ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, December 12, 2015

ఆధునిక భావాల సమాహారం‘‘కవిత్వంలో, కథల్లో గణాంకాలు పోలికలు ఎక్కువైతే రసం తక్కువవుతుందని తెలిసీ, సమాచారాన్ని అందించే వాహకంగా నేను నా కవిత్వాన్నీ, కథల్నీ రూపొందించాను’’ అంటున్న డాక్టర్ లంకా శివరామ ప్రసాద్ గారి ఏడవ కవితా సంపుటి ‘మరణ శాసనం’. యాభై కవితల ఈ దీర్ఘ సంపుటిలో అందుకే వచనత్వం భాసించి రాణించడమే కనిపిస్తుంది! కవిత్వమంటే కబుర్లు కావుగానీ, కబుర్లు చెప్పినట్టుగా కవిత్వం రాయడం డాక్టర్‌గారికే చెల్లింది.

సంతోషమే మానవ జీవిత పరమార్ధమైనప్పుడు
కావాలని దుఃఖపు మడుగుల్లోకి దూకుతున్నావెందుకు
చేయడానికింత పని, ప్రేమించడానికో తోడు
ఆశించడానికో గమ్యం ఇవిచాలదా మనిషికి


అంటారు ‘ముళ్లబాట’ అనే కవితలో.


‘‘శాశ్వత సత్యం మరణమే అని తెలిసినా సత్యానే్వషణ కొనసాగించడం జీవలక్షణం’’ అంటూ తాము కన్న, విన్న, అంతరంగాన తలబోసిన సత్యాలనే జీవన పరమార్ధంగా అభివ్యక్తీకరించారు వీటిల్లో.
కళ్లెదుట వున్న భువిని స్వర్గంగా మలచుకోరా మూర్ఖుడా
కానరాని స్వర్గం కోసం నేలను నరకంగా మారుస్తావెందుకు
అని నిలదీస్తారు.


కాకిలెక్కలు, కారుకూతలు, గందరగోళం, వల్లకాళ్లు, కంకాళాలు, నెత్తురు మరకలు వంటివన్నీ వున్న ఈ సంపుటి ఆయన భావనలో ఆధునికాంతర విచిలిత స్వప్నకవిత్వం. అర్ధశతం పైగా అనేక గ్రంథాలు ఇప్పటికే వెలువరించిన లంకా శివరామప్రసాద్‌గారు ఈ సరికే కవిగా పాఠక సమాదరణ అందుకున్నారు. ‘మరణశాసనం’ కూడా దానికి అపవాదు కాదు.


-సుధామ


మరణ శాసనం (కవిత్వం)
-డా.లంకా శివరామప్రసాద్
వెల: రూ.100
-సృజనలోకం
ప్రశాంతి హాస్పటల్, శివనగర్, వరంగల్Akshara 12.12.20150 comments: