చావులు కనబడుతున్నయి.’ (కలి)

‘పురాతన కాలంలో దట్టమైన అడవుల నుండి గుట్టల నుండి నదులు పారడం వల్ల చెట్లతో జరిగిన ఒరిపిడి వల్ల నీటికి ఔషధ గుణం అబ్బింది. అలాంటి ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల మేలు కలిగేది. ఈ కాలపు నదులు కాలుష్యపు కాసారాలు. అందులో స్నానం చేస్తే చర్మవ్యాధులు కలుగుతున్నయి.’ (భక్తి)

‘అవినీతి సొమ్ముతో అందలం ఎక్కి అందరిచే గొప్ప అనిపించుకోవడం సర్వసాధారణమైంది. లక్షల కోట్లు తిన్న రాజకీయ నాయకుడు ఏమీ తెలియనట్లు, ఎరగనట్లు నవ్వుతూ చేతులూపుతూ జైల్లోకెళ్లడం ఏ విలువను ప్రతిష్ఠిస్తుంది.’ (వారు)

‘ఆనాటి వ్యాపారులకు తాము జనం వల్ల బ్రతుకుతున్నామనే స్పృహ ఎక్కువగా ఉండేది. ఈనాటి వాళ్లు మా వల్లనే జనం బ్రతుకుతున్నారనే అహంలో ఉన్నారు.’ (ధనము  - ధర్మము)

‘కులానికి, వంశానికి, సంస్కృతికి ఆస్తికి పిల్లలే వారసులు అనే స్థిరాభిప్రాయం ఇంతవరకు ఉంది. ఇప్పుడు ఆస్తికి, అంతస్తుకు, అభిజాత్యానికి, హోదాకు పరువుకు పిల్లల్నే ప్రతీకగా చూపిస్తున్నరు. పిల్లలు అట్లా ఉండకుంటే హింసిస్తున్నరు. ఈ విలువలు పరారుూకరణకు పరాకాష్టలు. పరాయి బతుకులు, పరువు హత్యలు వీటి ప్రతిఫలనాలు. కొత్త విలువల వల్ల సౌఖ్యం విరబూయాలి. శ్మశాన స్థితి తాండవించకూడదు.’ (మృగం)

ఇలా వీటిల్లో అభివ్యక్తమయ్యే సమాజ హితచింతనా భావజాలం వీటికి కథల సౌరుకన్నా, ఒక మానవీయ విలువల ఆరాటాన్ని, వ్యాఖ్యాన గుణాన్ని చేకూర్చింది. ఈ కశపలోని కబుర్లకు శతక పద్యాలు అధిక శాతం ఔచితీమంతంగానే సమన్వయం అయ్యాయి. కథాసారాంశాన్ని శీర్షిక ప్రతిబింబించాలనే నియమం పెట్టుకోలేదని హరిదాసు గారన్న మాట కూడా నిజమే! ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారన్నట్లు ఇది సృజనాత్మక ప్రక్రియ కురచ కథలు. క్లుప్తతను సాధించిన ఈ ప్రయత్నం ఆహ్వానించదగింది. ఈ ‘కశప’కు ‘పశక’ (పదుగురి శభాష్‌ల కరచాలనం) లభించాలని కోరుకుందాం. ప్రయోగశీలికి అభినందనలు.
-సుధామ
కశప
(కథా శతక పద్యం)
-డా.బి.వి.ఎన్.స్వామి
నవచేతన పబ్లిషింగ్ హౌస్
గిరిప్రసాద్ భవన్
బండ్లగూడ (నాగోలు)
జిఎస్‌ఐ పోస్ట్
హైదరాబాద్-68.
వెల: రూ.95/-





0 comments: